భారత పోటీ ప్రోత్సాహక సంఘం
తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు అమెచ్యూర్ బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా సీజ్ అండ్ డెసిస్ట్ (నిలిపివేయు, నిరోధించు) ఉత్తర్వులను జారీ చేసిన సిసిఐ
Posted On:
03 JUN 2022 4:27PM by PIB Hyderabad
ఆధిపత్య దుర్వినియోగాన్ని నిషేధించి చట్టంలోని సెక్షన్ 4ను ఉల్లంఘించినట్టుగా తేలడంతో అమెచ్యూర్ బేస్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎబిఎఫ్ఐ)కి వ్యతిరేకంగా పోటీ చట్టం, 2002లోని సెక్షన్ 27లలోని అంశాల కింద 03.06.2022న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేసింది.
ఎబిఎఫ్ఐ చట్టంలోని సెక్షన్ 4లోని అంశాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఈ కేసును కన్ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ సాఫ్టబాల్ క్లబ్స్(సిపిబిఎస్‌సి) చట్టంలోని సెక్షన్ 19(1) (ఎ) కింద కేసును దాఖలు చేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఎబిఎఫ్ఐ 07.01.2021న తన అనుబంధ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్లను గుర్తింపులేని సంస్థలను ప్రోత్సహించవద్దని, రాష్ట్రస్థాయి ఆటగాళ్ళను వారు నిర్వహించే టోర్నమెంట్లలో పాల్గొననివ్వవద్దని విజ్ఞప్తి చేస్తూ సమాచారాన్ని పంపింది.
నమోదైన ఆధారాల ప్రకారం, భారతదేశంలో ఎబిఎఫ్ఐ బేస్‌బాల్ లీగ్‌లు / ఈవెంట్లు/ టోర్నమెంట్ల కు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో ఆధిపత్య స్థానంలో ఉందని, పైగా 07.01.2021న తన అనుబంధ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్లకు సందేశాన్ని పంపడం ద్వారా చట్టంలోని సెక్షన్ (4)(2)(ఎ)(ఐ), 4 (2), (ఎ)(ఐ), 4 (2), (బి)(ఐ), (2), (సి)(ఐ) కమిషన్ కనుగొంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఎబిఎఫ్ ఐకి వ్యతిరేకంగా సీజ్ అండ్ డెసిస్ట్ (నిలిపివేయు, నిరోధించు) ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, ఎబిఎఫ్ఐ అభ్యంతరకరమైన లేఖను ఇప్పటికే ఉపసంహరించుకోవడాన్ని పరిగణిస్తూ వారిపై ద్రవ్యసంబంధమైన జరిమానాను కమిషన్ విధించలేదు. లేఖను ఉపసంహరించుకోవడం వల్ల అవసరమైన మార్కెట్ కరెక్షన్ ఇప్పటికే జరిగిపోయింది.
ఉత్తర్వులను కేస్ నెం. 03 ఆఫ్ 2021లో జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కాపీ సిసిఐ వెబ్‌సైట్ www.cci.gov.inలో పొందవచ్చు.
***
(Release ID: 1830880)
Visitor Counter : 148