వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకేల) ద్వారా సాంకేతిక ఉత్పత్తులు

Posted On: 05 APR 2022 4:10PM by PIB Hyderabad

నూతన వ్యవసాయ సాంకేతికతలు, ఉత్తమ సాగుపద్ధతులను ఎంపికచేసి రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని అమలుపర్చే లక్ష్యంతో ప్రతి గ్రామీణ జిల్లాల్లో కృషివిజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రారంభించేందు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

గత మూడేళ్లలో 5.48 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 1150.53 లక్షల మొక్కలు నాటే పదార్థాలు, 2.74 లక్షల క్వింటాళ్ల బయో ఉత్పత్తులు,  680.79 లక్షల లైవ్ స్టాక్ స్ట్రెయిన్స్ మరియు ఫింగర్లింగ్స్  గత మూడేళ్లలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఉత్పత్తి చేసిన నాణ్యమైన సాంకేతిక ఉత్పత్తులు.

వ్యవసాయ సాంకేతికతలను అంచనా వేయడం మరియు ప్రదర్శించడం, రైతులు మరియు విస్తరణ సిబ్బందికి శిక్షణ; రైతులకు వ్యవసాయ సలహాలను అందించడం; మరియు రైతులలో మెరుగైన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, విత్తుకునే పదార్థాలు మరియు ఇతర సాంకేతిక ఇన్‌పుట్‌ల ఉత్పత్తి వంటివి కృషి విజ్ఞాన కేంద్రాల కార్యకలాపాలుగా ఉంటున్నాయి.  ఈ కార్యకలాపాల ద్వారా రైతులు తమ క్షేత్ర సమస్యలను పరిష్కరిస్తూ, సాగు ఖర్చును తగ్గించి, ఉత్పత్తిని పెంచి, వారికి రాబడిని పెంచే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి దారి తీస్తుంది.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

***

 


(Release ID: 1813981) Visitor Counter : 191
Read this release in: English , Urdu