ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఈ–-గవర్నెన్స్‌లో రీసెర్చ్&డెవలప్మెంట్, నిర్వహణ, కన్సల్టెన్సీ కోసం ఢిల్లీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌తో ఎన్ఐసీఎస్ఐ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది
Posted On:
25 MAY 2022 1:09PM by PIB Hyderabad
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ (ఎన్ఐసీఎస్ఐ), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ), ఢిల్లీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (డీఎస్ఎం), ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ సంస్థ 24 మే, 2022న డాక్టర్ రాజేంద్ర కుమార్, అదనపు సెక్రటరీ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ ఎన్ఐసీఎస్ఐ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మిట్టల్, ఎండీ ఎన్ఐసీఎస్ఐ, డాక్టర్ అర్చన సింగ్, హెచ్ఓడీ, డీఎస్ఎం డీటీయూ ప్రొఫెసర్ పీకే సూరి సమక్షంలో డీటీయూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (ఆర్&డీ) ఈ–-గవర్నెన్స్ రంగంలో ఒకదానితో ఒకటి వనరులను / సామర్థ్యాలను సమన్వయం, కన్సల్టెన్సీ సేవల కోసం ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TYEN.jpg
కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ, ఎన్ఐసీఎస్ఐ డీఎస్ఎం డీటీయూ ఇతర సీనియర్ అధికారులు శోభేంద్ర బహదూర్, డైరెక్టర్ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ , ఎన్ఐసీఎస్ఐ వీవో అంజలి ధింగ్రా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీనియర్ జీఎం & హెచ్ఓడీ సీఈడీఏ ఎన్ఐసీఎస్ఐ, అశుతోష్ పి. మౌర్య, డీజీఎం ఎన్ఐసీఎస్ఐ, సన్నీ జైన్, సీఎస్ ఎన్ఐసీఎస్ఐ, ప్రొఫెసర్. పీకే సూరి డీఎస్ఎం, ప్రొఫెసర్. రాజన్ యాదవ్ డీఎస్ఎం, యశ్దీప్ సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డీఎస్ఎం తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర కుమార్, అడిషనల్ సెక్రటరీ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ చైర్మన్ ఎన్ఐసీఎస్ఐ మాట్లాడుతూ పౌరుల ప్రయోజనం కోసం డిజిటల్ పరివర్తన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం సహకారం ద్వారా వనరులను (మానవశక్తి, జ్ఞానం, మౌలిక సదుపాయాలు మొదలైనవి) సమర్థవంతంగా వినియోగించుకోవడంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ విజన్ గురించి వివరించారు. ఫలితాల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఇదని అన్నారు. విద్యావేత్తల పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సామూహిక ప్రయత్నంతో సమస్యలను పరిష్కరించవచ్చని అన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైన నిర్దిష్ట డొమైన్‌లను అర్థం చేసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి విస్తరించడానికి కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్ మొదలైన కొత్త రంగాలను పరిపక్వం చేయడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించడం సహకార మార్గాల్లో విద్యార్థుల ప్రమేయం ద్వారా రాబోయే సంవత్సరాల్లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ & డీటీయూ పర్యావరణ వ్యవస్థకు ఈ అవగాహనా ఒప్పందాలు సహాయపడవచ్చు. వ్యాపార వ్యూహాలు ప్రణాళికల అభివృద్ధి , నిర్వహణ రంగంలో డీఎస్ఎం నైపుణ్యం ఎన్ఐసీఎస్ఐకి కూడా సులభతరం చేస్తుంది. ప్రశాంత్ కుమార్ మిట్టల్, ఎండీ ఎన్ఐసీఎస్ఐ... ఎన్ఐసీఎస్ఐ డీఎస్ఎం డీటీయూ మధ్య ఈ ఎమ్ఒయు పరిధిని గురించి వివరించారు ఈ ఒప్పందం రెండు సంస్థలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. డీఎస్ఎం డీటీయూ విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వినియోగాన్ని అన్వేషించవచ్చుని, ఐసీటీ మేనేజ్‌మెంట్ ఈ–గవర్నెన్స్ గురించి తెలియడం వల్ల ప్రభుత్వ సంస్థలు/డిపార్ట్‌మెంట్ల పని వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోవచ్చని వివరించారు. సాంకేతికతను సమర్థవంతమైన మెరుగైన వినియోగంతో దాని అంతర్గత వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ప్రభుత్వానికి కూడా సహాయపడుతుందని అన్నారు.
డీఎస్ఎం డీటీయూకి చెందిన ప్రొఫెసర్ పీకే సూరి ప్రత్యేకంగా ఐసీటీ & ఈ–గవర్నెన్స్లో నైపుణ్యం ఉన్న ప్రాంతంలో డీఎస్ఎం డీటీయూ పనితీరు, కార్యకలాపాల గురించి వివరించారు. ఈ ఎమ్ఒయు దీర్ఘకాలంలో రెండు సంస్థలకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది ? అనే దాని గురించి కూడా మాట్లాడారు. డాక్టర్ అర్చన సింగ్ హెచ్ఓడీ, డీఎస్ఎం మాట్లాడుతూ పరిశోధన, డేటా అనలిటిక్స్, ఈ–గవర్నెన్స్ ప్రక్రియలు కాన్ఫరెన్స్‌లు / వర్క్‌షాప్‌ల నిర్వహణలో విద్యార్థుల సహకారంతో ఎన్ఐసీఎస్ఐ డీఎస్ఎంలు కలిసి పనిచేయడాన్ని ప్రశంసించారు.
***
(Release ID: 1832029)
Visitor Counter : 142