పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 25, 2022న యోగ ప్రభను నిర్వహించనున్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారీ యోగ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న శ్రీ జ్యోతిరాదిత్య సింథియా
కార్యక్రమంలో పాలుపంచుకోనున్న పౌరవిమానశాఖ, అనుబంధ సంస్థలకు చెందిన 500మందికి పైగా అధికారులు
Posted On:
22 APR 2022 5:52PM by PIB Hyderabad
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 25 ఏప్రిల్ 2022న న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో భారీ యోగ కార్యక్రమం యోగ ప్రభను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింథియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (రిటైర్డ్) ప్రారంభించి, నిర్వహించనున్నారు. విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ సంస్తలు/ ప్రభుత్వ రంగ సంస్థలు/ స్వయంప్రతిపత్త సంస్థలకు చెందిన 500మంది అధికారులు కూడా ఈ భారీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. సాధారణ యోగ ప్రోటోకాల్, నిపుణులచే యోగ ఉపన్యాసం, ప్రదర్శన వంటి కార్యకలాపాలను ఈ కార్యక్రమం సందర్భంగా చేపట్టనున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చొరవతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2014లో 21 జూన్‌ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించాలన్న చారిత్రిక నిర్ణయం తీసుకుంది. మన దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్గత భాగమైన యోగాకు అంతర్జాతీయంగాఆమోదం లభించడం అన్నది మన దేశానికి గర్వకారణం.
అంతర్జాతీయ యోగదినోత్సవమైన 21 జూన్ 2022కు ఇంకా రెండు నెలలు ఉన్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అన్నది నిత్య జీవితంలో యోగ ప్రాముఖ్యత పట్ల పాల్గొనేవారిలో విస్త్రతమైన చైతన్యాన్ని కల్పించేందుకు తోడ్పడుతుంది.
(Release ID: 1819180)
Visitor Counter : 180