పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
జాతీయ జంతు ప్రదర్శన శాలలో అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా 75 మొక్కలు నాటిన మంత్రి, అధికారులు, మీడియా
75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యానికి గుర్తుగా నేషనల్ జూలాజికల్ పార్క్‌లో 75 చెట్ల పెంపకాన్ని చేపట్టిన శ్రీ భూపేందర్ యాదవ్
పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అటవీ సంరక్షణను 'జనభాగిదారి'గా మార్చడానికి అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంది
గంధపు చెక్క, రోజ్ కలప, అగర్ చెక్క మరియు రెడ్ సెండర్స్.. వంటి జాతుల తోటలను ప్రోత్సహించడానికి సిల్వికల్చరల్ పద్ధతులను హైలైట్ చేసే విధంగా బ్రోచర్‌లను విడుదల చేసింది.
Posted On:
21 MAR 2022 8:09PM by PIB Hyderabad
అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి MoEF&CC, శ్రీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలో ఈరోజు నేషనల్ జూలాజికల్ పార్క్‌లో ఒక చారిత్రాత్మక ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఇక్కడ మంత్రుల నుండి అధికారులు, మీడియా వరకు ప్రజలందరూ కలిసి 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని 75 మొక్కలు నాటారు.
75 సంవత్సరాల భారత స్వాతంత్య్రానికి గుర్తుగా ప్రతి గ్రామంలో 75 చెట్లను నాటాలని గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పిలుపుపై ఇది ఒక మార్గదర్శక నాంది వంటిది.
ఈ "జనభాగిదారి" కార్యక్రమం అవగాహన కల్పించడమే కాకుండా అటవీశాఖ జోక్యాల ద్వారా పదమూడు ప్రధాన నదుల పునరుజ్జీవనంపై ఇటీవల విడుదల చేసిన సవివరమైన ప్రాజెక్ట్ నివేదికల (DPRలు)ని అనుసరిస్తుంది. రాబోయే 10 సంవత్సరాల మరియు 20 సంవత్సరాలకు గ్రీన్ కవర్ విస్తరణ లక్ష్యంతో రాబోయే 25 సంవత్సరాలను 'అమృత్ కాల్'గా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క సమగ్ర దృక్పథానికి అనుగుణంగా ఈ ప్రయత్నాలు ఉన్నాయి. అప్పుడు భవిష్యత్తు తరాలకు ప్రస్తుత తరం 'వాన్ భగీదారి మరియు జన్ భగీదారి' ద్వారా 'గ్రీన్ ఇండియా' అందించే అవకాశాలు ఉన్నాయి.
అడవులను ప్రేమించడం నేర్చుకుని, రక్షణ మరియు పరిరక్షణకు తమదైన రీతిలో సహకరించేలా, ముఖ్యంగా యువతరంలో అవగాహన తీసుకురావడం ఈ వేడుకల లక్ష్యం అని శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు.
మాటల కంటే చేతలు ఎక్కువగా మాట్లాడుతాయని, అందరిలోనూ ప్రేరణ కలిగిస్తుందని, ప్రసంగాలు మరియు కథనాల కంటే మొక్కలు నాటడం వల్ల ఎక్కువ అవగాహన ఏర్పడుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ మొక్కలు నాటేందుకు పెన్ను పట్టుకునే చేతులు కూడా ఈ రోజు బురదలో కూరుకుపోయాయని ప్రశంసించారు.
అటవీ సంరక్షణను 'జనభాగిదారి'గా మార్చేందుకు మరో ముందడుగుగా, న్యూ ఢిల్లీలోని పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ సమక్షంలో ఈ రోజు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో జరుపుకుంది. రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రి శ్రీ. అశ్విని కుమార్ చౌబే, అన్ని రకాల అడవుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఇందులో ప్రసంగించారు.
ఈ సంవత్సరం థీమ్ "అటవీ మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగం".
శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రతి వ్యక్తి అటవీ సంరక్షణ మరియు దాని ఉత్పత్తుల యొక్క స్థిరమైన వినియోగాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ వార్షిక కార్యక్రమం విజయవంతం అవుతుందని ఉద్ఘాటించారు.
గంధపు చెక్క, రోజ్ కలప, అగర్ వుడ్ మరియు రెడ్ సెండర్స్ వంటి జాతుల మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, ఈ కార్యక్రమంలో సిల్వికల్చరల్ పద్ధతులను హైలైట్ చేసే బ్రోచర్‌లను విడుదల చేశారు. ఈ జాతులను పెంచడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ డివిజన్ యొక్క తదుపరి వార్తాలేఖ “ట్రంపెట్”, గజహ్ సుచన” మరియు “APP” చొరవ కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. CZA రూపొందించిన “ఎక్స్-సిటు మేనేజ్‌మెంట్ ఆఫ్ యాంఫిబియన్స్ ఇన్ జూ”పై మాన్యువల్ కూడా విడుదల చేశారు.
****
(Release ID: 1807996)
Visitor Counter : 240