సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వాతంత్ర్య సమర యోధులలో వెలుగు లోకి రాని వారి త్యాగాల గురించి తెలుసుకోవాలని యువత కు గవర్నర్ ఉద్బోధ
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ స్వాతంత్ర్య సమరయోధులను కృతజ్ఞతతో స్మరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది" తమిళి సై సౌందరరాజన్
Posted On:
26 FEB 2022 5:18PM by PIB Hyderabad
హైదరాబాద్ లోని రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన హైదరాబాద్ లోని రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ వో బీ) ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ గౌరవ గవర్నర్, తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు సందర్శించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఇటువంటి ప్రయత్నాలు మనకు స్వేచ్ఛను సాధించే దిశగా మన ముందు తరాల నాయకులు చేసిన త్యాగాలను గుర్తుంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయనీ, ఇంకా దేశ సేవకు తిరిగి అంకితం కావడానికి మనల్ని ప్రేరేపిస్తాయనీ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం చరిత్రను అర్థం చేసుకోవడానికి యువకులు ఇటువంటి ప్రదర్శనలను సందర్శించాలని ఆమె అన్నారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు, 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ. వివిధ మంత్రిత్వ శాఖలు దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల పై సుమారు 45 ప్యానెల్స్ ఉన్న ప్రస్తుత ఫోటో ఎగ్జిబిషన్ ను హైదరాబాద్ లోని రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో సహకారంతో దీనిని. ఏర్పాటు చేసింది. ఈ వారం రోజుల ప్రదర్శనలో స్వాతంత్ర్య పోరాటం పై పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు, సైకిల్ ర్యాలీ మొదలైనవి నిర్వహించారు.
ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి (ఆర్ పి ఒ) శ్రీ దాసరి బాలయ్య, డైరెక్టర్ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ వో బి) శ్రీ శృతి పాటిల్, రెండు కార్యాలయాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర్యం పై హైదరాబాద్ ఆర్.ఒ.బి. అంతకు ముందు, తన మొదటి ఫోటో ఎగ్జిబిషన్ ను 2021 మార్చి 12న వరంగల్ లో నిర్వహించింది, దీనిని కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించారు. తరువాత ఈ ఫోటో ఎగ్జిబిషన్లను హైదరాబాద్, నిజామాబాదు, నల్గొండ, సూర్యపేట, కామారెడ్డి, అర్మూర్, దేవర కొండ లోనూ, ఇంకా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలోను కూడా నిర్వహించారు,
***
(Release ID: 1801399)
Visitor Counter : 1115