రైల్వే మంత్రిత్వ శాఖ
అక్రమ రవాణారహిత దేశంగా భారత్‌ను చేసేందుకు అసోసియేషన్ ఫర్ వాలెంటరీ యాక్షన్‌తో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన రైల్వే భద్రతా దళం (ఆర్‌పిఎఫ్)
Posted On:
06 MAY 2022 4:14PM by PIB Hyderabad
అక్రమ రవాణా రహిత దేశంగా భారత్‌ను చేసేందుకు అసోసియేషన్ ఫర్ వాలెంటరీ యాక్షన్ (ఎవిఎ)తో రైల్వే భద్రతా దళం (ఆర్‌పిఎఫ్) అవగాహనాపత్రంపై సంతకాలు చేసింది.
దేశాన్ని అక్రమరవాణా రహితం చేయాలన్న సామాన్య లక్ష్యం కోసం కలిసి పని చేయాలన్న దృక్ఫథంతో కైలాశ్ సత్యార్ధి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కెఎస్‌సిఎఫ్) సిఇఒ రజనీ సిబాల్‌తో శ్రీ కైలాస్ సత్యార్ధి సమక్షంలో 8 ఏప్రిల్, 2022న ఆర్‌పిఎఫ్ డిజి శ్రీ సంజయ్ చందర్ వివరణాత్మక చర్చలకు శ్రీకారం చుట్టారు. బచ్‌పన్ బచావ్ ఆందోళన్‌గా అని కూడా పరిచితమైన ఎవిఎ, ఆర్‌పిఎఫ్ కలిసి ఎంఒయుపై చేసిన సంతకాల ద్వారా ఈ చర్చలను ముందుకు తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా వారు, సమాచారాన్ని పంచుకోవడానికి కలిసి పని చేస్తామని, అక్రమరవాణాకు వ్యతిరేకంగా ఆర్‌పిఎఫ్ సిబ్బంది, రైల్వే ఉద్యోగులు పనిచేసేందుకు వారి సామర్ధ్య నిర్మాణం, వారిలో ఉత్తేజనను (సెన్సిటైజేషన్) పెంచడం, అవగాహనను సృష్టించడమే కాక, అక్రమరవాణా కేసులను గుర్తించడం, ఆచూకీ తీయడంలో ఒకరికొకరు తోడ్పడాలని ప్రతిజ్ఞ చేశారు. ఎంఒయు చట్రం కింద ఇద్దరు భాగస్వాములతో సంయుక్త చర్య తప్పనిసరిగా, దేశవ్యాప్తంగా ఆర్‌పిఎఫ్ ప్రారంభించిన ఆపరేషన్ ఎఎహెచ్‌టి (యాక్షన్ ఎగనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ - అక్రమరవాణాకు వ్యతిరేకంగా చర్య) పరిధిని, స్థాయిని పెంచనుంది.
రైల్వే భద్రతా దళానికి రైల్వే ఆస్తులు, ప్రయాణీకుల ప్రాంతం, ప్రయాణీకుల భద్రతా బాధ్యతను అప్పగించారు. రైల్వే మంత్రిత్వ శాఖ పిల్లలను కాపాడడంపై జారీ చేసిన ప్రామాణిక కార్యనిర్వహణ పద్ధతికి అనుగుణంగా ఈ భాధ్యతను నిర్వర్తిస్తూ, 2018లో ప్రారంభించిన ఆపరేషన్ నన్హే ఫరిష్తే కింద ఇతర భాగస్వాములతో 50,000మందికి పైగా పిల్లలను కాపాడేందుకు కలిసి పని చేస్తోంది. రైలు ద్వారా అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టేందుకు ఆపరేషన్ ఎఎహెచ్‌టిని ప్రారంభించి, అక్రమరవాణాదారుల పంజా నుంచి బాధితులను కాపాడుతోంది. అక్రమరవాణాదారులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడంలో భాగంగా అది 298 మైనర్ ఆడపిల్లలు సహా 1400 మంది మైనర్లను కాపాడింది. భారతదేశ వ్యాప్తంగా 740 ప్రాంతాలలో ఆర్‌పిఎఫ్ అక్రమరవాణా వ్యతిరేక యూనిట్లను (ఎహెచ్‌టియు)లను ఏర్పాటుచేసి, ఈ క్షేత్రంలో పని చేసే ఇతర ఏజెన్సీల సమన్వయంతో అక్రమ మానవ రవాణాకు వ్యతిరేకంగా చర్య తీసుకోవలసిందిగా ఆదేశించింది.
పిల్లలకు వ్యతిరేకంగా అన్ని రూపాల హింసను తొలగించి, పిల్లలు స్వేచ్ఛగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉంటూ నాణ్యత కలిగిన విద్యను అందించే ప్రపంచాన్ని సృష్టించాలన్న సంకల్పంతో నోబుల్ గ్రహీత కైలాస్ సత్యార్ధి 1979లో ప్రారంభించిన కైలాస్ సత్యార్ధి చిల్డ్రన్స్ ఫౌండేషన్‌తో కలిసి బచ్‌పన్ బచావ్ ఆందోళన్‌గా కూడా తెలిసిన అసోసియేషన్ ఆఫ్ వాలెంటరీ యాక్షన్ పని చేస్తోంది, అనుబంధంగా ఉంది. పిల్లల భద్రతకు సంబంధించి నిబంధనా చట్రాన్ని లేదా అత్యుత్తమ అచరణలను గుర్తించి, వాటి ప్రతికృతి విధానాన్ని అమలు చేయడం, విధులలో ఉన్నవారి సామర్ధ్‌య నిర్మాణం, జాతీయ, అంతర్జాతీయ విధానాలను బలోపేతం చేయడం, సమన్వయంతో కూడిన చర్యల ద్వారా ఈ మిషన్‌ను సాధించాలన్న లక్ష్యంతో ఎవిఎ పని చేస్తోంది. బిబిఎ పిల్లల అక్రమరవాణాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులతో/ ఆర్‌పిఎఫ్‌తో పంచుకోవడమే కాక, బాధితులను కాపాడేందుకు/ అక్రమరవాణాదారులను అరెస్టు చేసేందుకు తోడ్పడుతూ, పిల్లల అక్రమరవాణాకు వ్యతిరేకంగా చర్య అన్న క్షేత్రంలో జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సేకరించింది.
దేశంలో ప్రాథమిక రవాణా సంస్థ భారతీయ రైల్వేలు అయినందున, కనుక అక్రమరవాణాదారులు రవాణా చేసేందుకు ప్రధానమార్గంగా ఉంది. బాధితుడు/ రాలు గమ్యాన్ని చేరి, దోపిడీ ప్రారంభమయ్యే ముందే ఈ అక్రమరవాణాను దారిలోనే నిరోధించేందుకు రైల్వే స్టేషన్లలోనూ, రైళ్ళలోనూ ఆర్‌పిఎఫ్ సిబ్బందిని వ్యూహాత్మకంగా మోహరించారు. ఈ వ్యూహాత్మక స్థానాలు, దేశవ్యాప్త విస్తరణ కారణంగా, మానవ అక్రమరవాణాను .అరికట్టడంలో దేశ కృషికి ఆర్‌పిఎఫ్ అదనపు తోడ్పాటుగా ఉండగలదు.
***
(Release ID: 1823399)
Visitor Counter : 170