వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సేకరణలో మిగిలిన గోధుమలను బహిరంగ మార్కెట్ లో అమ్మడం తో రైతులు, వినియోగదారులకు ప్రయోజనం

Posted On: 10 JUN 2022 6:05PM by PIB Hyderabad

దేశంలో బహిరంగ మార్కెట్ లో అధిక ధర లభించడంతో   గోధుమ రైతులు  ప్రయోజనం పొందారుకనీస మద్దతు ధర (ఎం ఎస్ పి)కు   మించి పలికిన  అధిక మార్కెట్ రేటుకు ప్రైవేట్ వ్యాపారులకు ఎక్కువ మంది రైతులు తమ ఉత్పత్తులను  విక్రయించారు.  రైతు సంక్షేమం కోసం కృషి పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం  రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధర  పొంది ప్రయోజనం పొందాలని భావిస్తోంది. దీంతోప్రస్తుత పరిస్థితిలో రైతులు అధిక ధర పొంది ఆదాయం పొందడం తో  ప్రభుత్వ ప్రధాన లక్ష్యం నెరవేరింది. . ప్రస్తుత పరిస్థితితమ ఉత్పత్తులను విక్రయించడానికి మరిన్ని ఎంపికలను  రైతులకు అందుబాటులోకి తెచ్చిందికనీస మద్దతు ధరకు మాత్రమే కాకుండా తమకు ప్రయోజనం కలిగించే పద్దతిలో పంటను విక్రయించే వెసులుబాటు రైతులకు లభించింది.  ప్రస్తుత  సీజన్‌లో రైతులు తమ ఉత్పత్తులను సగటున క్వింటాల్‌ గోధుమలను  2150 రూపాయలకు విక్రయించినట్టు సమాచారం. కనీస మద్దతు ధర కంటే ఈ ధర ఎక్కువ.  కనీస మద్దతు ధర  విలువతో పోలిస్తే బహిరంగ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ఎక్కువ సంపాదించవచ్చుదీనిప్రకారం , 444 లక్షల ఎంటిల వరకు గోధుమ సేకరణ జరిగినట్టు  అంచనా వేస్తే క్వింటాల్‌ సరకును  సగటున 2150 రూపాయల చొప్పున విక్రయించిన  రైతులు దాదాపు  95460 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందారు. ఇదే మొత్తం సరుకును క్వింటాల్‌ 2015 రూపాయలుగా  నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించి ఉంటే వారికి . 89,466 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చేది. కనీస మద్దతు ధరకు కాకుండా బహిరంగ మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయించిన రైతులు 5994 కోట్ల రూపాయల మేరకు  ఎక్కువ ఆదాయం  పొంది ఉండవచ్చు. 

 భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమకు  గిరాకీ విపరీతంగా పెరిగింది.    గిరాకీ  -సరఫరా మధ్య ఏర్పడిన అసమతుల్యత కారణంగా అంతర్జాతీయ   ధర  పెరిగిపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గోధుమలను  ఎక్కువగా కొనుగోలు చేశారు. దీనితో ప్రభుత్వ సేకరణలో తగ్గుదల ధోరణికి కారణమని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సేకరణ కాలంలో గోధుమల మార్కెట్ ధరలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర  కంటే నిరంతరం ఎక్కువగా ఉంటాయి. ధర వ్యత్యాసం  క్వింటాల్‌కు 2100 నుంచి  2500 రూపాయల వరకు ఉంటుంది. 

 

ప్రస్తుత సీజన్‌లో గోధుమ సేకరణ 58 శాతం తగ్గింది.  ప్రస్తుత సీజన్‌లో 444 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల సేకరణ జరగవచ్చునని ప్రాథమికంగా  అంచనా వేయడం జరిగింది.   ఆర్‌ఎస్‌ఎమ్    2022-23 సేకరణ సీజన్ ముగిసే నాటికి   గోధుమ సేకరణ  190 లక్షల ఎంటీ  వరకు మాత్రమే చేరుకోవచ్చని అంచనా.

 

ప్రస్తుత  ఆర్‌ఎస్‌ఎమ్ 2022-23 సేకరణ సీజన్   ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 2022 లో జరిగిన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలో  గోధుమ సేకరణ అంచనాలు 444 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది   ఆర్‌ఎస్‌ఎమ్ 2021-22లో  గోధుమల మొత్తం సేకరణ 433.44 లక్షల మెట్రిక్‌ టన్నులు.

 

ఆర్‌ఎస్‌ఎమ్ 2022-23 కోసం గోధుమ కనీస మద్దతు ధరని కూడా ప్రభుత్వం ప్రకటించింది.  CACP సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని  సెప్టెంబర్ 2021 నెలలో  40 పెంపుతో ముందుగానే  క్వింటాల్‌ ధరను 1975 నుంచి 2015 రూపాయలకు   (2% పెరుగుదల ) పెంచి ప్రకటించడం జరిగింది.  2013-14 (రూ. 1350/క్వింటాల్)తో పోల్చితే 2022-23 (రూ. 2015/క్వింటాల్) వరకు గోధుమల కనీస  మద్దతు ధర  దాదాపు 49% పెరిగింది.

 

 దేశంలో ప్రస్తుతం అలాగే వచ్చే ఏడాది కూడా మిగులు గోధుమలు మరియు బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల తో విస్తృత సంప్రదింపుల జరిపిన తర్వాత పీఎంజికే  మరియు ఎన్ ఎఫ్ ఎస్ ఏ  కింద బియ్యం కంటే  ఎక్కువగా  గోధుమ సరఫరాను చేయడానికి నిల్వలు  కేటాయించింది. దీని ప్రకారం  55+62=117 ఎల్ఎంటీ  గోధుమలను విడుదల చేసింది. 01.04.2023 నాటికి దేశంలో 141 ఎల్ఎంటీ  గోధుమ నిల్వలు  అందుబాటులో ఉన్నాయని అంచనా వేయబడింది.   2022-23 సంవత్సరానికి సంబంధించి పీఎంజికే  మరియు ఎన్ ఎఫ్ ఎస్ ఏ మరియు ఇతర సంక్షేమ పథకాల కింద అవసరమైన అన్ని అవసరాలను తీర్చిన తర్వాత 75 ఎల్ఎంటీ మిగులు నిల్వలు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం అందుబాటులో ఉండాల్సిన కనీస అవసరాల కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. అదే విధంగా బియ్యం లభ్యత కూడా మిగులు గా ఉంటుంది.

 

రైతులకు లాభదాయకమైన ధరలు లభించేలా చూసేందుకు  పంటల కాలానికి ముందుగానే ప్రభుత్వం  22 ప్రధాన  వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ను  ప్రకటించింది. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్  సిఫార్సుల ఆధారంగా కనీస మద్దతు ధర  ఖరారు చేయబడింది.  ఇది రైతులకు ఇన్‌పుట్ ఖర్చులు మరియు మార్జిన్‌లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడుతుంది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేస్తున్నప్పుడు ఉత్పత్తి వ్యయంమొత్తం డిమాండ్-సరఫరా పరిస్థితులుదేశీయ మరియు అంతర్జాతీయ ధరలుఅంతర్-పంట ధరల సమానత్వంవ్యవసాయ మరియు వ్యవసాయేతర రంగాల్లో అమలులో ఉన్న  వాణిజ్య నిబంధనలు,  ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఇతర  ముఖ్యమైన అంశాలను వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్  పరిగణనలోకి తీసుకుంటుందిభూమినీరు మరియు ఇతర ఉత్పత్తి వనరుల హేతుబద్ధ వినియోగాన్ని మరియు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్‌గా ఉండే విధంగా కనీస మద్దతు ధర నిర్ణయం జరుగుతుంది. 

ఎఫ్‌సిఐ మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న గోధుమల సేకరణకు పారదర్శక ఏకరూప విధానం దేశవ్యాప్తంగా  అమలులో ఉంది.  నిర్ణీత సేకరణ వ్యవధిలోగా రైతులు అందించే నికర మార్కెట్ చేయదగిన మిగులు ఉత్పత్తులను   కేంద్ర  ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు  అనుగుణంగా ప్రభుత్వం సెంట్రల్ పూల్ కోసం సేకరణ సంస్థలు అన్ని రాష్ట్రాలలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయి.అయితేకనీస మద్దతు ధరతో పోల్చితే ఎవరైనా ఉత్పత్తిదారు/రైతు మెరుగైన ధరను పొందినట్లయితేఅతను తన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి స్వేచ్ఛ కలిగి వుంటారు.  దేశంలో పంజాబ్హర్యానామధ్యప్రదేశ్ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో గోధుమల సేకరణ ఎక్కువగా జరుగుతుంది. 

 

 

  13.05.2022న గోధుమల ఎగుమతి పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం తో మార్కెట్ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.  ఊహాజనిత గిరాకీ ని దృష్టిలో ఉంచుకుని గోధుమల కొనుగోళ్లను  ఇది తగ్గించింది.    దేశీయ మార్కెట్‌లో గోధుమలుగోధుమ ఉత్పత్తుల ధరల ద్రవ్యోల్బణ ధోరణిని అదుపు చేసింది. . ఎగుమతులపై విధించిన  నియంత్రణ కారణంగా మిగులు గోధుమలు ఉన్న రైతులు ఎవరూ నష్టపోకుండా చూడాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం. ప్రభుత్వం  సాధారణ సేకరణ సీజన్‌ను పొడిగించింది. ఈ పొడిగింపు అంతకుముందు ప్రభుత్వ సేకరణ కార్యక్రమం లో పాల్గొనకుండా  గోధుమ నిల్వలను తమ వద్ద ఉంచుకున్న రైతులకు  ఎఫ్‌సిఐ  రాష్ట్ర సేకరణ ఏజెన్సీల కొనుగోలు కేంద్రాలకు వచ్చి  గోధుమలను విక్రయించడానికి   వీలు కల్పించింది. వేసవి కాలం ముందుగానే ప్రారంభం కావడంఅకాల వేడి గాలుల ప్రభావం వల్ల  గోధుమ పంట దిగుబడి పడిపోయిన కారణంగా నష్టపోయిన  పంజాబ్ మరియు హర్యానా రైతులకు ప్రభుత్వ నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది.  సెంట్రల్ పూల్ కోసం సేకరణ పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం  పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ముడుచుకున్న గింజల  అనుమతించదగిన పరిమితిని 6% నుంచి 18% వరకు  సడలించింది.   కనీస మద్దతు ద్వారా  ప్రయోజనాలను పొందేందుకు కొనుగోళ్ల కార్యకలాపాలలో పాల్గొనేందుకు మరింత మంది రైతులు వచ్చేలా చూసేందుకు  రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని  సేకరణను సులభతరం చేయాలని కేంద్రం కోరింది. కనీస మద్దతు ధర చెల్లించి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమ్మకాల కోసం  మండీలకు వస్తున్న గోధుమల పరిమాణం  తక్కువగా ఉంది.   ప్రైవేట్ కొనుగోలుదారులకు అధిక ధరలకు విక్రయించి  కనీస మద్దతు ధర  కంటే మెరుగైన ధరను రైతులు పొందారని ఈ అంశం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 

***


(Release ID: 1833130)
Read this release in: English , Urdu , Hindi