మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన
Posted On:
01 APR 2022 5:17PM by PIB Hyderabad
(ఎ) నుంచి (డి): ఫిషరీస్ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ- ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పేరు మీద ప్రధాన పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అత్యధికంగా రూ.20,050 కోట్లు కేటాయించారు. PMMSY కేంద్ర ప్రాయోజిత కాంపోనెంట్ పథకం కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి మొత్తం రూ. 1955 కోట్లు కేటాయించారు. భారత ప్రభుత్వ ఫిషరీస్ శాఖ, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్య అభివృద్ధి ప్రతిపాదనలకు మొత్తం రూ. 779.371 కోట్లు అందులో కేంద్ర వాటా రూ. 247.872 కోట్లు. PMMSY మార్గదర్శకాలకు అనుగుణంగా ఆచరణీయమైన ప్రతిపాదనల సమర్పణను బట్టి , ఆమోదించిన ప్రాజెక్టు అమలులో పురోగతి, ప్రయోజనం కోసం విడుదల చేసిన కేంద్ర నిధుల వినియోగం సంబంధిత ఆర్థిక మార్గదర్శకాలు/విధానాలకు అనుగుణంగా కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తారు. కేంద్ర వాటాగా ఇస్తున్న రూ. 247.872 కోట్ల నిధిలో PMMSY కింద మత్స్యశాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు రాష్ట్రంలో మత్స్య ఆక్వాకల్చర్ అభివృద్ధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 149.03 కోట్లు కేటాయించింది.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
******
(Release ID: 1813271)
Visitor Counter : 271