గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
12 మార్చి, 2022న జాతీయ స్థాయి 'ఇండియా వాటర్ పిచ్-పైలట్-స్కేల్ స్టార్ట్-అప్ కాన్క్లేవ్'ను ఎంఓహెచ్‌యూఏ నిర్వహించనుంది.
కాన్క్లేవ్ సందర్భంగా 'ఇండియా వాటర్ పిచ్-పైలట్-స్కేల్ స్టార్ట్-అప్ ఛాలెంజ్'ని శ్రీ హర్దీప్ ఎస్. పూరి ప్రారంభించనున్నారు.
Posted On:
09 MAR 2022 1:01PM by PIB Hyderabad
కర్టెన్ రైజర్
ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ జాతీయస్థాయిలో 'ఇండియా వాటర్ పిచ్-పైలట్-స్కేల్ స్టార్ట్-అప్ కాన్క్లేవ్'ని మార్చి 12, 2022న చేపట్టనుంది. న్యూఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్‌లోని స్టెయిన్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమాన్ని నీటి రంగంలో స్టార్ట్ అప్‌లను స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తోంది. హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి కాన్క్లేవ్ సందర్భంగా 'ఇండియా వాటర్ పిచ్-పైలట్-స్కేల్ స్టార్ట్-అప్ ఛాలెంజ్'ను ప్రారంభించి, కీలకోపన్యాసం చేస్తారు. మంత్రిత్వ శాఖ ఈ ఛాలెంజ్ ద్వారా 100 స్టార్టప్‌లను ఎంపిక చేస్తుంది. దీనికి నిధుల మద్దతుగా రూ.20 లక్షలు అందించబడుతుంది.
భారతీయ నగరాలను 'ఆత్మ నిర్భర్' మరియు 'వాటర్ సెక్యూర్'గా మార్చే లక్ష్యంతో 01 అక్టోబర్, 2021న అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0 (అమృత్ 2.0)ని ప్రధాని ప్రారంభించారు.ఈ పథకం ద్వారా అన్ని పట్టణ గృహాలకు ఫంక్షనల్ నీటి కుళాయి కనెక్షన్‌లను అందించడం, 500 అమృత్ నగరాల్లో మురుగునీరు / సెప్టేజీ సేవల యొక్క సార్వత్రిక గృహ కవరేజీని అందించడం, నీటి వనరుల పునరుజ్జీవనాన్ని చేపట్టడం, శుద్ధి చేసిన నీటిని రీసైకిల్ / పునర్వినియోగం, వర్షపు నీటి సేకరణ మరియు పచ్చని ప్రదేశాలను అందించడం వంటివి చేయాలని మిషన్ భావిస్తుంది.
టెక్నాలజీ సబ్-మిషన్ అమృత్ 2.0కు సంబంధించిన కీలక భాగం. ఇది భారతీయ నగరాల్లో నీటి సమస్యలను పరిష్కరించడానికి "పిచ్, పైలట్-అండ్ స్కేల్" పరిష్కారాలకు ఆర్థిక యాంకర్‌ను అందించడంతోపాటు స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం చేయడంపై దృష్టి సారిస్తుంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ ఫలితంగా ఏర్పడిన కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు పట్టణ నీటి సమస్యలకు పురోగతి పరిష్కారాలను అందిస్తున్నాయి. ఇవి మిషన్ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించబడుతున్నాయి.
50 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పట్టణ నీటి సమస్యలకు వినూత్న పరిష్కారాలను పిచ్/ఎగ్జిబిట్ చేస్తాయి. వినియోగదారు, పరిశ్రమ, ఆ రంగ నిపుణులు మరియు పెట్టుబడిదారులు కూడా సమ్మేళనానికి హాజరవుతారు. ఈ సమావేశం రాష్ట్రాలు/ నగరాలు/ పారాస్టేటల్ ఏజెన్సీలు, స్టార్టప్‌లు, ఆ రంగ నిపుణులు మరియు పరిశ్రమల వంటి వినియోగదారుల మధ్య పరస్పర చర్యకు ఒక ప్రారంభ బిందువుగా భావిస్తున్నారు. వినియోగదారు వినూత్న పరిష్కారాల యొక్క మొదటి అనుభవాన్ని కూడా పొందుతారు.
శ్రీ మనోజ్ జోషి, సెక్రటరీ, ఎంఓహెచ్‌యూఏ, శ్రీమతి. డి. తారా, మిషన్ డైరెక్టర్ మరియు అదనపు కార్యదర్శి అమృత్, ఎంఓహెచ్‌యూఏ మరియు ఎంఓహెచ్‌యూఏ నుండి ఇతర సీనియర్ అధికారులు కాన్క్లేవ్‌లో పాల్గొంటారు.
కాన్‌క్లేవ్‌లో రెండు ప్యానెల్ చర్చలు కూడా ప్లాన్ చేయబడ్డాయి. 'పట్టణ సవాళ్లను పరిష్కరించేందుకు స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను లెవరేజింగ్ చేయడం' అనే అంశంపై జరిగే మొదటి ప్యానెల్ చర్చలో క్వాంటెలా, పేటీఎం, ఢిల్లీవేరీ, అర్బన్ కంపెనీ, జోహో, రెయిన్‌మాటర్ ఫౌండేషన్ వక్తలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. 'స్టార్ట్-అప్‌లను స్కేలింగ్ చేయడానికి పరిశ్రమ ప్లాట్‌ఫారమ్‌లపై' రెండవ ప్యానెల్ చర్చలో సిస్కో మరియు మైక్రోసాఫ్ట్ స్పీకర్‌లు పాల్గొంటారు.
***
(Release ID: 1804759)