నీతి ఆయోగ్
2030 దిశగా భారతీయ వ్యవసాయం - పుస్తకాన్ని ఆవిష్కరించిన. నీతి ఆయోగ్, ఎఫ్ఏవో
పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ : నీతి ఆయోగ్, ఎఫ్.ఎ.ఒ , ఎంఒఎ&ఎఫ్ డబ్ల్యు లకు అభినందన
రైతుల ఆదాయం, పోషకాహార భద్రత, సుస్థిర ఆహారం, వ్యవసాయ వ్యవస్థలను పెంపొందించే మార్గాల పై పుస్తకం లో చర్చ
प्रविष्टि तिथि:
28 MAR 2022 6:00PM by PIB Hyderabad
రైతుల ఆదాయాన్ని, పోషకాహార భద్రత, సుస్థిరమైన ఆహార, వ్యవసాయ వ్యవస్థలను పెంపొందించే మార్గాల తో ముద్రించిన ‘‘2030 దిశగా భారతీయ వ్యవసాయం‘‘ పుస్తకాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.
స్ప్రింగర్ ప్రచురించిన ఇండియన్ అగ్రికల్చర్ టూ వర్డ్స్2030 పుస్తకం నీతి ఆయోగ్ , వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మత్స్య, పశు సంవర్ధక , పాడి అభివృద్ధి శాఖల మధ్య 2019 నుంచి ఎఫ్ ఏ ఓ నిర్వహించిన జాతీయ చర్చా ప్రక్రియ ఫలితాలను వివరిస్తుంది.
నీతి ఆయోగ్, ఎఫ్ఏవో, ఎంవోఏ అండ్ ఎఫ్
డబ్లూ అధికారులను అభినందిస్తూ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, "నిపుణులు, కష్టపడి పనిచేసే రైతులు , వ్యవసాయ శాస్త్రవేత్తలతో సహా అన్ని భాగస్వాముల కృషితో, మనం గుర్తించిన సవాళ్లను ఎదుర్కోగలుగుతాము . భారతీయ
వ్యవసాయాన్ని, దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళతాము" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్, సీఈఓ అమితాబ్ కాంత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ పుస్తక సంపాదకుల్లో ఒకరైన నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగానూ, భారతదేశంలోనూ వ్యవసాయం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లను, ఉనికిలో ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకొని, రాబోయే దశాబ్దంలో పరివర్తనాత్మక దార్శనికత అవసరం. ఈ అవసరాన్ని గ్రహించి, ఈ పరివర్తన ద్వారా ఆలోచించడానికి ఒక జాతీయ సంభాషణ మొదలైంది. దాని కీలక అంశాలు ఏమిటి- విధానం ,ఆచరణకు దాని అర్థం ఏమిటి. వ్యవసాయ నిపుణులతో కూడిన స్టీరింగ్ కమిటీ మార్గదర్శకత్వంలో నీతి ఆయోగ్, ఎంఒఎ అండ్ ఎఫ్ డబ్ల్యు ,ఎఫ్ ఎఒ మధ్య సహకార ప్రక్రియ ద్వారా ప్రత్యేక దృష్టి సారించాల్సిన ప్రాంతాలను గుర్తించడం జరిగింది‘‘ అన్నారు.
2030 నాటికి భారతీయ వ్యవసాయం ఈ క్రింది అంశాలను కవర్ చేస్తుంది:
*భారతీయ వ్యవసాయాన్ని మార్చడం, *నిర్మాణాత్మక సంస్కరణలు , పాలన
*డైటరీ డైవర్సిటీ, న్యూట్రిషన్ -ఫుడ్ సేఫ్టీ
*వ్యవసాయంలో వాతావరణ సమస్యలను నిర్వహించడం,
*సైన్స్, టెక్నాలజీ ,ఇన్నోవేషన్
*భారతదేశంలో నీరు -వ్యవసాయం సహజీవనం
*చీడపీడలు, అంటువ్యాధులు, సంసిద్ధత, జీవభద్రత
*సుస్థిరమైన , జీవ వైవిధ్య భవిష్యత్తు కోసం *పరివర్తనాత్మక వ్యవసాయ ఆవరణ శాస్త్రం ఆధారిత ప్రత్యామ్నాయాలు
ఈ పుస్తకంలో గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ముందుమాట ఉంది. ఈ చొరవ కు మార్గదర్శకత్వం వహించిన భారతదేశంలో ఎఫ్ ఏ ఒ మాజీ ప్రతినిధి టోమియో షిచిరి పరిచయం కూడా ఉంది
2021 జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు జాతీయ స్థాయి చర్చలు జరిగాయి. ఇది దేశానికి హరిత విప్లవానంతర భవిష్యత్తును రూపొందించడంలో ప్రభుత్వ ప్రయత్నాలను పూర్తి చేయడానికి ప్రయత్నించింది, దీనిలో వ్యవసాయ-ఆహార వ్యవస్థలు పోషక లక్ష్యాలను మరింత పెంచగలవు, అలాగే జీవనోపాధిని పెంచుతాయి. మానవ ,పర్యావరణ ఆరోగ్యాన్ని రక్షించగలవు.
ఈ పుస్తకావిష్కరణ అనంతరం ఎంఓఏ అండ్ ఎఫ్ డబ్ల్యు మాజీ కార్యదర్శి ఆశిష్ బహుగుణ ఆధ్వర్యం లో ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ప్యానలిస్టులు డాక్టర్ అశోక్ దల్వాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ; ప్రొఫెసర్ భరత్ రామస్వామి, అశోక విశ్వవిద్యాలయం; భారతీయ కిసాన్ సంఘ్ ఛైర్ పర్సన్ అజయ్ వీర్ జాఖర్ ఈ పుస్తకం ఔచిత్యాన్ని ,జాతీయ సంభాషణా ప్రక్రియ గురించి చర్చించారు, ఇది వ్యవసాయాన్ని తిరిగి తప్పనిసరి చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది.ప్రస్తుత దశాబ్దానికి పరివర్తనాత్మక దార్శనికతను ఊహిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1810871)
आगंतुक पटल : 346