గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) కింద క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్ పాలసీపై గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అధ్యక్షతన వెబ్‌నార్.
క్యాప్టివ్ ఎంప్లాయర్', గ్రామీణ పేద యువతకు స్థిరమైన ప్లేస్‌మెంట్‌లకు భరోసానిస్తూ పరిశ్రమ భాగస్వాముల అవసరాలను తీర్చే డైనమిక్, డిమాండ్-ఆధారిత నైపుణ్య వ్యవస్థను దృష్టిలో ఉంచుకునె లక్ష్యంతో రూపొందించిన మొదటి ప్రయత్నం.
వెబ్‌నార్‌లో 16 కంటే ఎక్కువ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్‌లు మరియు 180పైగా వాటాదారులు పాల్గొన్నారు.
Posted On:
10 MAR 2022 7:18PM by PIB Hyderabad
కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా ఈరోజు (10 మార్చి, 2022) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) కింద 'క్యాప్టివ్ ఎంప్లాయర్' యత్నాన్ని ప్రమోట్ చేసే వెబ్‌నార్‌కు అధ్యక్షత వహించారు. నేటి వెబ్‌నార్‌లో 16 కంటే ఎక్కువ సెక్టార్ నైపుణ్య బృందాలు పాల్గొన్నాయి, ఇందులో 180 కంటే ఎక్కువ మంది వాటాదారులు కూడా పాల్గొన్నారు.
వెబ్‌నార్‌లో శ్రీ సిన్హా మాట్లాడుతూ, క్యాప్టివ్ ఎంప్లాయర్ ప్రాజెక్ట్ ల ద్వారా పరిశ్రమ అవసరాలు పరిష్కారమౌతాయని పునరుద్ఘాటించారు. ఇది పరిశ్రమకు గణనీయమైన ప్రోత్సాహం అవుతుందని మరియు వారు అవకాశాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అదనంగా, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన గ్రామీణ యువతపట్ల సున్నితంగా స్పందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ అభ్యర్థుల సంక్షేమం అత్యంత ప్రాముఖ్యమైనందున వారి భావోద్వేగ, అనుకూల అవసరాలపై తప్పనిసరిగా పని చేయాలి.
క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్ గురించి
'క్యాప్టివ్ ఎంప్లాయర్', గ్రామీణ పేద యువతకు స్థిరమైన ప్లేస్‌మెంట్‌లకు భరోసానిస్తూ పరిశ్రమ భాగస్వాముల అవసరాలను తీర్చే డైనమిక్ మరియు డిమాండ్-ఆధారిత నైపుణ్య పర్యావరణ వ్యవస్థని దృష్టిలో ఉంచుకునే లక్ష్యంతో రూపొందించిన మొట్టమొదటి ప్రయత్నం. ఈ కార్యక్రమం DDU-GKY ప్రోగ్రాం కోసం కనీసం ఆరు నెలల పాటు కనీసం రూ. 10,000/- వేతన భరోసాతో అభ్యర్థులకు శిక్షణానంతర నియామకాలకు హామీ ఇస్తుంది.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి క్రియాశీల మద్దతుతో వారి అవసరాలకు అనుగుణంగా శిక్షణార్ధులను నియమించడానికి ఈ మోడల్ పరిశ్రమలకు అనుమతిస్తుంది ఇంకా వారి స్వంత సంస్థ/పరిశ్రమ/ అనుబంధ సంస్థ/కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇస్తుంది. అభ్యర్థులకు హామీనిచ్చే నియామకాలను అందిస్తుంది. ఇది యజమానులు గ్రామీణ యువత నైపుణ్యాలు ఎంచుకోవడానికి, వారి స్థాపన/అనుబంధ సంస్థలలో ఒకదానిలో వారిని నియమించుకోవడానికి కూడా అనుమతిస్తుంది.
అటువంటి 'క్యాప్టివ్ ఎంప్లాయర్‌లను' ఎంపానెల్ చేయడానికి 1 ఫిబ్రవరి 2022న ఆసక్తి వ్యక్తీకరణ కోసం అభ్యర్థనను (REOI) రూపొందించారు. దీనికి సంబంధించి మొదటి ముందస్తు ప్రతిపాదన సమావేశం 21 ఫిబ్రవరి, 2022న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (గ్రామీణ నైపుణ్యాలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ) అధ్యక్షతన నిర్వహించారు. క్యాప్టివ్ ఎంప్లాయర్‌ల ప్రశ్నలపై సమాచారాన్ని అందించడానికి. 125 కంటే ఎక్కువ మంది ఉపాధి కల్పన సంస్థల ప్రతినిధులు ముందస్తు ప్రతిపాదన సమావేశానికి హాజరయ్యారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) గురించి
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) 25 సెప్టెంబర్, 2014న ప్రారంభమైంది, ఇది భారత ప్రభుత్వం (GoI) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MORD) నిధులతో దేశవ్యాప్త నియామక హామీ తో కూడిన నైపుణ్య శిక్షణా కార్యక్రమం (ప్లేస్‌మెంట్-లింక్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్). DDUGKY పేద గ్రామీణ యువత నియామక హామీ తో కూడిన నైపుణ్యాలను పెంపొందించడానికి, ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలలో వారిని వేతన ఉపాధిలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రోగ్రామ్ కనీసం 70% శిక్షణ పొందిన అభ్యర్థులకు హామీ ప్లేస్‌మెంట్‌లతో కూడిన ఫలితానికి దారితీసే నమూనాను కలిగి ఉంది, కనీస తప్పనిసరి ఉపాధి ధృవీకరణ కలిగి ఉంది.
DDU-GKY కార్యక్రమం 27 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో గ్రామీణ పేద యువత కోసం ఉపాధి నియామకాలకు ప్రాధాన్యతనిస్తూ అమలు అవుతుంది. 871 కంటే ఎక్కువ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (PIAలు) 2381 కంటే ఎక్కువ శిక్షణా కేంద్రాల ద్వారా దాదాపు 611 ఉద్యోగ పాత్రలలో గ్రామీణ పేద యువతకు శిక్షణ నిస్తున్నాయి. మొత్తంగా 11.44 లక్షల మంది యువతకు శిక్షణ పొందారు. 2022 జనవరి 31 వరకు 7.15 లక్షల మంది యువతకు ఉపాధి స్థానం కల్పించారు.
’’’’
(Release ID: 1804962)
Visitor Counter : 206