నీతి ఆయోగ్

తెలంగాణకు చెందిన నలుగురు స్ఫూర్తిదాయక మహిళలకు నీతి ఆయోగ్ ఐదవ ఎడిషన్ ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డులు


భారత స్వాతంత్ర్య 75వ సంవత్సరంలో
75 మంది మహిళలకు సత్కారం

Posted On: 23 MAR 2022 5:08PM by PIB Hyderabad

భారతదేశాన్ని 'సశక్త్ ఔర్ సమర్థ్ భారత్'గా మార్చడంలో మహిళలు నిరంతరం కీలక పాత్ర పోషిస్తున్నారు. విభిన్న రంగాల్లో ఈ మ హిళ లు సాధించిన విశేష విజయాలకు గుర్తింపుగా నీతి ఆయోగ్ ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డుల ను ఏర్పాటు చేసింది.

 

ఈ ఏడాది, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 మంది మహిళా సాధకులకు డబ్ల్యుటిఐ అవార్డులను ప్రదానం చేశారు. ఈ 75 మంది అవార్డు గ్రహీతల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలను సత్కరించారు.

 

విజయ స్వితా, హైదరాబాద్, చిత్రిక

 

విజయ స్వితా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లోని చేతివృత్తుల కమ్యూనిటీలతో కలిసి పనిచేయడానికి చిత్రికను ప్రారంభించింది, మహిళల అధీనం లోని , వారు నిర్వహించే సంఘాలను ఇంక్యుబేట్ చేస్తుంది. చేతివృత్తుల వారిచే స్వంతం చేసుకోబడే, నిర్వహించబడే సుస్థిరమైన , విజయవంతమైన వ్యాపార సంస్థల సహ-సృష్టి కోసం కచేతివృత్తులవారితో కలిసి పనిచేయడం వారి ప్రధాన లక్ష్యం. చేతివృత్తుల వారు తమ ఆదాయ స్థాయిలను పెంచుకోవడానికి, మార్కెట్ కార్యకలాపాలను నిర్వహించడానికి , తమ వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి , మెరుగుపరచడానికి సమూహాలను ఏర్పరచుకోవడానికి ఇవి దోహదపడతాయి.

 

హస్తకళాకారుల ఆదాయాలను పెంపొందించడం కోసం టెక్నాలజీ, మేనేజ్ మెంట్, స్కిల్లింగ్ , డిజైన్ వైవిధ్యాన్ని ఉపయోగించడంలో చిత్రిక అగ్రగామిగా నిలుస్తుంది.

 

అను ఆచార్య, హైదరాబాద్, మ్యాప్ మైజెనోమ్ ఇండియా లిమిటెడ్.

 

మ్యాప్మైజెనోమ్™ అనేది ఒక మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ, ఇది ప్రజలు తమ ఆరోగ్యం గురించి మెలకువతో ఉండటానికి ప్రోత్సహిస్తుంది. లక్షణాలు, ఔషధ ప్రతిస్పందనలు, వారసత్వ పరిస్థితులు ఇంకా వ్యాధులతో సహా జన్యు నివేదిక , ఆరోగ్య చరిత్రను కలపడం ద్వారా అవి ఆరోగ్యం గురించి అంతర్దృష్టులను అందిస్తాయి.

మ్యాప్మైజెనోమ్ ఇండియా వ్యవస్థాపకురాలు సి ఇ ఓ అను ఆచార్య జన్యుశాస్త్రాన్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మందికి వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సంరక్షణను అందించడం , 2030 నాటికి కనీసం పది లక్షల మంది జీవితాలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.వారి పేటెంట్ సేవ, జీనోమ్ ప్యాట్రి™ అనేది జీవనశైలి వ్యాధులకు జన్యుపరమైన ప్రమాదం, లక్షణాలు, క్యారియర్ స్థితి , ఔషధ ప్రతిస్పందనల సమగ్ర మదింపు. ఇది ప్రత్యేకమైన ఆరోగ్య ప్రొఫైల్, దీని మీద వారు దృష్టి పెడతారు.

 

జన్యు నివేదిక , ఆరోగ్య చరిత్రను జెనెటిక్ కౌన్సిలింగ్ తో కలపడం ద్వారా, మ్యాప్ మైజెనోమ్™ ఆరోగ్యవంతమైన జీవనం దిశగా వ్యక్తుల కొరకు చర్యార్హమైన దశలను అందిస్తుంది

 

రూప మాగంటి, హైదరాబాద్, గ్రీన్ తత్వ

అగ్రి టెక్ ఎల్ ఎల్ పి

 

గ్రీన్ తత్వ అనేది ఒక సామాజిక సంస్థ, ఇది సహజ వ్యవసాయం సుస్థిరతకు దోహదం చేస్తుందని నమ్ముతుంది. రూపా మాగంటి గ్రామీణ మహిళా వ్యవసాయదారులకు అట్టడుగు స్థాయిలో జీవనోపాధిని సృష్టించడం ద్వారా , వారి బ్రాండ్ 'సుధాన్యా' ద్వారా తన వినియోగదారులను ఆరోగ్యంగా ఉంచడానికి హాని కారకాలు లేని ఆహారాన్ని అందించడం ద్వారా మద్దతు ఇస్తారు. అవి మూడు మూలస్తంభాలను - రైతులు, అగ్రిప్రెన్యూయర్లు , వినియోగదారులను కలుపుతాయి. క్లస్టర్ ఆధారిత విధానం ద్వారా ఆహార సరఫరా గొలుసులో కార్బన్ ను తగ్గిస్తాయి.

 

ఉపగ్రహ చిత్రాల ద్వారా వారి పొలాలకు జియోట్యాగ్ ఇవ్వడం, నేల ఆరోగ్యం, వాతావరణం , నీటి వనరులను అర్థం చేసుకోవడానికి , శాస్త్రీయ , క్రమబద్ధమైన వ్యవసాయంలో రైతులకు సహాయం చేయడానికి వీలు కల్పిస్తుంది. నాణ్యతా నియంత్రణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ , మార్కెట్ చేరువతో ధాన్యాలను ప్రాసెస్ చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో గ్రామీణ వ్యవసాయదారులకు గ్రీన్ తత్వ మద్దతు ఇస్తుంది.

 

గ్రహం, ప్రజలు, సంవృద్ధి, శాంతి , భాగస్వామ్యాలు అనే ఐదు ‘పి‘ ల కలయిక తో సమగ్ర , సుస్థిర అభివృద్ధిని పెంపొందించాలని గ్రీన్ తత్వ భావిస్తోంది

 

తనూజా అబ్బూరి, హైదరాబాద్, ట్రాన్స్ ఫర్మేషన్ స్కిల్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (బియాండ్ పింక్స్)

 

ఒక నిజమైన మార్గాన్వేషి తనూజా అనేక గుర్తించదగిన మైలురాళ్లకు ప్రసిద్ధి చెందారు. ప్రతిభను పెంపొందించడానికి కృషి చేశారు.

పారిశ్రామికవేత్తగా , ట్రాన్స్ ఫర్మేషన్ స్కిల్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (బియాండ్ పింక్స్) వ్యవస్థాపకురాలిగా ఆమె ప్రస్తుతం , మహిళలు తమ కెరీర్ లను కొనసాగించడానికి, వారు ఉద్యోగాలకు తిరిగి రావడానికి , వారు తమ కెరీర్ లలో.అభివృద్ధి చెందడానికి మద్దతు వ్యవస్థను అందించడానికి టాలెంట్ డెవలప్ మెంట్ లో తన అభిరుచి నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, నీతి ఆయోగ్ మద్దతు కలిగిన ఆమె సంస్థ- డి అండ్ ఐ సవాలును పరిష్కరించడానికి డిజైన్ థింకింగ్‌ని ఉపయోగించే సాంకేతికతతో కూడిన మార్గదర్శక పరిష్కారం గా పనిచేస్తోంది. వారు ఇప్పటివరకు 4000 మంది మహిళలకు మార్గదర్శకత్వం వహించారు. హెచ్ వై ఎస్ ఇ ఏ, ఎన్ హెచ్ ఆర్ డి వంటి పారిశ్రామిక సంస్థలతో క్లిష్టమైన భాగస్వామ్యాలను పెంచుకుంది.

 

బియాండ్ పింక్, ఒక ఆల్-ఉమెన్ ఆర్గనైజేషన్. 50+ కంటే ఎక్కువ ప్రాంతాలతో ఉన్న మహిళలకు మార్గదర్శక మద్దతు ఇస్తోంది. 60+ బ్లూ-చిప్ సంస్థల నుండి 150+ మెంటార్ లకు సారధ్యం వహిస్తోంది. 2022 నాటికి 10,000 మంది, 2025 నాటికి లక్ష మంది జీవితాలను ప్రభావితం చేయాలనేది వారి దార్శనికత.



(Release ID: 1808852) Visitor Counter : 196


Read this release in: English , Hindi