రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ముసాయిదా జాతీయ వైద్య పరికరాల విధానం 2022పై మార్గ సూచీ పత్రాన్ని సంప్రదింపుల కోసం విడుదల చేసిన కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన ఫార్మాసూటికల్స్ విభాగం.
దీనిపై స్టేక్ హోల్డర్లు, పరిశ్రమ వర్గాల ఫీడ్ బ్యాక్ రిమార్కులను 2022 మార్చి 25 వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ఆదేశం
వైద్య పరికరాల రంగంలోఆవిష్కరణలు, ప్రగతి, వైద్య పరికరాల అందుబాటు, చవకగా లభ్యం కావడం, భద్రత, నాణ్యత , తమ కాళ్లమీద తాము నిలబడేట్టుచేయడం వంటివి ముసాయిదా పత్రం లక్ష్యంగా ఉన్నాయి.
వైద్యపరికరాల రంగం భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యావస్యకమైన , అంతర్బాగంగా ఉంది.
Posted On:
12 MAR 2022 6:45PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన డిపార్టెమంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ (డిఒపి) తమవిభాగానికి చెందిన వెబ్ సైట్ లో వైద్య పరికరాలకు సంబంధించి ముసాయిదా జాతీయ విధానం 2022 మార్గసూచీని విడుదల చేసింది. దీనిపై ఫీడ్ బ్యాక్‌ను కోరడంతోపాటు పరిశ్రమ, స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలను 2022 మార్చి 25 వ తేదీలోగా పంపాల్సిందిగా సూచించింది.
వైద్యపరికరాల రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో , డిపార్టమెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ఈరంగానికి సంబంధించి ఒక సమగ్ర విధానం అవసరం ఉందని గుర్తించి , ఈ రంగం ప్రగతికి దోహదపడే విధంగా ఈ రంగం సామర్ధ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఒక మార్గసూచీ పత్రాన్ని ప్రచురించింది. విస్తృత సంప్రదింపుల అనంతరం దీనిని ప్రచురించారు. వైద్య పరికరాల రంగం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్న సన్ రైజ్ రంగం.దీనిని మెడ్‌టెక్ రంగం అని అంటారు. ఈ రంగం మార్కెట్ సైజు ప్రస్తుతం 11 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2025 నాటికి దానిని 50 బలియన్ డాలర్లకు తీసుకుపోనున్నారు.
వైద్య పరికరాల రంగం భారత ఆరోగ్యరంగంలో ఒకభాగస్వామి.ప్రత్యేకించి అన్ని వైద్య అవసరాల విషయంలో అంటే రోగాలు రాకుండా ముందస్తు చర్యలు, రోగ నిర్ధారణ, చికిత్స, యాజమాన్యం వంటి వాటి విషయంలో కీలక పాత్రపోషిస్తున్నది. 2017 వరకు కూడా వైద్య పరికరాల రంగం చాలా వరకు ఒక క్రమపద్దతిలో లేకుండా ఉంటూ వచ్చింది.సిడిఎస్ సిఒ 2017 లో వైద్య పరికరాల నిబంధనలను తీసుకువచ్చింది. ఇవి వైద్య పరికరాల రంగాన్ని దశలవారీగా నియంత్రించేందుకు ఉద్దేశించిన సమగ్ర నిబంధనలు.ముఖ్యంగా డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం 1940 ప్రకారం నాణ్యత, భద్రత, సమర్థత అంశాలకు సంబంధించినది.
వైద్య పరికరాల రంగం అనేది మల్టీ ప్రాడక్ట్ సెక్టర్. ఇందులో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంప్లాంట్‌లు, వాడకంలో ఉండేవి, ఒక సారి పడేసేవి, ఐవిడి రీజెంట్ లు, సర్టికల్ పరికరాలు. భారత వైద్య పరికరాల మార్కెట్‌లో చెప్పుకోదగిన స్థాయిలో బహుళజాతి సంస్థలు ఉన్నాయి. 80 శాతం అమ్మకాలు, దిగుమతి చేసుకున్న పరికరాల నుంచి విలువను సృష్టిస్తున్నాయి. భారతీయ వైద్యపరికరాల రంగం పాత్ర కూడా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ పోరాటానికి ఇండియా మద్దతునివ్వడంలో వైద్యపరికరాల పాత్రకూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. వైద్య పరికరాల తయారీ, వ్యాధిని గుర్తించేందుకు అవసరమైన కిట్ల తయారీ, వెంటిలేటర్లు, ఆర్.టి-పిసిఆర్ కిట్‌లు, ఐఆర్ థర్మామీటర్లు, పిపిఇ కిట్లు, ఎన్-95 మాస్కుల ఉత్పత్తి ద్వారా ఈ రంగం కీలకపాత్ర పోషించింది.ఈరంగానికి ప్రత్యేక సమన్వయం, పరిశ్రమ వర్గాలతో ఎప్పటికప్పుడు పరిచయం, స్టేక్‌హోల్డర్ల తో సంప్రదింపుల ఇవన్నీ ఈ రంగం ప్రగతికితోడ్పడతాయి.
ఈ రంగం వైవిధ్యంతో కూడిన ది,నిరంతర ఆవిష్కరణలుప్రత్యేకతలు కలిగినది కావడంతో పరిశ్రమకు చెందినస్టేక్ హోల్డర్ల మధ్య ప్రత్యేక కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అవసరం. దేశీయ వైద్యపరికరాల తయారీదారులను వివిధ ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా , ప్రోత్సహించడం జరుగుతోంది. పి ఎల్ ఐ పథకం వంటి వాటి ద్వారా దేశీయంగా వైద్యపరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. అలగే వైద్య పరికరాల పార్కులను కూడా ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెగ్యులేటర్లమధ్య మరింత సమన్వయానికి కృషి చేయడం జరుగుతోంది. డిఒహెచ్ ఎఫ్‌డబ్ల్యు, వినియోగదారుల వ్యవహారాల విభాగం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్, ఎం.ఇ.ఎఫ్ సిసి తదితరాల మధ్య సమన్వయానికి కృషి జరుగుతోంది. వ్యవస్తాగత ఏర్పాట్లు, వివిధ ఫోరం లు, రెగ్యులేటరీ రౌండ్ టేబుల్స్ ద్వారా వివిధ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు జరిగింది.
ప్రతిపాదిత విధానం వైద్యపరికరాల రంగం సుస్థిర ప్రగతి, అభివృద్దికి దోహదపడడంతోపాటు, ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి దోహదం చేస్తుంది. రెగ్యులేటరీ విధానాలు, మానవ వనరుల నైపుణ్యాలు ,అత్యున్నత పరికరాలకు సంబంధించి సాంకేతికత లేకపోవడం, తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం,వంటి వాటివిషయంలో ఒకసమగ్ర పాలసీ ఫ్రేమ్ వర్క్ ద్వారా ఇందుకు సంబంధించిన సమస్యలను , సవాళ్లను పరిష్కరించడం, సమగ్ర చర్యలకు ఈ ప్రతిపాదిత విధానాన్ని నిర్దేశించారు.
ముసాయిదా జాతీయ విధానం రాబోయే సంవత్సరాల్లో వైద్యపరికరాల రంగం క్రమమైన వృద్ధిని సులభతరం చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకుంది.. అందుబాటు ధరలోపరికరాలు అందించడం, స్థోమత, భద్రత, నాణ్యత ప్రధాన లక్ష్యాలుగా సూచిస్తూ, ఆయా సంస్థలు స్వంతంగా నిలబడగలగడం, వినూత్న ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించడం వంటి ముఖ్య లక్షణాలతో ఈ ప్రతిపాదిత విధానాలు రూపుదిద్దుకున్నాయి.ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.
-రెగ్యులేటరీ ప్రక్రియలను సమర్థంగా ఉండేలా చూసేందుకు, సులభతర వాణిజ్యానికి వీలు కల్పించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాణాలను స్థిరీకరించేందుకు ప్రతిపాదించారు.
-వైద్య పరికరాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు, భద్రత కలిగిన పరికరాలను వినియోగదారులకు అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం
-స్థానిక తయారీ రంగాన్ని ప్రైవేటు రంగ పెట్టుబడులతో మరింత బలోపేతం చేసేందుకు ద్రవ్యపరమై, ఆర్దికక మద్దతుతో పోటీ తత్వాన్నికల్పించడం.
-మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ రంగంలో గట్టి పునాది వేస్తుంది. అందుకు వైద్య పరికరాల పార్కులతోపాటు టెస్టింగ్ సెంటర్లు తదితరాలలో సాధారణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పిస్తారు. ధర విషయంలో పోటీతత్వాన్ని మెరగు పరిచి దేశీయ తయారీదారులు ఆకర్షితులయ్యేలా చూడడం ..
-పరిశోధన, అభివృద్ధికి తగిన సదుపాయాలు కల్పించడం. ఆర్ అండ్ డి ప్రాజెక్టుల విషయంలో సహకారం, ఆవిష్కరణల పై మరింత దృష్టిపెట్టడం, పరిశ్రమ అవసరాలు, బోధన రంగం మధ్య గల గ్యాప్‌ను తగ్గించేందుకు కీలక భాగస్వాముల మధ్య పరిశోధన ప్రాజజెక్టులు, అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త వెంచర్ల కు వీలు కల్పించడం.
--వివిధ స్టేక్ హోల్డర్లకు నైపుణ్య శిక్షణ కు వీలుగా ఉన్నత విద్యా సంస్థల స్థాయిలో మానవ వనరుల అభివృద్దికి దోహదపడడం. భవిష్యత్ సన్నద్ధతతో మానవ వనరుల అభివృద్ధికి చర్యలు.వైద్య పరికరాల తయారీలో ఇండియాను హబ్‌గా తీర్చిదిద్దడం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ చొరవను ముందుకు తీసుకుపోవడం.
-ఈ ముసాయిదా పత్రం మనదేశం 2047 నాటికి వైద్య పరికరాల విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో పలు సంస్థలను ఎన్ ఐ పి.ఇ.ఆర్.ఎస్ లలాగా కలిగి ఉండేలాచూస్తుంది.
- మెడ్ టెక్ రంగంలో 25 అత్యున్నత భవిష్యత్ సాంకేతికతలకు మనదేశం మూల కేంద్రంగాఉండనుంది.
-మెడ్ టెక్ పరిశ్రమ 100 నుంచి 300 బిలియన్ డాలర్ల సైజు కలిగి ఉండి అంతర్జాతీయ మార్కెట్ లో 10 నుంచి 12 శాతం మార్కెట్ షేర్‌ను పొందనుంది.
ముసాయిదా విధానాన్ని https://pharmaceuticals.gov.in/policy లో చూడవచ్చు.
***
(Release ID: 1806233)
Visitor Counter : 189