భారత ఎన్నికల సంఘం
ఒడిశా, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలు
Posted On:
03 MAY 2022 9:13AM by PIB Hyderabad
ఒడిశా, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఈ కింది శాసనసభా నియోజకవర్గాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. : -
క్రమ సంఖ్య
|
రాష్ట్రం పేరు
|
అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య, పేరు.
|
-
|
ఒడిశా
|
06-బ్రజారాజ్ నగర్
|
2
|
కేరళ
|
83-త్రిక్కకర
|
3
|
ఉత్తరాఖండ్
|
55-చంపావత్
|
ఉప ఎన్నికల షెడ్యూలు ఈ కింది విధంగా ఉంది:
ఉపఎన్నిక షెడ్యూలు
|
ఎన్నిక కార్యక్రమం
|
షెడ్యూల్-1
(కేరళ అసెంబ్లీ స్థానం కోసం)
|
షెడ్యూల్-2
(ఒడిశా, ఉత్తరాఖండ్ లోని
అసెంబ్లీ స్థానాల కోసం)
|
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ
|
మే 4, 2022 (బుధవారం)
|
మే 4, 2022 (బుధవారం)
|
నామినేషన్లకు చివరి తేదీ
|
మే 11, 2022 (బుధవారం)
|
మే 11, 2022 (బుధవారం)
|
నామినేషన్లను పరిశీలించే తేదీ
|
మే 12, 2022 (గురువారం)
|
మే 12, 2022 (గురువారం)
|
అభ్యర్థిత్వాల ఉపసంహరణకు ఆఖరు తేదీ
|
మే 16, 2022 (సోమవారం)
|
మే 17, 2022 (మంగళవారం)
|
పోలింగ్ తేదీ
|
మే 31, 2022 (మంగళవారం)
|
మే 31, 2022 (మంగళవారం)
|
వోట్ల లెక్కింపు తేదీ
|
జూన్ 3, 2022 (శుక్రవారం)
|
జూన్ 3, 2022 (శుక్రవారం)
|
ఎన్నిక ప్రక్రియ ముగియవలసిన తేదీ
|
జూన్ 5, 2022 (ఆదివారం)
|
జూన్ 5 2022 (ఆదివారం)
|
2022 మే 16వ తేదీ బుద్ధపూర్ణిమ రోజు,.. నెగోషియబుల్ ఇంస్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవుదినం అయినందున ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీని 2022 మే 17గా నిర్ణయించారు.
- వోటర్ల జాబితా
పైన పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1-1-2022 నాటికి ప్రచురితమైన వోటర్ల జాబితాను ఈ ఎన్నికలకు వినియోగిస్తారు.
- ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇ.వి.ఎం.లు), వి.వి.పి.ఎ.టి.లు
ఈ ఉపఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను (ఇ.వి.ఎం.లను), వి.వి.పి.ఎ.టి.లను వినియోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఉప ఎన్నికల కోసం తగిన సంఖ్యలో ఇ.వి.ఎం.లను, వి.వి.పి.ఎ.టి.లను అందుబాటులో ఉంచారు. ఈ వోటింగ్ యంత్రాల సహాయంతో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు.
- వోటర్ల గుర్తింపు
ఈ ఉపఎన్నికల్లో పాల్గొనే వోటర్లను గుర్తించేందుకు,. వోటర్ల ఫొటో గుర్తింపు కార్డు (ఇ.పి.ఐ.సి.)నే ప్రధానమైన అధికారిక పత్రంగా పరిగణిస్తారు. అయితే,..ఈ కింద సూచించిన ఏదైనా గుర్తింపు పత్రాలను కూడా వోటర్లు పోలింగ్ కేంద్రం వద్ద చూపించవచ్చు:
- ఆధార్ కార్డు,
- మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ.) జాబ్ కార్డు,
- బ్యాంకు/పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్కులు,
- కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో జారీ అయిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,
- డ్రైవింగ్ లైసెన్స్,
- పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య-పి.ఎ.ఎన్.) కార్డు,
- జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్.) పరిధిలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్.జి.ఐ.) జారీ చేసిన స్మార్ట్ కార్డు.
- భారతీయ పాస్ పోర్టు,
- ఫొటోతో కూడిన పెన్షన్ పత్రం,
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన సర్వీసు గుర్తింపు ఫొటో కార్డులు
- ఎం.పి.లకు/ఎమ్మెల్యేలకు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
- వైకల్యం గుర్తింపు (యు.డి.ఐ.డి.) కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పరిధిలో జారీ అయినవి.
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఎన్నికలు జరగబోయే అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా, లేదా పాక్షికంగా ఆవరించి ఉన్న జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. అయితే, కొన్ని సవరణలకు లోబడి ఈ నియమావళిని వర్తింపజేస్తారు. 2017వ సంవత్సరం జూన్ 29వ తేదీన ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ చర్యలు తీసుకుంటారు.
- క్రిమినల్ కేసుల నేపథ్యంపై సమాచారం
క్రిమినల్ కేసుల నేపథ్యం కలిగిన అభ్యర్థులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వార్తా పత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో ప్రచురించవలసి ఉంటుంది. ప్రచారం వ్యవధిలో మూడు సందర్భాల్లో వారు ఈ సమాచారం వెలువరించాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల నేపథ్యం ఉన్న అభ్యర్థులను పోటీలో నిలిపే రాజకీయ పార్టీ కూడా తమ అబ్యర్థుల క్రిమినల్ కేసుల నేపథ్యంపై సమాచారాన్ని తమ వెబ్ సైట్లో వార్తాపత్రికల్లో, టెలివిజన్లలో ప్రచురించాల్సి ఉంటుంది. మొత్తం మూడు సందర్భాల్లో ఈ సమాచారాన్ని వెలువరించాల్సి ఉంటుంది.
క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్న అభ్యర్థులపై సమాచారాన్ని వోటర్లు తెలుసుకునేందుకు తగినంత వ్యవధిని ఇవ్వాలని, అందుకు మూడు సందర్భాల్లో వారిపై సమాచారాన్ని వెలువరించాలని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్ 2020 సెప్టెంబరు 16వ తేదీన ఆదేశాలు జారీ చేసింది:
ఎ. ఉపసంహరణ ముందు మొదటి 4 రోజుల్లోగా..
బి. తదుపరి 5-8 రోజుల మధ్య.
సి. 9వ రోజునుంచి ప్రచారం చివరి రోజువరకూ (పోలింగ్ తేదీకి రెండు రోజులు ముందు.)
(వివరణ: అభ్యర్థిత్వం ఉపసంహరణ చివరి తేదీ నెలలో 10వ తేదీగా ఉండి, అదే నెల 24వ తేదీన పోలింగ్ జరుగుతున్న పక్షంలో, ఆ నెల 11, 14 తేదీల మధ్య డిక్లరేషన్ తొలి భాగం ప్రచురించాల్సి ఉంటుంది. రెండవ భాగం డిక్లరేషన్.ను 15-18 తేదీల మధ్య, 3వ భాగం డిక్లరేషన్.ను 19-22 తేదీల మధ్య ప్రచురించాల్సి ఉంటుంది.)
2015లో లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తదితరుల కేసుకు సంబంధించిన రిటి పిటిషన్.పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు, అంతకు ముందు 2011లో పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్, తదితరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తదితరుల కేసుకు సంబంధించిన పిటిషన్.పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఇది ప్రచురించవలసి ఉంటుంది.
‘నో యువర్ క్యాండిడేట్స్’ అన్న యాప్ లో కూడా ఇదే సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
- కోవిడ్-19 కాలంలో జరిగిన ఉపఎన్నికల్లో అనుసరించిన స్థూల మార్గదర్శక సూత్రాలను 2022లో సవరించిన ప్రకారం పాటించాల్సి ఉంటుంది.
- సవరించిన స్థూల మార్గదర్శక సూత్రాలను ఎన్నికల కమిషన్ 2022 జనవరి 8వ తేదీన జారీ చేసింది. కమిషన్ వెబ్ సైట్ https://eci.gov.in/files/file/13932-revised-broad-guidelines-for-conduct-of-general-electionsbye-elections-during-covid-19/. లో కూడా ఈ మార్గదర్శక సూత్రాలు అందుబాటులో ఉంటాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చింది. తదనుగుణంగా తగిన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు కమిషన్ వెబ్ సైట్ https://eci.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి.
- భాగస్వామ్య వర్గాలన్నీ ఈ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇవే ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కిందివిధంగా చర్యలు తీసుకుంటాయి.
- కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా అధీకృత సంస్థలు జారీచేసిన ఆదేశాలకు తగినట్టుగా ఎన్నికల నిర్వహణా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. కోవిడ్-19 నిబంధనల మేరకు భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానింగ్, ముఖ కవచం, చేతి తొడుగులు తదితరాలను వినియోగించాల్సి ఉంటుంది. కోవిడ్ నిబంధలను తప్పనిసరిగా అమలయ్యేలా సంబంధిత రాష్ట్ర ప్రకృతి వైపరీత్య నిర్వహణా సంస్థ (ఎస్.డి.ఎం.ఎ.) బాధ్యత వహించాల్సి ఉంటుంది. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాల పాటించేలా చూసే ప్రక్రియలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్,జిల్లా స్థాయి అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుంది.
- ఎవరైనా అభ్యర్థి లేదా రాజకీయ పార్టీ ఏదైనా మార్గదర్శక సూత్రాన్ని అతిక్రమించిన పక్షంలో సంబంధిత అభ్యర్థి లేదా పార్టీ ర్యాలీలు, సమావేశాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వరు. ప్రధాన ప్రచారకర్త ఎవరైనా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో సదరు నియోజకవర్గం లేదా జిల్లాలో ప్రధాన ప్రచార కర్త తదుపరి ప్రచారం జరిపేందుకు అనుమతి లభించదు.
- భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల దరిమిలా, ఎన్నికల కమిషన్ పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉంటుంది. పరిస్థితిని బట్టి తదుపరి ఎన్నికలకు మార్గదర్శక సూత్రాలను మరింత కఠినతరం చేసే అవకాశాలుంటాయి.
- ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలన్నింటినీ ఈ ఉప ఎన్నికలకు కూడా వర్తింపజేస్తారు.
******************
(Release ID: 1822453)