ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మంకీ ఫాక్స్ తాజా సమాచారం


మంకీ ఫాక్స్ పై రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

పూణే లోని అపెక్స్ లేబొరేటరీ కి ( ఎన్ఐవి) కి ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం ( ఐడి ఎస్పీ) ద్వారా క్లినికల్ నమూనాలు

Posted On: 31 MAY 2022 6:26PM by PIB Hyderabad

      అన్ని దేశాలకు మంకీ పాక్స్ వ్యాధి విస్తరిస్తున్నదని నివేదికలు వస్తున్న నేపథ్యంలో వ్యాధిని ఎదుర్కొని నివారించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ రోజు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.  మంకీ పాక్స్ వ్యాధిని ఎదుర్కొనేందుకు క్రియాశీలసమస్య నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తూ దేశవ్యాప్తంగా ముందస్తు చర్యలను అమలు చేసే విధంగా 'మంకీపాక్స్ వ్యాధి నిర్వహణ మార్గదర్శకాలుపేరిట మార్గదర్శకాలు జరీ అయ్యాయి.  ఇవి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో  https://main.mohfw.gov.in/sites/default/files/Guidelines%20for%20Management%20of%20Monkeypox%20Disease.pdf లో అందుబాటులో ఉన్నాయి. 

 భారతదేశంలో ఇప్పటివరకు మంకీ పాక్స్ వ్యాధి కేసులు ఏమీ బయట పడలేదు. 

 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్ ) మరియు/లేదా సీక్వెన్సింగ్ ద్వారా వైరల్ డిన్ఏ   ప్రత్యేకమైన సీక్వెన్స్‌ల ద్వారా మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించిన అధీకృత ప్రయోగశాల నిర్ధారించవలసి ఉంటుంది. అన్ని క్లినికల్ నమూనాలను ఐసీఎంఆర్ -ఎన్ఐవి  (పుణె) అపెక్స్ లాబొరేటరీకి సంబంధిత జిల్లా/రాష్ట్రం  ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ( ఐడి ఎస్పీ  ) నెట్‌వర్క్ ద్వారా పంపించవలసి ఉంటుంది.

మంకీపాక్స్ వ్యాధి నిర్వహణపై మార్గదర్శకాలలో వ్యాధి  ఎపిడెమియాలజీ (హోస్ట్ఇంక్యుబేషన్ పీరియడ్వ్యాప్తి  కాలం మరియు ప్రసార విధానం, వ్యాప్తి  మరియు కేసు సమగ్ర వివరాలు,   క్లినికల్ లక్షణాలు మరియు దాని సంక్లిష్టతరోగ నిర్ధారణ,వ్యాధి నిర్వహణ , ప్రమాద నిర్వహణ , ఇన్ఫెక్షన్ నివారణకు అనుసరించాల్సిన పద్ధతులు,  మార్గదర్శకత్వం.నియంత్రణ (ఐపీసీ ) మరియు వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం లాంటి అన్ని అంశాలతో మార్గదర్శకాలు రూపొందాయి. 

వ్యాప్తి నియంత్రణకు కీలకమైన ప్రజారోగ్య చర్యలుగా కొత్త కేసులపై  నిఘా మరియు వేగవంతమైన గుర్తింపు విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని  మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి  సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇది ఇన్ఫెక్షన్ నివారణ, అదుపు  ( ఐపీసీ  ) చర్యలుఇంట్లో  ఐపీసీ , వ్యాధి సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచడంఅంబులెన్స్ లో తరలించడం తీసుకోవలసిన అదనపు జాగ్రత్తలు మరియు ఐసోలేషన్ వ్యవధి లాంటి అంశాలను మార్గదర్శకాల్లో వివరించారు. 

మార్గదర్శకాల ప్రకారంసంక్రమిత కాలంలో రోగి లేదా వారు ఉపయోగించిన వస్తువులు తాకిన కాలం  నుంచి  కనీసం  21 రోజుల పాటు (కేసు నిర్వచనం ప్రకారం) సంకేతాలు/లక్షణాలు తెలుసుకొనేందుకు   కాంటాక్ట్‌లను ప్రతిరోజూ పర్యవేక్షించాలి.

వ్యాధి వ్యాప్తి  మరియు నివారణ చర్యలలో భాగంగా  ప్రమాద కారణాలపై అవగాహన పెంపొందించడంమంకీ పాక్స్ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మార్గదర్శకాల్లో సూచించారు. వ్యాధి సోకిన వ్యక్తితో గాని అతను వినియోగించిన వస్తువులు ఉపయోగించకుండా ఉండడం, వ్యాధి సోకిన వ్యక్తిని    ఇతరుల నుండి  వేరుగా ఉంచడం  రోగులను సంరక్షణ సమయంలో  చేతి పరిశుభ్రత మరియు తగిన  వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈఉపయోగించడం  వంటి చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి అంశాలను    మార్గదర్శకాలలో   వివరంగా వివరించడం జరిగింది. 

కామెరూన్సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కోట్ డి ఐవరీడెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగాబన్లైబీరియానైజీరియారిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు సియెర్రా లియోన్ వంటి అనేక ఇతర మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ స్థానికంగా ఉన్నట్లు నివేదించబడింది. అయినప్పటికీ అమెరికా , యునైటెడ్ కింగ్‌డమ్బెల్జియంఫ్రాన్స్జర్మనీఇటలీనెదర్లాండ్స్పోర్చుగల్స్పెయిన్స్వీడన్ఆస్ట్రేలియాకెనడాఆస్ట్రియాఇజ్రాయెల్స్విట్జర్లాండ్ మొదలైనవి..కొన్ని స్థానికేతర దేశాలలో కూడా కేసులు నమోదయ్యాయి. 

 కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. 

 

***


(Release ID: 1830013) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi