పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

డ్రోన్ రూల్స్, 2021 కింద మొదటి టైప్ సర్టిఫికేట్ ను గురుగ్రామ్ కు చెందిన ఐవో టెక్ వరల్డ్ కు ప్రదానం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి


డ్రోన్ రూల్స్, 2021 ప్రకారం, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత కేవలం 34 రోజుల్లోనే ఫస్ట్ టైప్ సర్టిఫికేట్ (టిసి) అందజేత

భారతదేశంలో తయారు చేయాల్సిన ప్రపంచ స్థాయి డ్రోన్ల కోసం పర్యావరణ వ్యవస్థ కు దోహదం చేయనున్న డ్రోన్ సర్టిఫికేషన్ పథకం

Posted On: 14 JUN 2022 1:34PM by PIB Hyderabad

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈ రోజు డ్రోన్ రూల్స్, 2021 కింద మొదటి టైప్ సర్టిఫికేట్ (టిసి)ని ఐవో టెక్ వరల్డ్ ఏవిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రదానం చేశారు.  గురుగ్రామ్ కు చెందిన ఐవో టెక్ వరల్డ్ ఏవిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏప్రిల్ 2017 లో స్థాపించబడింది. భారతదేశ ప్రముఖ కిసాన్ డ్రోన్ల తయారీ సంస్థలలో ఇది ఒకటి.

11 మే 2022 న డిజిసిఎ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో  ఆన్ లైన్ దరఖాస్తును సమర్పించిన తరువాత 34 రోజుల్లోనే ఐఓటెక్ టైప్ సర్టిఫికేట్ ను  పొందింది. వాస్తవానికి డ్రోన్ నిబంధనలు, 2021, టైప్ సర్టిఫికేట్ ను జారీ చేయడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) లేదా సర్టిఫికేషన్ బాడీస్ (సిబి) కు 60 రోజులు , డిజిసిఎకు 15 రోజులు (అంటే మొత్తం 75 రోజులు) అనుమతిస్తాయి.అవసర మైన పత్రాలు , టెస్టు నివేదికలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉంటాయి.

2021 ఆగస్టు 25 న డ్రోన్ రూల్స్ -2021 న నోటిఫై చేశారు. డ్రోన్లకు టైప్ సర్టిఫికేట్ (టిసి) పొందడానికి 'సర్టిఫికేషన్ స్కీం ఫర్ అన్ మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ (సిఎస్యుఎఎస్)' ను 26 జనవరి 2022 న నోటిఫై చేశారు.

క్యూ సి ఐ. ద్వారా ఆమోదించబడిన ప్రపంచ ప్రఖ్యాత సర్టిఫికేషన్ సంస్థలు (సిబి) మూడు ఉన్నాయి - అవి టిక్యూ సెర్ట్, యుఎల్ ఇండియా , బ్యూరో వెరిటాస్.  డ్రోన్ తయారీదారులు తమ డ్రోన్ ప్రోటోటైప్ ను పరీక్షించడానికి ఏదైనా సర్టిఫికేషన్ సంస్థను సంప్రదించవచ్చు.

జనవరి 2022 నాటి డ్రోన్ సర్టిఫికేషన్ స్కీమ్ ను  క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డ్రోన్ స్టార్టప్l లు, పరిశ్రమ, విద్యా, రక్షణ రంగాల నిపుణులతో సంప్రదించి అభివృద్ధి చేసింది.

ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా, సమస్యా పరిష్కర్త గా పాత్రను పోషించింది.

డ్రోన్ సర్టిఫికేషన్ పథకం ప్రపంచ స్థాయి డ్రోన్లను భారతదేశంలో తయారు చేయడానికి,  ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి పర్యావరణ వ్యవస్థను సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం 14 డ్రోన్ ప్రోటోటైప్ లకు ధృవీకరణ పరీక్షలు  జరుగుతున్నాయి. టైప్ సర్టిఫైడ్ ప్రోటోటైప్ ల సంఖ్య రాబోయే మూడు సంవత్సరాల్లో 100 పైగా ఉండవచ్చు.

 

ఈ సందర్భంగా శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా మాట్లాడుతూ, డ్రోన్ రూల్స్, 2021 కింద మొట్ట మొదటి టైప్ సర్టిఫికేట్ (టిసి) తీసుకున్న ఐఒటెక్ వరల్డ్ ఏవిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ను అభినందించారు.పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి

దార్శనికత "కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన‘

దిశగా పనిచేస్తోందని ఆయన చెప్పారు. 2030 నాటికి భారతదేశం డ్రోన్ హబ్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని,  రికార్డు స్థాయిలో 34 రోజుల్లో టైప్ సర్టిఫికేట్ జారీ చేయడం ఆ దిశగా ఒక అడుగు అని అన్నారు. ఇతర డ్రోన్ ప్రోటోటైప్లకు కూడా త్వరలోనే సర్టిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇతర డ్రోన్ సంస్కరణలు

A.కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది విధంగా అనేక సంస్కరణ చర్యలను చేపట్టింది:

B.సరళీకృత డ్రోన్ రూల్స్, 2021 ఆగస్టు 25, 2021న నోటిఫై చేయబడింది

C.డ్రోన్ గగనతల మ్యాప్ 2021 సెప్టెంబర్ 24 న ప్రచురించబడింది, ఇది డ్రోన్లు 400 అడుగుల వరకు ఎగరడం కోసం భారత గగనతలంలో దాదాపు 90% ను గ్రీన్ జోన్ గా తెరుస్తుంది

D.డ్రోన్ల కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాన్ని 30 సెప్టెంబర్ 2021 న నోటిఫై చేశారు.

. యు ఎ ఎస్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ (యు టి ఎం) పాలసీ ఫ్రేమ్ వర్క్ ను 2021 అక్టోబర్ 24న ప్రచురించారు.

ఎఫ్.వ్యవసాయ డ్రోన్ల కొనుగోలుకు ద్రవ్య గ్రాంట్ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2022 జనవరి 22 న ప్రకటించింది.

జి. డ్రోన్ రూల్స్, 2021 కింద మొత్తం ఐదు దరఖాస్తు ఫారాలను 2022 జనవరి 26న డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ లో ఆన్ లైన్ లో పొందుపరిచారు.

హెచ్. డ్రోన్ సర్టిఫికేషన్ స్కీం 2022 జనవరి 26 న నోటిఫై చేయబడింది, ఇది డ్రోన్ తయారీదారుల ద్వారా టైప్ సర్టిఫికేట్ పొందడం సులభతరం చేస్తుంది.

. 2022 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ లో డ్రోన్ స్టార్టప్ లకు  మద్దతు ఇవ్వడానికి, డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (డీఆర్ఏఏఎస్)ను ప్రోత్సహించడానికి మిషన్ 'డ్రోన్ శక్తి'ని ప్రకటించారు.

జె. విదేశీ డ్రోన్ల దిగుమతిని నిషేధిస్తూ, డ్రోన్ విడిభాగాల దిగుమతిని స్వేచ్ఛగా ఉంచుతూ 2022 ఫిబ్రవరి 9న డ్రోన్ దిగుమతి విధానాన్ని నోటిఫై చేశారు.

కె. డ్రోన్ పైలట్ లైసెన్స్ అవసరాన్ని రద్దు చేస్తూ 2022 ఫిబ్రవరి 11 న డ్రోన్ (సవరణ) నిబంధనలు, 2022 ను నోటిఫై చేశారు.

ఎల్. డ్రోన్లు , డ్రోన్ భాగాలకుపిఎల్ఐ పథకం కోసం తయారీదారుల నుండి 2022 మార్చి 10-31 మధ్య దరఖాస్తులను ఆహ్వానించారు.  లబ్ధిదారుల మొదటి తాత్కాలిక జాబితాను 20 ఏప్రిల్ 2022 న విడుదల చేశారు.

2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్

డ్రోన్లు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.  వీటిలో వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, అత్యవసర ప్రతిస్పందన, రవాణా, భౌగోళిక ప్రాదేశిక మ్యాపింగ్, రక్షణ , చట్టాన్ని అమలు చేయడం వంటివి ఉన్నాయి.

డ్రోన్‌లు వాటి పరిధి, బహుముఖత్వం, వాడుకలో సౌలభ్యం,  ముఖ్యంగా భారతదేశంలోని మారుమూల , ఇంకా చేరుకోవడం దుర్లభంగా ఉండే ప్రాంతాలకు చేరగల సామర్ధ్యం కారణంగా ఉపాధి, ఆర్థిక వృద్ధికి గణనీయమైన సృష్టికర్తలుగా ఉంటాయి,

సృజనాత్మకత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిమిత ఇంజినీరింగ్ లో దాని సంప్రదాయ బలాలను బట్టి; సహాయక విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు , భారీ దేశీయ డిమాండ్ బేస్ తో  భారతదేశం 2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్ గా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 

***(Release ID: 1834088) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi , Tamil