ఆయుష్
ఆయుష్ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగం మధ్య అవగాహనా ఒప్పందం
ఆయుష్ రంగంలో ప్రామాణికత ఆధారంగా బయోటెక్నాలజికల్ భాగస్వామ్యంతో అంతర్-మంత్రిత్వ సహకారాన్ని ఈ ఒప్పందం సులభతరం చేస్తుంది
Posted On:
25 MAY 2022 8:19PM by PIB Hyderabad
ఆయుష్ రంగంలో ప్రామాణికమైన చర్యల దిశగా బయోటెక్నాలజికల్ భాగస్వామ్యంతో నైపుణ్యాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. సహకారం, సమ్మిళిత, సమిష్టి చర్యల ద్వారా అవకాశాలను అన్వేషించడానికి పరస్పర సహకారం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసాయి. ఈ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలేతో పాటు రెండు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ కలయిక ద్వారా సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ కలిసి వినూత్నమైన, మార్గనిర్దేశిత పరిశోధనలను చేపట్టేందుకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయని భావిస్తున్నారు, ఇది ఆయుష్ వ్యవస్థల వివిధ ప్రాథమిక సూత్రాల అన్వేషణకు ఉపయోగపడుతుంది. ప్రజారోగ్య సంరక్షణ రంగంలో ఈ పురాతన శాస్త్రీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అన్వేషణ, అనువర్తనానికి బహుముఖ, సాంకేతిక మార్గాల అవసరం ఉంది.
బయోటెక్నాలజికల్ పరిశోధన అభివృద్ధి, ఆయుష్ భాగస్వామ్యం జీవన నాణ్యతను అలాగే జీవిత కాలం (వయఃస్థాపన రసాయనా) మెరుగుపరుస్తాయి. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాచెక్సియా, నొప్పి నిర్వహణ, అంటు వ్యాధులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అనారోగ్యాలను తగ్గిస్తుంది. ఈ సందర్భంగా వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ ఆయుష్ మంత్రిత్వ శాఖ, డీబీటీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ఆయుష్ రంగంలో సమన్వయ పరిశోధనలకు మార్గం సుగమం చేస్తుందని, ఆయుష్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అపారమైన సామర్థ్యాన్ని సమాజ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే మాట్లాడుతూ, ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డిబిటి మధ్య ఈ అంతర్ మంత్రిత్వ సహకారం వల్ల క్లిష్ట వ్యాధుల చికిత్సకు సంబంధించి విజ్ఞానం, కొత్త జోక్య వ్యూహాలను రూపొందించవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు.
ప్రాథమిక శాస్త్రం నుండి ధ్రువీకరణ, ఆ తర్వాత ఉత్పత్తి అభివృద్ధి వరకు ఈ ఉమ్మడి ఆర్ & డి ప్రయత్నం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ ముఖ్యమైన రంగానికి భారతీయ సహకారాల వృద్ధికి గణనీయంగా సహాయపడుతుంది. వ్యాధి జంతు నమూనాలు, డేటా విశ్లేషణాత్మక సాధనాలతో పాటు ఇతర అధునాతన విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి ఆయుర్వేద థెరప్యూటిక్స్ కి సంబంధించిన యాంత్రిక అధ్యయనాలకు ప్రాధాన్యత ఇస్తారు.
*****
(Release ID: 1828387)