కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

“25 సంవత్సరాల ట్రాయ్ చట్టం: వాటాదారులకు అందుబాటులో ఉన్న అవకాశాలు (టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ , ఎరా మరియు ఆధార్)” అనే అంశంపై సదస్సును ప్రారంభించనున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్

Posted On: 12 MAR 2022 10:45AM by PIB Hyderabad

“25 సంవత్సరాల ట్రాయ్  చట్టం: వాటాదారులకు అందుబాటులో ఉన్న అవకాశాలు (టెలికాంబ్రాడ్‌కాస్టింగ్ఐటీ ఎరా  మరియు ఆధార్)” అనే అంశంపై ఏర్పాటైన సదస్సును  కేంద్ర కమ్యూనికేషన్లుఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ రేపు సెమినార్‌ను ప్రారంభించన్నారు.   25 సంవత్సరాల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) చట్టం ద్వారా సాధించిన విజయాలను  గుర్తు చేసుకోవడానికి టెలికాం వివాదాల పరిష్కారం  అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీ శాట్ ) ఈ సదస్సును నిర్వహించనుంది.

 టెలికాంబ్రాడ్‌కాస్టింగ్ఐటీఎయిర్ పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఆధార్ రంగాలలో  వివాద పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న అవకాశాలతో సహా నియంత్రణ యంత్రాంగానికి సంబంధించిన అవగాహనను పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.  ఈ అంశంపై ప్రభుత్వంన్యాయ వ్యవస్థవివిధ వాటాదారుల ప్రతినిధులునియంత్రణ సంస్థల ప్రతినిధులుప్రముఖ న్యాయవాదులు తదితర నిపుణులు చర్చించి ప్రసంగిస్తారు.  కీలకమైన రంగాలు,నూతనంగా అభివృద్ధి చెందుతున్న పోకడలు మరియు వేగంగా మారుతున్న సాంకేతికత ద్వారా ఎదురవుతున్న  సవాళ్లనువాటి పరిష్కార మార్గాలను ఈ చర్చలు  వెలుగులోకి తీసుకుని వస్తాయని  భావిస్తున్నారు.

 దేశంలో  టెలికమ్యూనికేషన్స్ రంగం అభివృద్ధి సాధించిప్రగతి సాధించేందుకు అవసరమైన పరిస్థితులు కల్చించి అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సొసైటీలో దేశం ప్రముఖ పాత్రను పోషించాలన్న ఉద్దేశ్యంతో  1997లో ట్రాయ్  చట్టం రూపొందించబడింది.  టెలికాం రంగంలో సంస్థల మధ్య న్యాయమైన మరియు పారదర్శకమైన పోటీని ప్రోత్సహించి అభివృద్ధి సాధించేందుకు దోహదపడే వాతావరణాన్ని అందించడం   ప్రధాన లక్ష్యంగా  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటయింది.

 చట్టంలో పొందుపరిచిన నిబంధనల మేరకు  భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగాన్ని నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) ఏర్పాటు అయ్యింది. ట్రాయ్ అమలు చేస్తున్న  న్యాయవివాదాల విధులను నిర్వర్తించేందుకు  టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్ )ని నెలకొల్పడం జరిగింది.  2000లో ట్రాయ్ చట్టానికి సవరణలు చేసి  టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీ శాట్ )ని నెలకొల్పడం జరిగింది.

 

 ఈ కార్యక్రమంలో,సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ ఇందిరా బెనర్జీ,   మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టీడీశాట్  చైర్‌పర్సన్ జస్టిస్ శివ కీర్తి సింగ్,సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ ఇందిరా బెనర్జీ తో కలిసి శ్రీ వైష్ణవ్ టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్ )  సవరించిన విధానాన్ని కూడా   విడుదల చేస్తారు.  ఢిల్లీ హైకోర్టుకు చెందిన  జస్టిస్ నవీన్ చావ్లా శ్రీమతి జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్టెలికమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి,ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  ట్రాయ్  చైర్మన్ శ్రీ కె. రాజారామన్ ట్రాయ్ సభ్యులు,   ఎరా  సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ఆధార్సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ  ప్రతినిధులతో పాటు బార్ సభ్యులు మరియు బ్రాడ్‌కాస్టర్లు మరియు టెలికాం మరియు కేబుల్ ఆపరేటర్ల ప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
 
***


(Release ID: 1805442) Visitor Counter : 142