ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజిటల్ హెల్త్ శక్తిని వెలికితీయడం, వాక్సిన్ అంతరాన్ని తొలగించడంపై దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఆర్ధిక మంత్రి
"ప్రపంచ ఫార్మసీ గా వెలుగొందుతున్న భారత దేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వాక్సిన్ పరిశోధన, అభివృద్ధి, తయారీ, అమలు విషయంలో తన సామర్ధ్యాన్ని ప్రదర్శించింది. దేశీయంగా కోవిడ్ 19 వాక్సిన్లు తయారు చేసి సుమారు 1.92 బిలియన్ వాక్సిన్ డోస్ లు వేయడం ద్వారా ఇది రుజువవుతోంది "
డిజిటల్ హెల్త్ గొప్ప ఈక్వలైజర్ , యూనివర్సల్ హెల్త్ కవరేజ్ , సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు మద్దతునిస్తుంది. ఆరోగ్య సేవలు చవక ధరకు , అందుబాటు లోకి తేవడంలో ఇది సహాయపడుతుంది: కేంద్ర ఆరోగ్య మంత్రి
కృత్రిమ మేథ, క్లైడ్ కంప్యూటింగ్, 5జి , నానో టెక్,వంటి వాటితో మనం టెక్నాలజీ మద్దతు కలిగిన ఆరోగ్య సేవలను చిట్ట చివరి వ్యక్తికి కూడా నమ్మకమైన , విశ్వసనీయమైన నిరంతరాయమైన రీతిలో అందించగలగి ఉండాలి.
ఆఫ్రికాలో వాక్సిన్ అంతరాన్ని తగ్గించేందుకు మద్దతు తెలిపేందుకు ఇండియా ఎదురుచూస్తోంది.
ప్రపంచం మేలు కోసం మేం మా కోవిన్ ప్లాట్‌ఫారం ను అందుబాటులో ఉంచాము : డాక్టర్ మాండవీయ
Posted On:
25 MAY 2022 8:40PM by PIB Hyderabad
-దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సు చరిత్రాత్మక సమావేశంలో కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమం , రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి వాక్సిన్ వేసుకున్న వారికి వేసుకోని వారికి మధ్య అంతరాన్ని తొలగించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. సమాన వాక్సిన్ తయారీ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు డిజిటల్ ఆరోగ్యం అనేది సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇది ఆరోగ్య సేవలను అందుబాటు లోకి తేవడం, తక్కువ ఖర్చుతో దొరకడానికి దోహదపడతాయని అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి , డిజిటల్ ఆరోగ్య శక్తికి తలుపులు తెరవడం, వాక్సిన్ అంతరాన్ని తగ్గించడానికి సంబంధించిన సెషన్ లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ సెషన్‌లో చేసిన ప్రసంగపాఠం సంక్షిప్త అనువాదం కింద ఇవ్వడం జరిగింది.
సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటల్ హెల్త్ ఒక గొప్ప అందివచ్చిన అవకాశం గా చెప్పుకోవచ్చు. ఇది ఆరోగ్య సేవలను చవకగా అందుబాటులోకి తీసుకురావడానికి వీలు కల్పిస్తుంది.డిజిటల్ ఆరోగ్యానికి సంబంధించి ఇండియా ఒక జాతీయ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించి ఈ దిశగా కృషి చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఇండియా దేశంలో ఆరోగ్య రంగాన్ని డిజిటల్ పరివర్తన దిశగా తీసుకువచ్చింది. దేశంలోని 1.3 బిలియన్ల భారతీయులకు సంబంధించి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపాందించడంపై దృష్టిపెట్టడం జరుగుతోంది. ఇప్పటికే మేం 220 మిలియన్ల ప్రత్యేక హెల్త్ ఐడి లు అంటే యూనిక్ హెల్త్ ఐడి లను ఆయా ఆరోగ్య సదుపాయాలు, హెల్త్ రిజిస్ట్రితో పాటు జారీ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఇండియా ఇప్పటికే డిజిటల్ హెల్త్ ప్రక్రియలను ఉపయోగిస్తోంది. పునరుత్పాదక, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఐటి ప్లాట్‌ఫారం 120 మిలియన్ల గర్భిణులు వారి ఎఎన్‌సి , పిఎన్ సి చెకప్, ప్రసవ సమయానికి సంబంధించిన సమాచారం, అలాగే 90 మిలియన్లమంది పిల్లలకు సంబంధించి వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతోంది. హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఆయా ఆరోగ్య కార్యక్రమాలకు సంబధించి 2,00,000న ఆరోగ్య సదుపాయాల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది.
ఎన్ సిడి అప్లికేషన్ ద్వారా మేం సుమారు 80 మిలియన్ల మందికిపై ప్రజలకు సంబంధించిన డయాబిటిస్, హైపర్ టెన్షన్, కాన్సర్ లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించాం. ఆ రకంగా దేశ ప్రజల ప్రొఫైల్‌ను తయారు చేశాం. టెలిమెడిసిన్ ప్లాట్ ఫారం, ఈ సంజీవని 390 మిలియన్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వీడియో సంప్రదింపుల ద్వారా వీరు ప్రయోజనం పొందారు. ఆ రకంగా ఇది ఈ తరహా ప్లాట్‌ఫారంలలో ప్రపంచంలోనే పెద్దది.
కోవిన్ ప్లాట్ ఫారం, పేర్ల ఆధారంగా వాక్సినేషన్ ను పరిశీలిస్తుంది. అలాగే సుమారు 1.92 బిలియన్ల వాక్సిన్ డోస్ ల సమాచారాన్ని పరిశీలించింది.ఇందులో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, ఎఇఎఫ్ఐ పర్యవేక్షణ, క్యు.ఆర్. కోడ్ ఆధారిత డిజిటల్ సర్టిఫికేట్ వంటి వి ఉన్నాయి. ఇండియా గ్లోబల్ డిజిటల్ ఆరోగ్య భాగస్వామ్యంలో భాగంగా దానికి నాయకత్వం వహిస్తున్న దేశంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ హెల్త్ అజెండాను ఇండియా ప్రోత్సహించింది. గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ డిజిటల్ హెల్త్ ను ప్రాధాన్యత కింద చేపట్టేందుకు ఇండియా, ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిజిటల్ ఆరోగ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇతర దేశాలకు వాక్సినేషన్‌లో సహాయం చేసేందుకు డిజిటల్ ప్రజా ప్రయోజనం కోసం మేం కో విన్ ప్లాట్ ఫారం ను ఆఫర్ చేశాం. వసుదైవ కుటుంబకం అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అన్న దేశ సంప్రదాయ ఫిలాసఫీకి కట్టుబడి దీనిని తీసుకువచ్చాం. డిజిటల్ ఆరొగ్య ప్రయత్నాలు, ఆరోగ్య సేవలను చిట్టచివరి వ్యక్తి వరకు అందించడానికి , ఆరోగ్య సేవలలో సమానత్వ సాధనకు దోహదపడనున్నాయి. కృత్రిమ మేథ, క్లౌడ్ కంప్యూటింగ్ , 5 జి , నానొటెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలతో మనం టెక్నాలజీ మద్దతుతో ఆరోగ్య సేవలను నమ్మకమైనవిగా, చిట్టచివరి వ్యక్తి వరకు నమ్మకమైన రీతిలోఅందేలా చేయవలసి ఉంది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ గారు వాక్సిన్ అంతరం తొలగింపు నకు సంబంధించిన సెషన్ లో చేసిన ప్రసంగ పూర్తి పాఠం కింది విధంగా ఉంది.
ఇండియా ప్రపంచ ఫార్మసీగా పేరుతెచ్చుకుంది. దేశీయంగా వాక్సిన్ తయారు చేసి, వాక్సిన్ పరిశోధన, అభివృద్ధి, తయారీ , అమలులో ఇండియా తన శక్తి ఏమిటో రుజువుచేసింది. 1.92 బిలియన్ లకు పైగా వాక్సిన్ లను వేసి వాక్సిన్‌లను వేసే బృహత్తర కార్యక్రమం చేపట్టి దీనిని రుజువు చేసింది.
జనాభా, వైవిధ్యత, వాక్సిన్ పట్ల విముఖత, వాక్సిన్ సత్వరావసరం, పేద వర్గాలకు వాక్సిన్ ను అందుబాటులోకి తేవడం వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన సవాళ్లు ఉన్నప్పటికీ, అత్యధ్బుత ప్రణాళిక. అధునాతన పరిశోధన తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో , ఎన్నో ఇతర దేశాల కంటే ముందు, విజయవంతంగా ఎంతో మంది ప్రాణాలను రక్షించడం జరిగింది. ఇండియా ఆఫ్రికాతో తనకు గల సంబంధాలకు మరింత మద్దతునిచ్చి బలపరచాలని అనుకుంటున్నది. ఆఫ్రికన్ దేశాల వైద్య సంబంధిత సామర్ధ్యాల పెంపు అభివృద్ధఙ, పరిశోధనను వేగవంతం చేసేందుకు ఇండియా త మద్దతు ఇవ్వనుంది.
వాక్సిన్ అందుబాటు నుంచి వాక్సినేషన్ పూర్తి అయ్యే వరకు ఆఫ్రికాకు ఇండియా తన మద్దతునివ్వనుంది. ఇండియాలో 96 శాతం మందికి తొలి వాక్సిన్ డోస్ వేడయం 86 శాతం మందికి రెండు డోస్‌లూ వేసిన అనుభవంతో ఆఫ్రికాలో వాక్సిన్ అమలుకు ఇండియా మద్దతు నిస్తోంది.
ఒక భూమి, ఒకే ఆరోగ్యం అన్న గౌరవ ప్రధానమంత్రి గారి దార్శనికతతో ఇండియా ఎల్లప్పుడూ ప్రపంచానికి తన మద్దతునిస్తోంది. వాక్సిన్ మైత్రి కింద మేం 100 దేశాలకు వాక్సిన్ సరఫరా చేశాం. అలాగే కోవిడ్ సమయంలో 150 దేశాలకు మందులు సరఫరా చేశాం.
మేము ప్రపంచ ప్రజల ప్రయోజనం కోసం మా కోవిన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రపంచానికి అందించాం. వ్యాక్సిన్‌ల అంతరాన్ని తొలగించడంపై ఈ సెషన్‌లో, నేను అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే వ్యాక్సిన్ తయారీ వాల్యూ చెయిన్ అంతటా ప్రైవేట్ - ప్రభుత్వ రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రూపొందించిన ఈక్విటబుల్ వ్యాక్సిన్ తయారీ సహకారం (ఇవిఎంసి) కోసం ఈ సెషన్ ఒక కార్యక్రమాన్ని అందించాలి. తక్కువ మధ్య-ఆదాయ దేశాలలో. ఆఫ్రికాలో వాక్సిన్ అంతరాన్ని తొలగించడానికి భారతదేశం తన మద్దతునిస్తుందని తెలియజేస్తున్నాను..
(Release ID: 1828916)
Visitor Counter : 162