మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మైనారిటీ సంక్షేమ పథకాల కోసం 15 సూత్రాల కార్యక్రమం

Posted On: 28 MAR 2022 3:43PM by PIB Hyderabad

మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి రూపొందించిన 15 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.      మైనారిటీ కమ్యూనిటీ లోని వెనుకబడిన మరియు బలహీన వర్గాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు సమాన అవకాశాలు ఉండేలా చూసేందుకు మరియు మొత్తం సామాజిక అభివృద్ధి సాధనకు  దోహదపడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరు కార్యక్రమాల అమలులో వివిధ   మంత్రిత్వ శాఖలు/శాఖలు   వివిధ పథకాలు/కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.  (i) విద్య కోసం అవకాశాలను మెరుగుపరచడం; (ii) ప్రస్తుత మరియు నూతన  పథకాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు మరియు ఉపాధిలో మైనారిటీలకు సమానమైన అవకాశాలు కల్పించి స్వయం ఉపాధి కోసం మెరుగైన రుణ సహకారం అందించడం   మరియు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం; (iii) మైనారిటీలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల్లో తగిన వాటా కల్పించడం ద్వారా వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడంమరియు (iv) మత సామరస్యం మరియు హింస నివారణ మరియు నియంత్రణ అనే ఆరు విస్తృత లక్ష్యాలతో  కార్యక్రమం అమలు జరుగుతోంది.

15 సూత్రాల పథకం  కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల ద్వారా వివిధ పథకాలు/కార్యక్రమాలు అమలు చేయబడతాయి.  15 సూత్రాల పథకం   కింద అమలు జరిగే   ఈ పథకాల కింద  నోటిఫైడ్ మైనారిటీల కోసం వీలైనంత వరకు ఎక్కువగా  15% వ్యయాలు మరియు లక్ష్యాలు కేటాయించబడతాయి. అయితే, 15  15 సూత్రాల పథకం కింద  మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅమలు చేస్తున్న కార్యక్రమాలు  ప్రత్యేకంగా నోటిఫై చేయబడిన మైనారిటీల కోసం ఉద్దేశించబడ్డాయి. పథకాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

A.    విద్య సాధికారత

 

           I.   స్కాలర్‌షిప్ పథకాలు- ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ మరియు మెరిట్-కమ్-మీన్స్ ఆధారిత స్కాలర్‌షిప్.

          II.   మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పథకంనోటిఫైడ్ మైనారిటీ వర్గాలకు  చెందిన విద్యార్థులు M.Phil మరియు Ph.D వంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

          iii     మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్  IX నుండి XII తరగతులలో చదువుతున్న మైనారిటీలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్  పథకాన్నిఅమలు చేస్తుంది. 

          iv .     మొత్తం కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల  కంటే తక్కువ ఉన్న మైనారిటీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు మరియు అభ్యర్థుల నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా నయా సవేరా  ఉచిత కోచింగ్ మరియు అనుబంధ పథకం అమలు జరుగుతున్నది.  ప్రభుత్వ రంగం/ప్రభుత్వ రంగ సంస్థల్లో  ఉపాధిప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు మరియు అండర్-గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయిలలో సాంకేతిక మరియు వృత్తిపరమైన కోర్సులలో ప్రసిద్ధ సంస్థల్లో అడ్మిషన్ పొందడానికి ఈ కార్యక్రమాలు అవకాశం కలిగిస్తాయి. 

(బి) ఆర్థిక సాధికారత

           i.   నైపుణ్యాభివృద్ధి:

a.    సీఖో ఔర్ కమావో (నేర్చుకోండి & సంపాదించండి):  మైనారిటీల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ చొరవ మరియు మైనారిటీ యువతకు వారి అర్హతలుప్రస్తుత ఆర్థిక ధోరణులు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి వివిధ ఆధునిక/సాంప్రదాయ నైపుణ్యాలలో నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది. స్వయం ఉపాధి పొందేందుకు  తగిన నైపుణ్యాన్ని కల్పించడం జరుగుతుంది. 

b.  "సాంప్రదాయ కళలు/అభివృద్ధి కోసం నైపుణ్యం మరియు శిక్షణ అప్‌గ్రేడ్ (USTTAD)" పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీ కళాకారులు మరియు పాకశాస్త్ర నిపుణులకు వారి ప్రదర్శన మరియు మార్కెట్ కోసం సమర్థవంతమైన వేదికను అందించడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఒక మిషన్ ప్రారంభించింది.  మంత్రిత్వ శాఖ నిర్వహించిన "హునార్ హాట్స్" ద్వారా అత్యుత్తమ హస్తకళ మరియు అద్భుతంగా రూపొందించిన ఉత్పత్తులు. డిజైన్ ఉత్పత్తి శ్రేణి అభివృద్ధిప్యాకేజింగ్ప్రదర్శనల కోసం వివిధ క్రాఫ్ట్ క్లస్టర్‌లలో పనిచేయడానికిమరియు బ్రాండ్ బిల్డింగ్ అంశాలలో  మంత్రిత్వ శాఖ జాతీయ ప్రసిద్ధి చెందిన సంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (IIP)ల  సహకారంతో  కార్యక్రమాలు చేసింది.  ఇప్పటివరకుదేశంలోని వివిధ నగరాల్లో 38 హునార్ హాత్‌లు నిర్వహించబడ్డాయి. దీని ఫలితంగా ఎనిమిది లక్షలకు మించి కళాకారులు శిక్షణ పొందినవారు ఉపాధి పొందారు. వారిలో మహిళల సంఖ్య 50% వరకు ఉంది. 

a.    నై మంజిల్ - మైనారిటీ వర్గాల యువతకు విద్య మరియు నైపుణ్య శిక్షణ అందించే పథకం.

b.    మైనారిటీ కమ్యూనిటీకి చెందిన యువతకు స్వల్పకాలిక ఉద్యోగ ఆధారిత నైపుణ్య అభివృద్ధి కోర్సులను అందించడానికి గరీబ్ నవాజ్ ఉపాధి శిక్షణా కార్యక్రమం.

c.    ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY):   స్కిల్ ఇండియా మిషన్ కింద నైపుణ్యాభివృద్ధి  మంత్రిత్వ శాఖ మైనారిటీ వర్గాలకు చెందిన వారితో  సహా కోటి మందికి నైపుణ్యాన్ని అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 2016-20 పేరుతో ఒక ప్రధాన పథకాన్ని అమలు చేస్తోంది. నాలుగు సంవత్సరాలు అంటే 2016-2020కి దేశవ్యాప్తంగా స్వల్పకాలిక శిక్షణ (STT) మరియు ప్రియర్ లెర్నింగ్ (RPL)  కింద మైనార్టీ వర్గాల కోసం ఈ కార్యక్రమాలు రూపొందాయి 19.01.2021 నాటికి, PMKVY 2.0 పథకం కింద మైనారిటీ వర్గాల నుంచి 11 లక్షల మంది అభ్యర్థులు శిక్షణ పొందారు.  ప్లేస్‌మెంట్ లింక్డ్ STT లో భాగంగా  4.15 లక్షల మంది  అభ్యర్థులు సర్టిఫికెట్లు పొందారు 2.04 లక్షల మంది అభ్యర్థులు వివిధ సంస్థల్లో ఉపాధి  పొందారు.

          ii.    నోటిఫై చేయబడిన మైనారిటీల లోని 'వెనుకబడిన వర్గాలసామాజిక-ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి మరియు ఆదాయాన్ని పెంచే కార్యకలాపాల కోసం రాయితీ రుణాలను నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC) రుణ పథకాలు అందిస్తాయి.

         iii.   బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగ రుణాలు.(ఆర్థిక సేవల విభాగం)

         iv.   నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ( గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల  మంత్రిత్వ శాఖ )

          v.   జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ( గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ)

         vi.   దీన్ దయాళ్ ఉపాధ్యాయ – గ్రామీణ కౌశల్ యోజన ( గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ)

       vii.   ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీన్)- ( గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ)

 ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (PMJVK) అనే మరో పథకం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతోంది.  ఇది మైనారిటీల సామాజిక-ఆర్థిక పరిస్థితులు మరియు ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచి వారి జీవన నాణ్యతను మెరుగు పరచడం మరియు అసమానతలు  తగ్గించడం లక్ష్యంగా ఇది అమలు జరుగుతోంది.  మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న  ప్రాంతాలను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది.  విద్యఆరోగ్యం మరియు నైపుణ్యంరెసిడెన్షియల్ పాఠశాలలుపాఠశాల భవనాలుహాస్టల్‌లుడిగ్రీ కళాశాలలుఐటీఐ లుపాలిటెక్నిక్‌లుసద్భావ మండపాలుఆరోగ్య కేంద్రాలునైపుణ్య కేంద్రాలుక్రీడా సౌకర్యాలుతాగునీటి సౌకర్యాలుపారిశుధ్యం వంటి రంగాలలో ఉన్నాయి. సౌకర్యాలు మొదలైన ప్రధాన ప్రాజెక్టులు PMJVK కింద అమలు జరుగుతున్నాయి. 

 మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను స్వతంత్ర మరియు మూడవ పార్టీ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడం జరుగుతోంది.  మైనారిటీల సంక్షేమం కోసం పథకాల ప్రభావం మరియు ప్రయోజనాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతో కాలానుగుణంగా పథకాల మూల్యాంకనం కోసం అంతర్నిర్మిత నిబంధన ఉంది. అంతేకాకుండానీతి ఆయోగ్ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ మొదలైన వాటితో సంప్రదించి నిర్దిష్ట సమయానికి మించి పథకం(ల) ను పొడిగించే సమయంలో పథకాలు విమర్శనాత్మకంగా విశ్లేషించబడతాయి మరియు మూల్యాంకనం చేయబడతాయి/పరిశీలించబడతాయి.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలు మరియు ప్రధాన మంత్రి కొత్త 15 సూత్రాల  కార్యక్రమం కింద అమలు జరుగుతున్న  పథకాల కింద నిధుల వినియోగం వంటి వివరాలు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో   www.minorityaffairs.gov.  అందుబాటులో ఉన్నాయి 

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 


(Release ID: 1810869) Visitor Counter : 655


Read this release in: English , Urdu