ఆయుష్
జీవనశైలిలో భాగంగా ఆయుష్
Posted On:
29 MAR 2022 2:53PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ ఆధారిత ఆహారం మరియు జీవనశైలి ని ప్రోత్సహిస్తోంది. "సుపోషిత్ భారత్" (పోషక భారతదేశం) సాధన కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తో కలిసి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. పౌష్టిక ఆహార లోపం లేని భారతదేశ నిర్మాణం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ పౌష్టికాహార మార్గదర్శకాలను విడుదల చేసింది. పిల్లలు, గర్భిణులు, మరియు పాలిచ్చే తల్లులకు ఆయుష్ విధానాలు, సూత్రాల ద్వారా పోషకాహారం అందేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తున్నది.
జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 లోని షెడ్యూల్ II ప్రకారం నిర్ణయించిన పోషకాహార ప్రమాణాలను సవరించేందుకు అవసరమైన సమాచారాన్ని, సూచనలను ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖకు ఆయుష్ మంత్రిత్వ శాఖ అందజేసింది.
రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రాయోజిత పథకంగా ఆయుష్ మిషన్ ను ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది. ఆయుష్ వైద్య విధానాల ప్రచారం, అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు, సంరక్షణ చర్యల అమలు లాంటి వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఆయుష్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆయుష్ వైద్య విధానం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు చర్యలు అమలు జరుగుతున్నాయి. నివారణ, ముందు జాగ్రత్త, చికిత్స, పునరావాసం విధానాలతో ఆయుష్ వైద్య సేవలను అందించడం జరుగుతోంది. జీవనశైలిలో ఆయుష్ ను భాగంగా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయుష్ మిషన్ లో భాగంగా ఆయుర్ విద్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా విద్యార్థులకు ఆహార సూత్రాలను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన జీవనశైలి విధానాలపై అవగాహన కలిగించడం జరుగుతుంది. ఆయుష్ ఆధారిత జీవనశైలిని ప్రజలు అలవరచుకునేలా చూసేందుకు గ్రామీణ వైద్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, స్థానికంగా లభిస్తున్న ఆహార పదార్థాలు, మూలికల వినియోగంపై అవగాహన కల్పించి వాటి వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు జాతీయ ఆయుష్ మిషన్ కార్యక్రమాలు అమలు చేస్తున్నది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1811318)