సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఆదర్శవంతమైన ప్రభుత్వ యంత్రాంగం పోటీ దాయకంగా, , సమర్థవంతమైనదిగా, ఖర్చు తక్కువగా, సుపరిపాలనను అందించడానికి జవాబుదారీగా ఉండాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సివిల్ సర్వీసెస్ సంస్కరణలపై సామర్థ్య పెంపు కమిషన్ సమావేశంలో ప్రసంగించిన మంత్రి జితేంద్ర సింగ్
పారదర్శకత, జవాబుదారీతనం , ప్రజలకు సేవలను అందించే వ్యవస్థల పెంపు -కొత్త తరం ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త తరం సంస్కరణలకు మూలస్తంభాలుగా మారాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
న్యూ ఇండియా ప్రభుత్వోద్యోగులు స్థిరమైన ,అభివృద్ధి చెందుతున్న మార్పులకు అనుగుణంగా ఉండాలి: మంత్రి జితేంద్ర సింగ్
Posted On:
26 FEB 2022 4:35PM by PIB Hyderabad
ఆదర్శవంతమైన ప్రభుత్వ యంత్రాంగం పోటీ దాయకంగా, , సమర్థవంతమైనదిగా, ఖర్చు తక్కువగా, సుపరిపాలనను అందించడానికి జవాబుదారీగా ఉండాలని కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ (స్వతంత్ర హోదా ) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సామర్థ్య పెంపు కోణం నుంచి సివిల్ సర్వీస్ సంస్కరణల చరిత్ర అవలోకనం' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ, ప్రభుత్వ అధికారులు ఈ రోజు ఇతర విషయాలతో పాటు, సామర్థ్య పెంపుదల పై పెట్టుబడికి తగినన్ని వనరులు లేక మెరుగైన సేవలను అందించడం లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు.న్యూ ఇండియా కోసం ప్రభుత్వోద్యోగులు స్థిరమైన , అభివృద్ధి చెందుతున్న మార్పులకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కొత్త తరం ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త తరం సంస్కరణల అవసరాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవాలనుకునే దేశాల మధ్య ప్రపంచ నాయకత్వ పాత్రను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నందున భారతదేశం పాలనలో ప్రపంచ ప్రమాణాలను అనుసరించాలని అన్నారు.
పారదర్శకత , జవాబుదారీతనం, ప్రజలే కేంద్రంగా సేవల డెలివరీ యంత్రాంగాలు కొత్త తరం ప్రభుత్వ ఉద్యోగులకు నూతన తరం సంస్కరణల మూల స్తంభాలుగా మారాలని ఆయన అన్నారు.
భారత సామర్థ్య పెంపు కమిషన్ సంఘం 2022 లో 'వార్షిక ఆరోగ్య పౌర సేవల నివేదిక' (ఎ హెచ్ సి ఎస్ ఆర్) ను ప్రచురిస్తుందని, ఇది భారత సివిల్ సర్వీస్ పనితీరును, మిషన్ కర్మయోగి సివిల్ సర్వీస్ లో సామర్థ్య పెంపుదలను ఎలా ప్రభావితం చేస్తుందో లోతుగా పరిశీలిస్తుందని డాక్టర్ సింగ్ తెలిపారు. ‘సుపరిపాలన' అనే భావన భారతదేశానికి పరాయిది కాదని, దేశంలోని పురాతన సాహిత్యంలో కూడా లోతుగా నిక్షిప్తమై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలకు సేవ చేయడానికి , పరిపాలనలో సంక్షోభం -సవాళ్లను అధిగమించడానికి ఇది ఒక సమగ్ర మార్గంగా చూడబడింది.
మన ప్రాచీన సాహిత్యంలో సుపరిపాలనకు పునాది ధర్మం (నీతి) ఆధారంగా ఉందని ఆయన అన్నారు. 'ధర్మం' ఆచరించే వ్యక్తి వెంటనే విలువల ప్రస్తుత భౌతిక వాద భాండాగారం నుండి తనను తాను వేరు చేసుకుంటాడు. ఒక ప్రభుత్వోద్యోగి ధర్మ మార్గాన్ని అనుసరించి మంచి కర్మతో మద్దతు ఇవ్వడం పరిపాలనా శ్రేష్ఠతకు దారితీస్తుంది. భారతదేశంలో ప్రభుత్వ పాలనపై తొలి రచనలు వేదాలు, బౌద్ధ సాహిత్యాలు , జైన మతపరమైన రచనలు వంటి వివిధ పవిత్ర గ్రంథాలలో వివరించబడ్డాయి.
ప్రాచీన భారతీయ రచనలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే రాజకీయ తత్వాలకు సంబంధించిన అద్భుతమైన ఉదాహరణలు మనకు లభిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు.
భారతదేశంలో స్టేట్ క్రాఫ్ట్ సైన్స్ మన చరిత్రలో బాగా పాతుకుపోయింది. సజీవంగా ఉంది. అభివృద్ధి చెందింది. కనీసం మన రాజకీయ తత్వశాస్త్రం కోసం పాశ్చాత్య వైపు చూడాల్సిన అవసరం లేకుండా మనం నిర్మించుకోవడం చాలా నేర్చుకున్నాం.
ప్రస్తుత ప్రభుత్వాలు సంప్రదాయ, చారిత్రక జ్ఞానం , ఇటీవలి పరిపాలనా సంస్కరణ ప్రయత్నాలను పాలనను మరింత మెరుగుపరచడానికి , గరిష్ట పాలన, కనీస ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నిర్దేశించిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో గ ల
మ ద్ద త ఇవ్వ గ లుగుతారని, ప్ర ధాన మంత్రి నియ మంగా ప్ర ద వీక రణను పెంపొందించ డంలో, మ రింత గా స హాయ ప డ గ ల ద ని ఆశాభావం వ్య క్తం చేశారు
డెలివరీని నిరంతరం పెంపొందించడంలో మెరుగుపరచడంలో మిషన్ కర్మయోగి కీలకమైన వ్యవస్థ అవుతుందని, కాలక్రమేణా ప్రధానమంత్రి నిర్దేశించిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.సరైన దృక్పథం, నిర్వహణ నైపుణ్యం, డొమైన్ నాలెడ్జ్ తో సాధికారత పొందిన పౌర కేంద్రిత సేవ మెరుగైన జీవన సౌలభ్యం, వ్యాపారాన్ని సులభతరం చేస్తుందని గుర్తించడంలో ఈ మిషన్ పూర్తిగా గుర్తించిందని ఆయన అన్నారు.నిరంతరం మారుతున్న జనాభా, డిజిటల్ వ్యాప్తి అదేవిధంగా పెరుగుతున్న సామాజిక. రాజకీయ అవగాహన నేపథ్యంలో, ప్రభుత్వోద్యోగులు మరింత డైనమిక్ ,ప్రొఫెషనల్ గా ఉండటానికి సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
సామర్థ్య పెంపు కమిషన్ (సిబిసి) , అషాంక్ దేశాయ్ సెంటర్ ఫర్ లీడర్ షిప్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ (ఎడిసిఎల్ ఓడి), ఐఐఎం-అహ్మదాబాద్ 'సామర్థ్య పెంపు నుండి సివిల్ సర్వీస్ సంస్కరణల చరిత్రను తిరిగి సందర్శించడం' పై ఈ వర్చువల్ రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహించాయి
భారతదేశంలో ప్రభుత్వ పరిపాలన చారిత్రక దృక్పథాలను అర్థం చేసుకోవడానికి, గత పరిపాలనా సంస్కరణల కమిషన్ల (ఎఆర్ సిలు) నుండి కీలక అమలు చేయదగిన సిఫార్సులను అర్థం చేసుకోవడానికి , సామర్థ్య పెంపు కమిషన్ ఎజెండాకు సహాయపడే ఆలోచనలను సంగ్రహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డిఎఆర్ పిజి కార్యదర్శి శ్రీ వి.సినివాస్ ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కమిషన్ ఛైర్మన్ శ్రీ ఆదిల్ జైనుల్ భాయ్ అధ్యక్షత వహించారు, సభ్యులు - డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం, శ్రీ ప్రవీణ్ పర్దేశి - కమిషన్ కార్యదర్శి శ్రీ హేమంగ్జానీ కూడా హాజరయ్యారు.
*****
(Release ID: 1801459)
Visitor Counter : 190