వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు పెంచాలని రత్నాలు, ఆభరణాల రంగాన్ని కోరిన శ్రీ గోయల్
దుబాయ్‌లో 'ఇండియన్ జువెలరీ ఎక్స్ పోజిషన్ సెంటర్'ను ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్
"అరబ్ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అంతర్జాతీయ దేశాలకు మన ఉత్పత్తులను అందించడానికి ఈ కేంద్రం ప్రపంచ వ్యాపార అనుకూల కేంద్రంగా పనిచేస్తుంది": శ్రీ గోయల్
మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాకుండా డిజైన్డ్ ఇన్ ఇండియా జ్యువెలరీ లో కూడా రత్నాలు, ఆభరణాల రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానం గా మార్చాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు: శ్రీ గోయల్
Posted On:
29 MAR 2022 6:56PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు; ఆహారం, ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తమ ఎగుమతుల లక్ష్యాన్ని దాదాపు 35 బిలియన్ డాలర్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుత ఎగుమతులను మూడు రెట్లు పెంచాలని పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రత్నాలు ఆభరణాల రంగంపై దృష్టి సారించారు; భారతదేశంలోనే కాకుండా రూపొందించిన ఆభరణాలలో కూడా రత్నాలు, ఆభరణాల రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో మొదట ఉండే దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని శ్రీ గోయల్ అన్నారు.
"మన భారతదేశం-అరబ్ దేశాల వ్యాపార ఒడంబడికలో చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ కేంద్రం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ దేశాలకు మన ఉత్పత్తులను అందించడానికి సంయుక్త అరబ్ ఎమిరేట్ విశ్వ వాణిజ్య మౌలిక కేంద్రంగా ఉపయోగపడుతుంది.” అని శ్రీ గోయల్ ప్రారంభోత్సవ వేడుకలో తన ప్రసంగంలో అన్నారు.
విష్ణు పురాణంలో 'శ్యమంతక' రత్నం గురించి ప్రస్తావన ఉంది. ఇది యజమానికి శ్రేయస్సు, సమృద్ధిని కలిగించే శక్తిని కలిగి ఉందని, శ్రీ గోయల్ ఆభరణాలు మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమని; సమాజంలో శైలి, హోదాకు చిహ్నంగా నిలుస్తాయని అన్నారు.
రత్నాలు ఆభరణాల రంగం దాదాపు 35 బిలియన్ డాలర్ల ఎగుమతులతో ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతుల లక్ష్యం లో దాదాపు 10 శాతానికి దోహదపడింది.
****
(Release ID: 1811214)
Visitor Counter : 195