ఆయుష్
azadi ka amrit mahotsav

దేశంలో 37 కంటోన్మెంట్ ఆసుపత్రుల్లో నెల రోజుల్లోగా పనిచేయనున్న ఆయుర్వేద కేంద్రాలు

Posted On: 01 APR 2022 7:28PM by PIB Hyderabad

దేశంలో 37 కంటోన్మెంట్ ఆసుపత్రుల్లో ఆయుర్వేద కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.    ఆరోగ్య సేవలలో  ఆయుర్వేద వైద్యాన్ని అంతర్భాగంగా చేయాలని నిర్ణయించిన ఆయుష్ మంత్రిత్వ శాఖరక్షణ శాఖలు దేశం వివిధ ప్రాంతాల్లో  ఉన్న 37 కంటోన్మెంట్ ఆసుపత్రులలో 2022 మే నుంచి ఆయుర్వేద కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించాయి. 

దీనిలో భాగంగా 37 కంటోన్మెంట్ ఆసుపత్రుల్లో నైపుణ్యం గల డాక్టర్లుఫార్మాసిస్టులను నియమించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రధాన మిలిటరీ ఆసుపత్రులైన  166 ఎమ్ హెచ్ ,సీహెచ్   (డబ్ల్యు సి )చండి మందిర్ ఎమ్ హెచ్   జైపూర్, 10   సీహెచ్   (సీసీ ) లక్నో ఎమ్ హెచ్   డెహ్రాడూన్ ఎమ్ హెచ్   జబల్పూర్ సీహెచ్   (ఎస్ సి ) పూణే ఎమ్ హెచ్   సికింద్రాబాద్ సీహెచ్   (ఈసీ )కోల్‌కతా మరియు 151 బి హెచ్ .సీహెచ్ లలో  రక్షణ మంత్రిత్వ శాఖ ఆయుష్ వైద్యులు మరియు ఫార్మసిస్ట్‌లను నియమిస్తుంది. 

 ఈ సౌకర్యాల నిర్వహణ కోసం  నైపుణ్యం కలిగిన మరియు అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు మరియు ఫార్మసిస్ట్‌లను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎంప్యానెల్ చేస్తుంది.

ఆయుష్ కేంద్రాల ద్వారా  సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబాలు తో సహా కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు,   ఈ ఆసుపత్రుల నుంచి ఆయుర్వేద ఆరోగ్య సేవలు పొందే అవకాశం కలుగుతుంది. 

కంటోన్మెంట్ ఆసుపత్రుల్లో ఆయుర్వేద కేంద్రాలను ప్రారంభించాలని రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాకేష్ కొటెచా మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సాయుధ దళాల వైద్య సేవల కింద ఈ కేంద్రాలను ప్రారంభించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య అవగాహన కుదిరింది. 

రక్షణ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న ఆయుర్వేద వైద్య విధానానికి మరింత ప్రాచుర్యం కలుగుతుంది. ఆయుర్వేద వైద్య విధానం ఉత్తమ వైద్య విధానాల్లో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన శాస్త్రీయ పరిశోధనల్లో రుజువయింది. 

ఆయుర్వేద కేంద్రాలు ప్రారంభం కానున్న కంటోన్మెంట్ ఆసుపత్రుల వివరాలు: 

ఆగ్రా

అలహాబాద్

బరేలీ

డెహ్రాడూన్

ఎమ్ హౌ 

పచ్మరీ

7 షాజహాన్‌పూర్

జబల్పూర్

బాదామి బాగ్

10 బారక్‌పూర్

11 అహ్మదాబాద్

12 డెహూరోడ్

13 ఖడ్కీ

14 సికింద్రాబాద్

15 డగ్ శాయి 

16 ఫిరోజ్‌పూర్

17 జలంధర్

18 జమ్మూ

19 జుటోగ్

20 కసౌలి

21 ఖాస్యోల్

22 సుబతు

23 ఝాన్సీ

24 బాబినా

25 రూర్కీ

26 దానాపూర్

27 కాంప్టీ

28 రాణిఖేత్

29 లాన్స్‌డౌన్

30 రామ్‌ఘర్

31 మధుర

32 బెల్గాం

33 మోరార్

34 వెల్లింగ్టన్

35 అమృత్ సర్ 

36 బక్లోహ్

37 డల్హౌసీ


(Release ID: 1812904) Visitor Counter : 194


Read this release in: English , Urdu , Hindi