గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వ్యర్ధాల నిర్వహణ రంగంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు, వ్యవస్థాపకులకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛతా స్టార్టప్ ఛాలెంజ్ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2022 3:45PM by PIB Hyderabad
వ్యర్ధాల నిర్వహణ రంగంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు, వ్యవస్థాపకులకు అనుకూలమైన సాధికార వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు పరిశ్రమల & అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) సహకారంతో ప్రభుత్వం జనవరి 27, 2022న స్వచ్ఛత స్టార్టప్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. నాలుగు నేపథ్య రంగాలలో - 1) సామాజిక చేరిక (సోషల్ ఇన్‌క్లూషన్) 2) చెత్తను పోగు చేయకుండా ఉండడం (జీరో డంప్) 3) ప్లాస్టిక్ వృధాల నిర్వహణ 4) పారదర్శకతలలో పని చేస్తున్న స్టార్టప్‌ల నుంచి అందుకున్న దరఖాస్తులను వారు అందించిన పరిష్కారాల గుణాత్మకత ఆధారంగా మూల్యాంకనం చేస్తారు.
ఈ పథకం స్టార్టప్‌ల నుంచి వచ్చిన పది ఉత్తమ పరిష్కారాలను ఎంపిక చేసి, ఎంపిక చేసిన ప్రాజెక్టుకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాక, ఒక ఏడాదిపాటు అంకితభావంతో సంస్థాగత మద్దతును అందిస్తుంది.
స్వచ్ఛతా స్టార్టప్ ఛాలెంజ్‌కు అదనంగా ప్రభుత్వం స్వచ్ఛ్ టెక్నాలజీ ఛాలెంజన్‌ను 6 డిసెంబర్ 2021న ప్రారంభించింది.
స్వచ్ఛ్ టెక్నాలజీ ఛాలెంజ్ మార్గదర్శకాల ప్రకారం అన్ని పట్టణ స్థానిక సంస్థలూ (యుఎల్‌బిలు) ఛాలెంజ్‌ను నిర్వహించి రెండు ఉత్తమ పరిష్కారాలను రాష్ట్రానికి అందించింది. అనంతరం రాష్ట్రాలు గరిష్ట మూడు ఉత్తమ ఎంట్రీలను గుర్తించేందుకు ఎంట్రీలను మూల్యాంకనం చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న యుఎల్‌బిలు గెలుపొందిన స్టార్టప్‌ల పరిష్కారాలకు అవార్డు నిధి, రాష్ట్ర/ నగర స్థాయి సన్మానం మాత్రమే కాకుండా అమలుకు మద్దతును ఇవ్వాలి.
అంతేకాకుండా, ప్రభుత్వ దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్‌ను, మేక్ ఇన్ ఇండియాను ముందుకు తీసుకువెళ్ళేందుకు స్వచ్ఛ్ భారత్ మిషన్ - పట్టణ 2.0 మార్గదర్శకాల కింద స్టార్టప్‌ల ద్వారా స్థానికంగా ఆవిష్కరించిన, చౌకైన సాంకేతిక పరిష్కారాలను, పారిశుద్ధ్యం, ఘన వృధాల నిర్వహణ కోసం పరిశోధన & నమూనాలలో పెట్టుబడుల పెట్టడం, ప్రభుత్వ ఇ-మార్కెట్ (జిఇఎం) పోర్టల్ ద్వారా ప్రోత్సహించించేందుకు అవసరమైన అంశాలను పొందుపరచడం జరిగింది.
ఈ సమాచారాన్ని నేడు లోక్‌సభలో గృహ & పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 1806230)
సందర్శకుల సూచీ సంఖ్య : : 183