వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

తెలంగాణ నుంచి నాణ్యతా ప్రమాణాల ప్రకారం అదనపు నిల్వలను కొనుగోలు చేసేందుకు


కేంద్రం కట్టుబడి ఉంది: రైతులకు భరోసా ఇచ్చిన శ్రీ గోయల్

సెంట్రల్ పూల్‌కు ఎంత ముడి బియ్యం ఇవ్వబోతున్నారో తెలంగాణ ఇంకా తెలియజేయలేదని శ్రీ గోయల్ చెప్పారు

Posted On: 24 MAR 2022 6:44PM by PIB Hyderabad

తెలంగాణ నుంచి నాణ్యతా ప్రమాణాల ప్రకారం అదనపు నిల్వలను కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ, వాణిజ్యం మరియు పరిశ్రమలు, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ, బియ్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.

 

 

 

2014-15లో తెలంగాణ రైతులకు వరికి రూ.3391 కోట్లను కనీస మద్దతు ధర - ఎంఎస్‌పిగా చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. అయితే, 2020-21 ఖరీఫ్ పంట కాలంలో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు 26,610 కోట్ల రూపాయలను వరి ఎంఎస్‌పిగా చెల్లించింది.

 

“తెలంగాణలో ఏవైనా అదనపు నిల్వలు ఉంటే, వాటి స్వంత వినియోగం తర్వాత, ముడి బియ్యం రూపంలో మరియు కేంద్రంతో ఎంఓయూ ప్రకారం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) పేర్కొన్న నాణ్యత ప్రకారం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కట్టుబడి ఉంది, ”అని ఆయన అన్నారు.

 

ప్రస్తుత రబీ పంటలో సెంట్రల్ పూల్‌కు అందించే ముడి బియ్యం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా తన వాటాగా చెల్లించలేదని ఆయన నొక్కి చెప్పారు.

“ఈ అంశంపై తెలంగాణ ముందుకు రావాలని మరియు సెంట్రల్ పూల్‌కు ఎంత ముడి బియ్యం ఇస్తారో తెలియజేయాలని కేంద్రం కోరుతున్నదని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను. దీనికి సంబంధించి వారు ఎలాంటి వివరాలను అందించలేదు" అని శ్రీ గోయల్ తెలిపారు. 

 

శ్రీ గోయల్ బియ్యం సేకరణ ప్రక్రియ గురించి కూడా వివరించారు. వివిధ రాష్ట్రాల వినియోగ విధానం, డిమాండ్‌ ఆధారంగానే కేంద్రం బియ్యాన్ని సేకరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రాలు బియ్యాన్ని సేకరించిన తర్వాత, రాష్ట్రంలో గృహ అవసరాల వినియోగం కోసం స్టాక్ ఉంచుతాయి మరియు మిగిలిన మొత్తాన్ని కేంద్రం తీసుకుంటుందని అన్నారు. 

 

తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఎంఓయూ కాపీని చూపుతూ, అందులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బియ్యం నిల్వలు, టీపీడీఎస్, ఇతర సంక్షేమ పథకాలకు మించి నిల్వలు ఉంటే, ఆ అదనపు నిల్వలనురాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రం ద్వారా సెంట్రల్ పూల్ కోసం ఎఫ్‌సిఐకి అందజేసే అదనపు బియ్యాన్ని ముడి బియ్యం లేదా ఉప్పుడు బియ్యం రూపంలో ఉంటాయో లేదో పేర్కొనడానికి ఎఫ్‌సిఐకి అవకాశం ఉంటుంది. టిపిడిఎస్ కింద దేశం మొత్తం వినియోగ అవసరాలను తీర్చడానికి, ఓడబ్ల్యూఎస్ మరియు బియ్యం రకం వినియోగ విధానం ఆధారంగా స్పష్టంగా నిర్ణయించబడుతుంది. ఈ సమాచారం అన్ని రాష్ట్రాలకు అందించబడింది మరియు తదనుగుణంగా దేశం మొత్తం డిమాండ్ మేరకు కేంద్రానికి ముడి బియ్యం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

 

బియ్యం సేకరణపై చర్చించేందుకు 2022 ఫిబ్రవరి 25న ఆహార & ప్రజాపంపిణీ శాఖ ( డిఎఫ్‌పిడి) కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలను నిర్దిష్ట ఫార్మాట్‌ను పూరించాలని కోరింది. కానీ, తెలంగాణ ఎప్పుడూ ఫారం సమర్పించలేదు. 2022 మార్చి 8వ తేదీన జాయింట్ సెక్రటరీ (జెఎస్) డిఎఫ్‌పిడి అధ్యక్షతన జరిగిన మరో సమావేశం గురించి మంత్రి చెబుతూ, అందులో వివరాలను పంచుకోవడానికి తెలంగాణను మళ్ళీ గుర్తు చేయడం జరిగిందని అన్నారు. 

 

 

***



(Release ID: 1809379) Visitor Counter : 208


Read this release in: English , Urdu , Hindi