వ్యవసాయ మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిమ్లాలో ఏర్పాటు చేసిన 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


బహిరంగ సభ సందర్భంగా పిఎం-కిసాన్ వాయిదాలో భాగంగా 10 కోట్ల మంది రైతులకు రూ.21,000 కోట్లు బదిలీ చేయబడ్డాయి

పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడం ద్వారా ప్రధాన మంత్రి అసమానతలను అంతమొందించారని వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు

మోదీ గారి కృషి వల్ల రైతుల సంక్షేమం జరిగింది మరియు 8 సంవత్సరాలలో సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి: శ్రీ తోమర్

Posted On: 31 MAY 2022 7:56PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ అపూర్వ ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే " దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలతో ఇంటరాక్ట్‌ అయి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 11వ విడత నిధులను కూడా విడుదల చేశారు. దాదాపు 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 21,000 కోట్లు బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కూడా ప్రధాని సంభాషించారు.

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలు, జౌళి, ఆహారం & వినియోగదారుల వ్యవహారాలు మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఢిల్లీ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ తోమర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికల్లో భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయారని, కానీ నేడు మోదీజీతో దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సాధికారత సాధించారన్నారు. భూమిపై ఉన్న ఏ రాజకీయ వేదిక కూడా భారతదేశాన్ని విస్మరించలేని విధంగా ప్రపంచ రాజకీయ వేదికపై శక్తిని మోదీజీ చూపించారు. ఆయన 8 సంవత్సరాల ప్రయాణం పట్ల మనమందరం తప్పకుండా గర్వపడతాం. గ్రామీణ జనాభా, పేద ప్రజలు మరియు రైతుల విషయానికొస్తే ఈ వర్గాల పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ అంకితభావంతో ఉందని అందరికీ బాగా తెలుసు. ఒకప్పుడు గ్రామాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే  వారాలు పట్టేది. అటల్ జీ ప్రధానమంత్రి అయ్యాక, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనను ప్రారంభించారు. కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోయారు. నేడు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆ పనిని వేగంగా ముందుకు తీసుకెళ్లారు మరియు గ్రామాల్లో లక్షలాది రోడ్లు నిర్మించారు. గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నారు. గతేడాది రోడ్ల రంగానికి రూ.15 వేల కోట్ల బడ్జెట్‌ ఉండగా ఈసారి గ్రామ రహదారులకు రూ.19 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.


శ్రీ తోమర్ మాట్లాడుతూ నేడు పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు తమ సొంత ఇంటిలో ఉంటున్నారని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో  టాయిలెట్, వంటగది మరియు విద్యుత్ కనెక్షన్ కూడా అందించబడుతుంది. మోదీజీ  ఈ 8 ఏళ్లలో చేసిన కృషి వల్ల అసమానతలు తొలగిపోతున్నాయని తద్వారా మంచి జరుగుతోందని చెప్పారు. ఇది ఖచ్చితంగా సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది మరియు రైతుల సంక్షేమం కూడా జరిగిందని వివరించారు.

వ్యవసాయ రంగంలో, రైతుల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లభించేలా అనేక కార్యక్రమాలు చేశామని వ్యవసాయ మంత్రి చెప్పారు. గతంలో గోధుమలు మరియు బియ్యం మాత్రమే ఎంఎస్‌పికి కొనుగోలు చేయబడ్డాయని మోడీ జీ ముతక ధాన్యాలతో సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను కూడా ప్రారంభించారని తెలిపారు. రైతులు ముందుకు సాగాలని, వారి ఆదాయం రెండింతలు పెరగాలని, రైతులు పంటల వైవిధ్యాన్ని పాటించాలని, ఎరువులు మరియు నీటి వినియోగం పరిమితంగా ఉందని, వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గాలని, అందుకే ప్రచారం ప్రారంభించి కోట్లాది మంది రైతులు లబ్ధి పొందాలని ప్రధాని కోరుతున్నారు.  ఒకవైపు 38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో సేంద్రీయ వ్యవసాయంపై ప్రధాని ఉద్ఘాటించారు. ఈసారి మేము రూ.3.75 లక్షల కోట్ల ఎగుమతులను సాధించాము, ఇది కూడా రైతుల శ్రమ ఫలితమే. ప్రకృతి వ్యవసాయంపై కూడా ప్రధాని దృష్టి సారించారు. కాలక్రమేణా, మనం రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించాలి, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి.తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు మరియు మన ఉత్పత్తికి మంచి ధర లభిస్తుంది మరియు ఉత్పత్తి నాణ్యత ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ దృక్కోణంతో మనమందరం వ్యవసాయ రంగంలో ముందుకు సాగాలని చెప్పారు.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మోహపాత్ర మరియు డీడీజీ డాక్టర్ ఎ.కె. సింగ్ పాల్గొన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ సింగ్ వోట్‌ ఆఫ్‌ థ్యాక్స్‌  తెలిపారు.

***



(Release ID: 1830000) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Punjabi