గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని వాతావరణ చర్యలో పట్టణ నిపుణులకు సహాయపడటానికి లీడర్స్ ఇన్ క్లైమేట్ చేంజ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి


ప్రాక్టీస్-బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కోసం చేతులు కలిపిన ఎన్‌ఐయూఏ మరియు డబ్ల్యూఆర్‌ఐ

ఎల్‌సిసిఎంకు చెందిన ముఖాముఖి లెర్నింగ్ మాడ్యూల్స్‌ను సులభతరం చేయడానికి మైసూరు అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మొదటి డెలివరీ భాగస్వామి అయింది

2027 నాటికి వాతావరణ మార్పులకు అనుగుణంగా 5,000 మంది పట్టణ నాయకులలో సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం

Posted On: 06 JUN 2022 3:01PM by PIB Hyderabad

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ) మరియు వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) ఇండియా సంయుక్తంగా 'లీడర్స్ ఇన్ క్లైమేట్ చేంజ్ మేనేజ్‌మెంట్' (ఎల్‌సిసిఎం) అనే ప్రాక్టీస్ ఆధారిత కార్యక్రమాన్ని ప్రకటించింది. భారతదేశంలోని వివిధ రంగాలు మరియు భౌగోళిక ప్రాంతాలలో వాతావరణ చర్యకు నాయకత్వం వహించడానికి పట్టణ నిపుణులలో సామర్థ్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. ఈ ముఖాముఖి అభ్యాస కార్యక్రమాన్ని సులభతరం చేయడానికి, మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ) కూడా ఎన్‌ఐయూఏ మరియు డబ్ల్యూఆర్‌ఐ ఇండియాతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రోగ్రామ్ యొక్క మొదటి డెలివరీ భాగస్వామిగా ఎల్‌సిసిఎం అవతరించింది.

మధ్య స్థాయి నుండి జూనియర్ స్థాయి ప్రభుత్వ అధికారులు మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 5,000 మంది నిపుణులను ఎల్‌సిసిఎం కలిగి ఉంటుంది మరియు భారతదేశ వాతావరణ కట్టుబాట్లను సాధించడానికి సమన్వయ ప్రయత్నాల దిశగా వాతావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశమన పరిష్కారాలను సాధించేందుకు వారిని సిద్ధం చేస్తుంది. భారతదేశ పట్టణ వాతావరణ లక్ష్యాల దిశగా గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను కూడా ఈ ప్రయోగం గుర్తించింది.

కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, భారతీయ నగరాల్లోని వాతావరణ నాయకులలో సామర్థ్యాలను పెంపొందించడానికి లెర్నింగ్ ప్రోగ్రామ్ మరియు హాఫ్-డే వర్క్‌షాప్‌ను ఈరోజు ప్రారంభించారు.

తన ప్రధాన ప్రసంగంలో " నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న వెంటనే మేము ఈ రోజు (ఎల్‌సిసిఎం) కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సముచితం మరియు యుక్తమైనది. ఈ కార్యక్రమం వాతావరణ మార్పులను ఎదుర్కోవడమే కాకుండా మన ఆర్థిక పరిస్థితులను నెరవేర్చే స్థిరమైన అభివృద్ధి యొక్క కొత్త మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వ జోక్యాల యొక్క సుదీర్ఘ వరుసలో మరొక చొరవ" అని తెలిపారు

శ్రీ పూరి మాట్లాడుతూ " గత ఎనిమిదేళ్లలో సుస్థిరత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో మోదీ ప్రభుత్వం అనేక ఖచ్చితమైన చర్యలు తీసుకుంది. గ్లాస్గోలో జరిగిన కాప్‌26లో 2070 నాటికి భారతదేశం నికర-సున్నా ఉద్గార దేశంగా మారుతుందని భావించే పంచ్ అమృత్ కార్యాచరణ ప్రణాళిక ద్వారా వాతావరణ మార్పుపై భారతదేశం యొక్క దూకుడు ఎజెండాను పిఎం ప్రకటించారు. ఈ రోజు ప్రారంభించబడిన ఎల్‌సిసిఎం కార్యక్రమం వందలాది మంది వాతావరణ నాయకులను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ నాయకులు వారి శిక్షణ పరంగా ఎలా దృష్టి సారిస్తారు మరియు వారు ఎలా ముందుకు వెళతారు అనే దానిపై దృష్టి పెడతారు. మేము దీని గురించి ఆలోచిస్తున్నామనే వాస్తవం ఒక విప్లవాత్మక అడుగు.

గత సంవత్సరం కాప్‌26 వద్ద, 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాలను చేరుకోవడానికి భారతదేశ సహకారాన్ని విస్తరింపజేస్తూ ప్రపంచ నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదు రెట్లు వ్యూహం - పంచ్ అమృత్ - ప్రతిపాదించారు. ఆ దిశలో భాగంగా ఎల్‌సిసిఎం ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌ఈపీ) మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) భాగస్వామ్యంతో రూపొందించబడింది మరియు అమలు చేయబడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం యొక్క శ్రామిక శక్తిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్‌సిసిఎం అనేది సమర్థవంతమైన వాతావరణ చర్యను అందించడానికి నైపుణ్యం మరియు తమను తాము సిద్ధం చేసుకోవాలని చూస్తున్న పట్టణ అభ్యాసకుల కోసం ఒక మిశ్రమ అభ్యాస కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నాలుగు దశలు ఉన్నాయి: మొదటి దశ- ఎనిమిది వారాలలో పూర్తి చేయగల ఆన్‌లైన్ లెర్నింగ్ మాడ్యూల్; తదుపరిది నాలుగు నుండి ఆరు రోజుల పాటు ముఖాముఖి సెషన్‌లను కలిగి ఉంటుంది; మూడవ దశ పాల్గొనేవారిని ఆరు నుండి ఎనిమిది నెలల పాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని మరియు ఎక్స్‌పోజర్ సందర్శనలకు హాజరు కావాలని చెబుతుంది; మరియు చివరి దశలో నెట్‌వర్కింగ్ మరియు అభ్యాస కమ్యూనిటీని స్థాపించడం ఉంటాయి.

ఎన్‌ఐయూఏ యొక్క కెపాసిటీ బిల్డింగ్ విభాగం నేషనల్ అర్బన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ (ఎన్‌యుఎల్‌పి)లో ఆన్‌లైన్ లెర్నింగ్ హోస్ట్ చేయబడుతుంది. దీనిని ఏటీఐ, మైసూరు కూడా హోస్ట్ చేస్తుంది మరియు మద్దతు ఇస్తుంది. రాబోయే కొద్ది నెలల్లో భారతదేశం అంతటా ఏటీఐలతో ఇలాంటి అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.

పట్టణ పర్యావరణ రంగంలో ఎన్‌ఐయూఏ సాధించిన మరో మైలురాయిని జరుపుకోవడానికి మిస్టర్ పూరీ క్లైమేట్ డేటా అబ్జర్వేటరీ 2.0 వెబ్‌సైట్, పబ్లిక్ స్పేస్‌లపై నాలెడ్జ్ ప్రోడక్ట్, అర్బన్ అవుట్‌కమ్స్ ఫ్రేమ్‌వర్క్ 2022 - డేటా కలెక్షన్ పోర్టల్ మరియు సిటిజెన్ ఎంగేజ్‌మెంట్ ఫర్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కాంపెండియంను కూడా ప్రారంభించారు. నేషనల్ క్లైమేట్ ఫోటోగ్రఫీ అవార్డు విజేతలు మరియు ట్రాన్స్‌పోర్ట్ 4ఆల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కోసం స్టేజ్ వన్ క్వాలిఫైయింగ్ సిటీలు కూడా ప్రకటించబడ్డాయి.

ఎంఓహెచ్‌యూఏ జాయింట్ సెక్రటరీ శ్రీ కునాల్ కుమార్ మాట్లాడుతూ " భారత వాతావరణ మార్పు లక్ష్యాలను సాధించడానికి, మనకు ఆవిష్కరణ, భాగస్వామ్యం, సాంకేతికత, ఇంటిగ్రేషన్ మరియు కెపాసిటీ ఆప్టిమైజేషన్ అవసరం. మేము ఇప్పటికే స్మార్ట్ సిటీస్ మిషన్‌తో సహా భారత ప్రభుత్వం యొక్క వివిధ మిషన్ల ద్వారా ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము. ఎంఓహెచ్‌యూఏ, ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏఎఫ్‌డి), యూరోపియన్ యూనియన్ మరియు ఎన్‌ఐయూఏ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఈ కార్యక్రమం పర్యావరణ మరియు సామాజిక భద్రతలతో సహా పట్టణ రంగం అంతటా ప్రాజెక్ట్ నిర్వహణ సాధనాలు మరియు ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేసింది. లీడర్స్ ఇన్ క్లైమేట్ చేంజ్ మేనేజ్‌మెంట్ (ఎల్‌సీసీఎం) సిటీస్‌ ప్రోగ్రామ్‌కి కనెక్ట్ చేయబడింది. ఎల్‌సీసీఎం ప్రోగ్రామ్ యొక్క మొదటి కోహోర్ట్‌లో 12 నగరాల నుండి పాల్గొనేవారు సిటీస్‌ ప్రోగ్రామ్ కింద సహాయం పొందుతారు. ఎల్‌సీసీఎం సిటీస్‌ 2.0లో అంతర్భాగంగా మారుతుంది, ఎందుకంటే ఇది సామర్థ్యాన్ని పెంపొందించే విభాగంగా పని చేస్తుంది.

కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి మరియు ఏటీఐ మైసూరు డీజీ శ్రీమతి వి. మంజుల మాట్లాడుతూ " కర్ణాటకలో ఒక ప్రధాన శిక్షణా సంస్థగా, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం స్థాపించబడిన కేంద్రంతో మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము.ఎల్‌సీసీఎంలో విస్తృతమైన రాష్ట్ర స్థాయి శిక్షణా భాగస్వామి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మరియు ఎల్‌సీసీఎం కోసం జాతీయ స్థాయిలో శ్రేష్ఠత కేంద్రంగా ఎదగడానికి మేము ఈ సహకారాన్ని మరియు ఈ ప్రక్రియలో పొందిన అనుభవాన్ని స్ప్రింగ్‌బోర్డ్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాము" అని తెలిపారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్ శ్రీ హితేష్ వైద్య మాట్లాడుతూ, “భారతదేశంలో పట్టణ రంగాల వైపు పెట్టుబడుల రేటు ఉదాహరణకు స్మార్ట్ సిటీల ప్రోగ్రామ్ కోసం $30 బిలియన్ల దృష్ట్యా ప్రస్తుతమున్న మరియు భవిష్యత్తులో చేసే పెట్టుబడులలో వాతావరణ చర్యలను చేర్చాల్సిన అవసరం ఉంది. స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి సామాజిక మరియు పర్యావరణ సేవలు చాలా ముఖ్యమైనవి. ఎల్‌సీసీఎం ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, వాతావరణ మార్పు సమస్యలకు సంబంధించి పట్టణ సమస్యల యొక్క డైనమిక్ డిస్కోర్స్‌పై సామర్థ్యాలను మరియు జ్ఞాన వ్యాప్తిని పెంచే లక్ష్యంతో పని చేస్తుంది."అని తెలిపారు.

ఎల్‌సీసీఎం కార్యక్రమంతో పాటు దాని నిర్మాణం మరియు భారతదేశంలో పట్టణ వాతావరణ నాయకత్వ నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సీఈఓ డాక్టర్  ఓపీ అగర్వాల్ మాట్లాడుతూ “మధ్యస్థాయి కెరీర్ నిపుణుల కోసం సామర్థ్యాన్ని పెంపొందించడంలో ప్రధాన సవాలు సరైన రకమైన బోధనను ఉపయోగించడం ఆ ఉపన్యాసాలు వినడం ద్వారా కాకుండా అనుభవపూర్వకంగా చేయడం ద్వారా నేర్చుకోవడాన్ని ప్రోత్సహించే బోధనా శైలిని ఎల్‌సీసీఎంపూర్తిగా గుర్తించింది మరియు ఈ రకమైన బోధనా విధానాన్ని అవలంబించింది."అని తెలిపారు.

లాంచ్ ఈవెంట్ తర్వాత ఈ హాఫ్-డే వర్క్‌షాప్‌ని ఉద్దేశించి ఎన్‌ఐయూఏ డైరెక్టర్ శ్రీ హితేష్ వైద్య ప్రసంగించారు. అర్బన్ సెక్టార్‌లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్‌ను ఎంకరేజ్ చేయడంలో సంస్థ పాత్ర గురించి ఆయన మాట్లాడారు. భారతీయ నగరాల్లో వాతావరణ నాయకత్వానికి సంబంధించిన సామర్థ్యాలపై చర్చా కార్యక్రమంలో పరిశ్రమ నిపుణులు డాక్టర్ బీఆర్‌ మమత, జేటీ డైరెక్టర్ జనరల్, ఏటీఐ, మైసూరు; శ్రీ హితేష్ వైద్య, డైరెక్టర్, ఎన్‌ఐయూఏ  అతుల్ బగై, కంట్రీ హెడ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్, ఇండియా;  అన్షు భరద్వాజ్, సీఈఓ, శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్; డాక్టర్ సంజీవ్ చద్దా, ప్రొఫెసర్ మరియు హెడ్, అర్బన్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్, మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్; మరియు  రెజీత్ మాథ్యూస్, ప్రోగ్రామ్ డైరెక్టర్, అర్బన్ డెవలప్‌మెంట్, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా పాల్గొన్నారు.

వాతావరణ మార్పుల నిర్వహణలో నాయకులు (ఎల్‌సీసీఎం) గురించి:

లీడర్స్ ఇన్ క్లైమేట్ చేంజ్ మేనేజ్‌మెంట్ అనేది కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రాం. ఇది సెక్టార్‌లు మరియు భౌగోళిక ప్రాంతాలలో - వాతావరణ చర్యను చాంపియన్ చేయడానికి మరియు నడిపించడానికి నాయకుల సమూహాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ), వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) - ఇండియా, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌ఈపీ), మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ద్వారా కోర్ పార్టనర్‌ల ద్వారా ప్రోగ్రామ్ రూపొందించబడింది మరియు అమలు చేయబడింది.


ఎన్‌ఐయూఏ గురించి:

1976లో స్థాపించబడిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ) పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధిపై భారతదేశపు ప్రముఖ జాతీయ ఆలోచనా కేంద్రం. పట్టణ రంగంలో అత్యాధునిక పరిశోధనల ఉత్పత్తి మరియు వ్యాప్తికి కేంద్రంగా ఎన్‌ఐయూఏ వేగవంతమైన పట్టణీకరణ భారతదేశం యొక్క సవాళ్లను పరిష్కరించడానికి మరియు భవిష్యత్తులో మరింత సమగ్రమైన మరియు స్థిరమైన నగరాలకు మార్గం సుగమం చేయడానికి వినూత్న పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తుంది.

 
డబ్ల్యూఆర్‌ఐ ఇండియా గురించి:

డబ్ల్యూఆర్‌ఐ ఇండియా, ఇండియా రిసోర్సెస్ ట్రస్ట్‌గా చట్టబద్ధంగా నమోదు చేయబడిన ఒక స్వతంత్ర స్వచ్ఛంద సంస్థ. పర్యావరణపరంగా మరియు సామాజికంగా సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి లక్ష్య సమాచారాన్ని మరియు ఆచరణాత్మక ప్రతిపాదనలను అందిస్తుంది. దీని పని స్థిరమైన మరియు జీవించదగిన నగరాలను నిర్మించడం మరియు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు పని చేయడంపై దృష్టి పెడుతుంది. పరిశోధన, విశ్లేషణ మరియు సిఫార్సుల ద్వారా డబ్ల్యూఆర్‌ఐ భూమిని రక్షించడానికి, జీవనోపాధిని ప్రోత్సహించడానికి మరియు మానవ శ్రేయస్సును మెరుగుపరచడానికి పరివర్తన పరిష్కారాలను రూపొందించడానికి ఆలోచనలను అమలులోకి తీసుకువస్తుంది. ఇది గ్లోబల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యుఆర్‌ఐ) నుండి ప్రేరణ పొందింది మరియు దానితో అనుబంధించబడింది.



(Release ID: 1831719) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Hindi