వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మే 8 నుండి 11 వరకు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి


ఇజ్రాయెల్ అగ్రిటెక్ స్టార్టప్ కంపెనీలతో వ్యవసాయ మంత్రి రౌండ్‌ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు

Posted On: 07 MAY 2022 12:30PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి శ్రీ ఓడెడ్ ఫోరెర్ ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక సమావేశాల కోసం ఈ ఏడాది  మే 8 నుండి 11 వరకు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యవసాయానికి సంబంధించిన వివిధ ఆంశాలపై ఈ ద్వైపాక్షిక సదస్సులో చర్చిస్తారు.

మే 9, 2022న ఈ ప్రతినిధి బృందం గ్రీన్ 2000 - అగ్రికల్చరల్ ఎక్విప్‌మెంట్ అండ్ నో హౌ లిమిటెడ్. మరియు ఎన్‌ఈటీఏఎఫ్‌ఐఎం లిమిటెడ్‌ సంస్థలను సందర్శించాలని ప్రతిపాదించబడింది. ఈ సంస్థలు పలు రంగాలలో వివిధ ప్రాజెక్టుల ప్రణాళిక, వ్యవసాయం మరియు మైక్రో & స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ (బిందు సేద్యం) వినియోగం వరి సాగు, చెరకు మరియు పత్తి వంటి ఆంశాల్లో నిమగ్నమై ఉన్నాయి. మధ్యాహ్నం టెల్-అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఎక్స్‌పోర్ట్ & ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యవసాయ మంత్రి ఇజ్రాయెలీ అగ్రిటెక్ స్టార్టప్ కంపెనీలతో రౌండ్‌టేబుల్ చర్చలు జరుపుతారు.

పర్యటనలో రెండో రోజు ఈ ప్రతినిధి బృందం వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఏఆర్‌ఓ) - ఇజ్రాయెల్ వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వోల్కాని ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించాలని ప్రతిపాదించబడింది. ఇవి క్లిష్ట పరిస్థితులలో వ్యవసాయంలో ప్రత్యేక నైపుణ్యం, ఉపాంత నేలలు, ప్రసరించే మరియు లవణీయ నీటి ద్వారా నీటిపారుదల మరియు అత్యాధునిక తెగులు నియంత్రణ మరియు పంట అనంతర నిల్వ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి నష్టాలను తగ్గించడం వంటి ఆంశాల్లో నిమగ్నమై ఉన్నాయి. భారతదేశం నుండి వోల్కాని పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారిని కూడా మంత్రి కలవనున్నారు.

వ్యవసాయ మంత్రికి కిబ్బత్జ్ నాన్ సమీపంలోని గనే ఖ్నాన్ వద్ద అధునాతన మ్యాపింగ్ మరియు ఫోటోగ్రఫీ కలయికతో డ్రోన్ వ్యవసాయ సాంకేతిక పరిష్కారాలను అందజేస్తారు. నెగెక్ ఎడారి ప్రాంతంలో భారతీయ కూరగాయలు పండిస్తున్న భారతీయ సంతతికి చెందిన రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని కూడా మంత్రి సందర్శిస్తారు.

చివరి రోజున మంత్రి  ఇజ్రాయెల్ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మిస్టర్ ఓడెడ్ ఫోరెర్‌తో ఆయన కార్యాలయంలో ఒకరితో ఒకరు పరస్పరం సంభాషిస్తారు. చివరగా ప్రతినిధి బృందం ఎంఏఎస్‌హెచ్‌ఏవికు చెందిన అంతర్జాతీయ వ్యవసాయ శిక్షణా కేంద్రం, షెఫాయిమ్‌ను సందర్శించాలని ప్రతిపాదించబడింది. ఇది 1963 నుండి పనిచేస్తోంది మరియు వ్యవసాయం, నీటి నిర్వహణ, పర్యావరణం మరియు గ్రామీణాభివృద్ధి రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించడం, జ్ఞానాన్ని బదిలీ చేయడం మరియు వృత్తిపరమైన మద్దతులో నైపుణ్యం కలిగి ఉంది.


 

*****



(Release ID: 1823581) Visitor Counter : 140


Read this release in: English , Urdu , Hindi , Tamil