సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

శ్రీనగర్ క్యాట్ బెంచ్‌కు హాజరయ్యే బార్ అసోసియేషన్ సభ్యుల కోసం బార్ రూమ్, లైబ్రరీ రూమ్ మహిళా అడ్వొకేట్ల కోసం ప్రత్యేక బార్ రూమ్‌ను ప్రారంభించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటి వ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ శ్రీమతి మంజుల దాస్

Posted On: 07 JUN 2022 11:58AM by PIB Hyderabad

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ శ్రీమతి మంజుల దాస్ శ్రీనగర్ క్యాట్ బెంచ్‌కు హాజరయ్యే బార్ అసోసియేషన్ సభ్యుల కోసం బార్ రూమ్, లైబ్రరీ రూమ్ మహిళా అడ్వొకేట్ల కోసం ప్రత్యేక బార్ రూమ్‌ను   ప్రారంభించారు. శ్రీమతి దాస్ కేంద్ర ప్రభుత్వం, యుటీ లకు ప్రాతినిధ్యం వహించే స్టాండింగ్ కౌన్సెల్ కోసం గదిని, బెంచ్ వద్ద లిటిగేషన్ సెల్‌ను కూడా ప్రారంభించారు. జ్యుడీషియల్ సభ్యుడు శ్రీ డి.ఎస్.మహ్రా, క్యాట్ అధికారులు ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.

నవంబర్ 2021లో శ్రీనగర్‌లో బెంచ్‌ని ఏర్పాటు చేసిన తర్వాత, బార్‌కు, వివిధ కేసులకు సంబంధించి వచ్చే ప్రజలకు సౌకర్యాల కల్పన కోసం నిరంతరం అవసరం ఏర్పడింది. ట్రిబ్యునల్ ప్రయత్నాలతో, యూటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చివరికి అటువంటి సౌకర్యాల కల్పన కోసం ఐదు అదనపు గదులను కేటాయించారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001L4QJ.jpg

పూర్వపు జమ్మూ - కాశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించాక, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ యూటీలు అక్టోబర్ 31, 2019 నుండి అమలులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటైన యూటీలలోని న్యాయవాద ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి, 19వ బెంచ్ శ్రీనగర్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ ను నవంబర్ 23, 2021న కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్,  ఛైర్మన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శ్రీమతి మంజుల దాస్ సమక్షంలో ప్రారంభించారు. 

 <><><><><>



(Release ID: 1831849) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi , Punjabi