విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునరుత్పాదక వనరుల పెంపు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం మరియు బయోమాస్ & గ్రీన్ హైడ్రోజన్ వినియోగం ఇంధన పరివర్తనకు కీలకం:ఆర్కే సింగ్


2030 నాటికి ఉద్గార తీవ్రతను 45% తగ్గించే ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ముఖ్యమైనది: శ్రీ సింగ్

ఇంధన పరివర్తన కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు యుటిల లెఫ్టినెంట్ గవర్నర్‌లను శ్రీ ఆర్కే సింగ్ కోరారు

ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన కమిటీలు పని చేస్తాయి

Posted On: 25 MAY 2022 2:05PM by PIB Hyderabad

ఇంధన పరివర్తన కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లను కేంద్ర విద్యుత్ మరియు నవీన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ కోరారు. ఈ స్టీరింగ్ కమిటీలు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన పని చేస్తాయి. విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖలు, రవాణా, పరిశ్రమలు, గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మరియు పబ్లిక్ వర్క్స్ శాఖలు మొదలైన వాటి ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీలలో సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కమిటీ ఆదేశం ప్రకారం ఇంధన పరివర్తన వార్షిక వ్యూహంపై పని చేస్తాయి.

అత్యంత మెరుగైన ఇంధన సమర్థవంతమైన మార్గంలో స్థిరమైన అభివృద్ధిపై  నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో రాష్ట్రాలు/యుటిలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పునరుద్ఘాటించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి మరియు అంతర్జాతీయ ఫోరమ్‌లలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఇంధన పరివర్తన మాత్రమే మార్గం అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేశాయని కేంద్రమంత్రి తెలిపారు.

ఇంధన పరివర్తన కోసం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు బహుముఖ మార్గాల్లో కలిసి పనిచేయాలని శ్రీ సింగ్ హైలైట్ చేశారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి మిశ్రమానికి రెన్యూవబుల్స్ (పునరుత్పాదక శక్తి) జోడించడం మొదటి ట్రాక్ అని ఆయన అన్నారు. రెండవ ట్రాక్‌లో ఇంధన సామర్థ్యానికి ప్రోత్సాహం ఉంటుందని, మూడవది బయోమాస్ మరియు గ్రీన్ హైడ్రోజన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. ఈ విషయాలపై మనమందరం సమిష్టిగా కృషి చేస్తే మన లక్ష్యాలను సాధించడమే కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం మరియు అంతిమంగా దేశంలోని ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా 2024 నాటికి వ్యవసాయంలో జీరో డీజిల్‌కు రాష్ట్రాలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ విషయంలో, పిఎం-కుసుమ్ పథకం కింద ప్రత్యేక వ్యవసాయ ఫీడర్‌ల కోసం సౌరశక్తిని స్వీకరించడానికి ఆర్‌డిఎస్ఎస్ (రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు.

2005 స్థాయితో పోలిస్తే 2030 నాటికి 45% ఉద్గార తీవ్రత తగ్గింపును విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ముఖ్యమైనదని శ్రీ సింగ్ నొక్కి చెప్పారు.


 

***


(Release ID: 1828257) Visitor Counter : 168