పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంచాయతీ వ్యవస్థలో సుపరిపాలన


ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ లో 2021-22 సంవత్సరానికిగాను 2.62 లక్షల జీపీడీపీలు అప్ లోడ్

పంచాయతీ ఖాతాల సకాలంలో ఆడిట్‌ని నిర్ధారించడం కోసం, ఆన్‌లైన్ అప్లికేషన్‌- ఆడిట్ ఆన్‌లైన్
రూపొందించిన ఎంఓపిఆర్

Posted On: 29 MAR 2022 4:26PM by PIB Hyderabad

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపిఆర్) ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ (ఈజిఎస్) (https://egramswaraj.gov.in) ను అభివృద్ధి చేసింది. ఇది పంచాయతీ రాజ్ సంస్థల (పిఆర్ఐ)లో రూపకల్పన చేసిన ప్రణాళిక, పురోగతి నివేదిక, ఆర్థిక నిర్వహణ మరియు ఆస్తుల వివరాలను పారదర్శకంగా తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా, మంత్రిత్వ శాఖ ఇ-గ్రామ్ స్వరాజ్‌ని గ్రామ పంచాయితీల కోసం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో ఏకీకృతం చేసి విక్రేతలు/సేవా ప్రదాతలకు రియల్ టైం లో  చెల్లింపులు చేసింది. ఇప్పటివరకు, 2021-22 సంవత్సరానికి 2.62 లక్షల జీపీడీపీలు ఈజిఎస్ లో అప్‌లోడ్ అయ్యాయి. ఇంకా, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా విక్రేతలకు చెల్లింపులు చేయడానికి పంచాయతీలు యంత్రాంగాన్ని అనుసరించాయి.

ఇంకా, పంచాయతీ ఖాతాల సకాలంలో ఆడిట్‌ని నిర్ధారించడం కోసం, ఎంఓపిఆర్ ఆన్‌లైన్ అప్లికేషన్‌ ఆడిట్ ఆన్‌లైన్ (https://auditonline.gov.in) ను రూపొందించింది. ఈ అప్లికేషన్ పంచాయతీ ఖాతాల ఆడిటింగ్‌ను సులభతరం చేయడమే కాకుండా ఆడిట్ రికార్డులను నిర్వహించడానికి కూడా అందిస్తుంది. ఈ అప్లికేషన్ ఆడిట్ విచారణలు, డ్రాఫ్ట్ లోకల్ ఆడిట్ రిపోర్టులు, డ్రాఫ్ట్ ఆడిట్-పారాస్ మొదలైనవాటిని రూపొందించే ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. అందువలన, పంచాయితీల ద్వారా ఖాతాల సరైన నిర్వహణ, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తుంది. పంచాయితీ అనేది భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని పార్ట్ IX, లిస్ట్ II (రాష్ట్ర జాబితా)లో తప్పనిసరి చేయబడిన రాష్ట్ర సబ్జెక్ట్ మరియు పంచాయితీ ప్రతినిధులు మరియు అధికారుల అవినీతి మరియు చట్టవిరుద్ధమైన చర్యలకు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

****


(Release ID: 1811316) Visitor Counter : 168
Read this release in: English , Urdu