వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర


అనంతపురం వ్యవసాయ యాంత్రిక శిక్షణ,
పరీక్షా సంస్థలో డ్రోన్ల ప్రదర్శన..

Posted On: 08 APR 2022 5:31PM by PIB Hyderabad

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఉన్న దక్షిణప్రాంతీయ వ్యవసాయ యాంత్రిక, శిక్షణ, పరీక్షా సంస్థను (ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.-టి.ఐ.ని) కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి, 2022,.. ఏప్రిల్ 8న సందర్శించారు. డ్రోన్ల ప్రదర్శనా కార్యక్రమానికి ఆయన రైతులతో కలసి హాజరయ్యారు. రైతులతో సంభాషించారు.

 

https://ci5.googleusercontent.com/proxy/45iYFWJIEGBcNBwMOx-rT7XbkNARh-84KPzeTFHqp1B7IttYUAWqa68F6FRVhoTgjOIW8V0icE74x5dcJGa_v0SeTwKE33xUObsJe22A7WDaZsoTujIXo4sVhQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015EPN.jpg

 

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో సుస్థిరతను, సాగు నిర్వహణా సామర్థ్యాన్ని పెంచడంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానానికి ఎంతో కీలకపాత్ర ఉందని, వ్యవసాయ నిర్వహణా వ్యయాన్ని తగ్గించడంతోపాటుగా, ప్రమాదకరమైన పని పరిస్థితుల్లో మనుషుల ప్రమేయాన్ని తగ్గించేందుకు కూడా ఇది దోహదపడుతుందని అన్నారు. పంటల అంచనా, భూమి రికార్డుల డిజిటైజేషన్, పంటలపై క్రిసంహారకాలు, పోషకాలను చల్లడం వంటి కార్యకలాపాల్లో కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్టు 2022-23వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్లోనే ప్రభుత్వం ప్రకటించిందని ఆయన చెప్పారు.

 

https://ci6.googleusercontent.com/proxy/rd9yHqGDJ4pQfItX__efvD12RpTPeznwQxtoL_aIiFevxI6vX_MraNXpIv5FilrOFXv4lAVN_61jlE4B4xJZ8n102v1ZqLFQVMHyi_b2jx2nYbQgnT19b67Jdw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JBUF.jpg

 

  వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న విభిన్నమైన సానుకూల అవకాశాలను గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వ శాఖ, సంబంధిత విభాగాలు, ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని అన్నారు.

  పంటలపై క్రిమిసంహారకాలను, పోషకాలను ప్రయోగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి కొన్ని ప్రమాణబద్ధమైన నిర్వహణా పద్ధతులను కేంద్ర వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అమలులోకి తెచ్చింది. డ్రోన్లను సురక్షితంగా, సమర్థవంతంగా వినియోగించేందుకు తగిన నిబంధనలను ఈ పద్ధతులు తెలియజేస్తాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, రైతులకు, ఇతర భాగస్వామ్య వర్గాల వారికి డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు యోగ్యంగా మార్చుందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. డ్రోన్ల ఖరీదుకు, సంబంధిత అత్యవసర వ్యయానికి సంబంధించి వందశాతం ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్ల టెక్నాలజీ ప్రదర్శన  నిర్వహించేందుకు గాను వ్యవసాయ యాంత్రిక, శిక్షణ, పరీక్షా నిర్వహణాసంస్థలకు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) అనుబంధ సంస్థలకు, కృషి విజ్ఞాన కేంద్రాలకు (కె.వి.సి.లకు) వివిధ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.

  రైతుల పొలాల్లో వినియోగానికి గాను, డ్రోన్ల కొనుగోలుకోసం వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలకు (ఎఫ్.పి.ఒ.లకు) 75శాతం నిధులను అందిస్తారు. డ్రోన్ల వినియోగం ద్వారా వ్యవసాయ సేవలను అందించేందుకు వీలుగా, డ్రోన్లు, వాటి అనుబంధ పరికరాల మౌలిక ధరలో 40శాతం లేదా రూ. 4లక్షలు (ఏది తక్కువ మొత్తమైదే అది) కూడా అందిస్తారు. వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తదార్ల సంఘాలు (ఎఫ్.పి.ఒ.లు), గ్రామీణ ఔత్సాహిక సంఘాల పరిధిలోని ప్రస్తుత సంస్థలు లేదా కొత్త కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సి.హెచ్.సి.లు) చేపట్టే డ్రోన్ల కొనుగోళ్లకు కూడా ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ విషయంలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను స్థాపించే వ్యవసాయ గ్రాడ్యుయేట్లు,.. ఖర్చులో 50శాతాన్ని ఆర్థిక సహాయంగా పొందడానికి వీలుంటుంది. అయితే, రూ. 5లక్షల గరిష్ట మొత్తానికి మించకుండా ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.

   సి.హెచ్.సి.లకు, హైటెక్ కేంద్రాలకు సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల కొనుగోలుకు గల అవకాశాలతో, డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం వారికి అందుబాటు యోగ్యంగా మారుతుంది. దీనితో డ్రోన్ల విస్తృతస్థాయి వినియోగానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. దేశంలో సామాన్యులకు కూడా డ్రోన్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల తయారీకి మరింత ప్రోత్సాహంకూడా లభిస్తుంది.

  ఇక  పూర్తిగా మెరుగుపరిచిన అధునాతన వ్యవసాయ యాంత్రిక పరికరాల ప్రదర్శనను కూడా డాక్టర్ లిఖి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముచ్చటిస్తూ, వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్.ఎం.ఎ.ఎం.) కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తీసుకున్న చర్యలను వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులను,.. చిన్న, సన్నకారు రైతులకు, వ్యవసాయ విద్యుత్ తక్కువ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రాంతాలకు చేరువగా తీసుకెళ్లేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. అలాగే, చిన్న చిన్న భూకమతాలు, వ్యక్తిగత యాజమాన్యపు భారీ వ్యయం కారణంగా తలెత్తే ప్రతికూల ఆర్థిక వ్యవస్థ అంతరాలను పూడ్చే ప్రయత్నంలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను కూడా తెలియజేశారు. ఈ పథకం కింద, యంత్రాలు, యంత్రపరికరాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు రైతులకు వారి వారి వర్గాల ప్రాతిపదికగా 40శాతం నుంచి 50శాతం వరకూ ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలిపారు. ఎస్.ఎం.ఎ.ఎం. పథకం కింద రైతులు వ్యవసాయ యాంత్రిక ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు ఈ సహాయం అందిస్తారని అన్నారు. అలాగే, గ్రామీణ యువతకు, ఔత్సాహిక రైతులకు ప్రాజెక్టు వ్యయంలో 40శాతాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఔత్సాహిక రైతులకు, రైతు సహకార సంఘాలకు, రిజస్టర్డ్ రైతు సంఘాలకు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలకు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, హైటెక్ కేంద్రాల ఏర్పాటు కోసం  పంచాయతీలకు,  అత్యున్నత విలువలు కలిగిన వ్యవసాయ యంత్రాలకోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలిపారు. ఇక 10 లక్షల వరకూ విలువైన ప్రాజెక్టుల విషయంలో అయితే ప్రాజెక్టు వ్యయంలో 80శాతం వరకూ ఆర్థిక సహాయం అందిస్తారు. సహకార సంఘాలకు, రిజిస్టర్డ్ రైతు సంఘాలకు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలకు (ఎఫ్.పి.ఒ.లకు), గ్రామ స్థాయిలో వ్యవసాయ యంత్రాల బ్యాంకులను (ఎఫ్.ఎం.బి.లను) ఏర్పాటు చేయడానికి వివిధ గ్రామ పంచాయతీలకు ఈ ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక, రూ. 10లక్షల వరకూ ఖర్యయ్యే ప్రాజెక్టులకు సంబంధించి, ఈశాన్య రాష్ట్రాల్లో ఎఫ్.ఎం.బి.ల ఏర్పాటుకోసం ప్రాజెక్టు వ్యయంలో ఏకంగా 95శాతాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తారు.

  అనంతపురంలోని వ్యవసాయ యాంత్రిక శిక్షణా, పరిశోధనా సంస్థ డైరెక్టర్.తో, సిబ్బందితో కూడా అభిలాక్ష్ లిఖి సంభాషించారు. సంస్థ పరిధిలోని పవర్ టిల్లర్ పరీక్షా సదుపాయాలతో పాటుగా, వివిధ రకాల శిక్షణా, పరీక్ష నిర్వహణా కేంద్రాలను, లేబరేటరీలను ఆయన తిలకించారు. సంస్థ రూపొందించిన మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు సంస్థ చేస్తున్న కృషిని, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల అవసరాలు తీర్చేందుకు సంస్థ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.

 

****


(Release ID: 1815126) Visitor Counter : 260


Read this release in: English , Urdu , Hindi