ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంధత్వ మరియు దృష్టి లోపం నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం తాజా స్థితి

Posted On: 05 APR 2022 3:41PM by PIB Hyderabad

అంధత్వం నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం 1976లో ప్రారంభం అయింది. 2017 నుండి, అన్ని రకాల దృష్టి లోపాలను కూడా పరిథిలోకి తీసుకువస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేయడంతో పాటు విస్తరించడం కూడా జరిగింది. ఇది అంధత్వం మరియు దృష్టి లోపం (ఎన్పిసిబి&విఐ) నియంత్రణకు జాతీయ కార్యక్రమంగా పేరు మార్చారు. 2025 నాటికి నివారించదగిన అంధత్వ నివారణ ప్రాబల్యాన్ని2025 నాటికి 0.25%కి తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఏకరీతిగా అమలు జరుగుతోంది. కంటిశుక్లం, వక్రీభవన లోపాలు, కార్నియా అంధత్వం మరియు బాల్య అంధత్వంతో పాటు ఈ కార్యక్రమం గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (ఆర్ఓపి), వయస్సు సంబంధిత మచ్చల క్షీణత మొదలైన ఇతర కంటి వ్యాధులపై సమానంగా దృష్టి సారిస్తుంది. దేశంలోని ఆయుష్మాన్ భారత్-హెల్త్ & వెల్నెస్ సెంటర్ల ద్వారా నివారణ మరియు నేత్ర సంరక్షణ సేవలు కూడా అందిస్తారు.
కార్యక్రమాన్ని అంచనా వేయడానికి, 2015-19లో “నేషనల్ బ్లైండ్‌నెస్ & విజువల్ ఇంపెయిర్‌మెంట్ సర్వే” నిర్వహించారు. ఇది అంధత్వం ప్రాబల్యాన్ని 1% (2007) నుండి 0.36% (2019)కి తగ్గించింది.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి జాతీయ స్థాయిలో పర్యవేక్షిస్తారు. పెరుగుతున్న అంధత్వ కేసులను తనిఖీ చేయడానికి రాష్ట్రాలు/యుటిల స్థాయిలో, పంచాయతీల నుండి కార్యకర్తలు, సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్) సిబ్బంది, ఆశా వర్కర్లు, ఎన్జీఓలు , మహిళా మండళ్లు వంటి ఇతర స్వచ్ఛంద  సమూహాలు జిల్లా ఆరోగ్య సంఘాల ద్వారా భాగస్వామ్యం అవుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

 

****



(Release ID: 1813998) Visitor Counter : 340


Read this release in: English , Urdu , Manipuri