ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ఆసుపత్రి పనితీరును మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యాపకులు సిబ్బందితో చర్చలు జరిపిన మంత్రి


విధి నిర్వహణలో అలక్ష్య వైఖిరి అవలంబిస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరిక

"సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌ని అందరికీ అత్యంత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని అభివృధ్ధి చేయాలి: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


"సఫ్దర్‌జంగ్‌ను ఉత్తర భారతదేశానికి టెలిమెడిసిన్ కేంద్రంగా చేద్దాం"

Posted On: 23 FEB 2022 5:31PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్,  వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ విభాగాల అధిపతులు మరియు సిబ్బందితో వివిధ అంశాలపై ఆయన చర్చించి పనితీరును మరింత మెరుగుపరిచేందుకు అమలు చేయాల్సిన చర్యలపై ఆయన సమీక్ష  నిర్వహించారు.  వివిధ విభాగాల అధిపతులునర్సులుభద్రత మరియు పారిశుద్ధ్య సేవల అధిపతులతో 2.5 గంటలకు పైగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  చర్చలు జరిపారు. ఆసుపత్రి సక్రమ నిర్వహణక్లినికల్ పద్ధతులువ్యాధి నియంత్రణ చర్యలుపారిశుద్ధ్య ఆంశాలు, రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై మంత్రి  సిబ్బంది నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. పేదలునిరుపేదలు మరియు వెనుకబడిన వర్గాలకు మహమ్మారి సమయంలో 24 గంటల పాటు సేవలు అందించేందుకు చేసిన కృషిని మంత్రి కి సిబ్బంది వివరించారు.

 

  రోగులకు అత్యున్నత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మరింత  సమర్థంగా అంకిత భావంతో పని చేయాలని సిబ్బందికి మంత్రి సూచించారు. దీనికోసం అన్ని విభాగాల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. విమర్శలను సానుకూల దృక్పథంతో స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సలహా ఇచ్చారు. విమర్శలను పరిష్కరించి, మరింత సమర్థంగా సేవలను అందించే  పని సంస్కృతిని సిబ్బంది అలవరచుకోవాలని  కేంద్ర మంత్రి అన్నారు. , ఉమ్మడి లక్ష్యాలులక్ష్యాలు మరియు పని సంస్కృతి ద్వారా సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.  "ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ ఎలా అందించాలనే అంశం మన లక్ష్యంగా ఉండాలి. స్పష్టత ఉన్నప్పుడు  ఈ లక్ష్య సాధన సులువవుతుంది. లక్ష్యం, లక్ష్య సాధనకు అనుసరించాల్సిన విధానం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి స్పష్టమైన  కార్యాచరణతో పనిచేయాలి " అని ఆయన పేర్కొన్నారు.

 

పనితీరులో నిర్ల్యక్ష వైఖిరితో పనిచేసేవారిని క్షమించే ప్రసక్తి లేదని  డాక్టర్ మాండవ్య స్పష్టం చేసారు. అన్ని స్థాయిలలో పనిచేస్తున్న వారి పట్ల ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తామని అన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.  "గైర్హాజరు మరియు పేలవమైన పనితీరు గుర్తించడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని సిబ్బంది విడనాడాలని   ఆయన అన్నారు.  సెక్యూరిటీ మరియు కాంట్రాక్టు సిబ్బందితో సహా అన్ని స్థాయిలలో ఉద్యోగుల పనితీరు మరియు హాజరును అంచనా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హెచ్‌ఓడిలను కోరారు. సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చూడాలని, విధులను సక్రమంగా నిర్వహించేలా చూసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్ష్యాల మేరకు పనిచేసి నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి విభాగంలో తప్పనిసరిగా చర్యలు అమలు కావాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. అత్యుత్తమ పనితీరును స్వల్ప కాలానికి పరిమితం చేయకుండా శాశ్వత ప్రాతిపదికను అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

 

సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిని   అత్యంత నాణ్యత కలిగిన అత్యంత ప్రసిద్ధ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది పని చేయాలని మంత్రి సూచించారు.  ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ఆరోగ్య  మంత్రిత్వ శాఖ అందిస్తుందని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు.

 

 విభాగ అధిపతులు ప్రతి వారం తమ సిబ్బందిని  కలవాలని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సూచించారు. అన్ని విభాగాలను స్వయంగా దర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించాలని అన్నారు. పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని   కూడా డాక్టర్ మాండవ్య  విభాగ అధిపతులకు సూచించారు.  ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారని మంత్రి అన్నారు. వివిధ ఆరోగ్య అంశాలపై  విశ్లేషణాత్మక అధ్యయనాలు నిర్వహించేందుకు ప్రభుత్వ సంస్థల్లో అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.  అధ్యయనాలు నిర్వహించి వాటిని ప్రసిద్ధ పత్రికలలో ప్రచురించాలని వారిని కోరారు.

 

 

 దేశంలో కోవిడ్ 19 మహమ్మారిని సమర్ధవంతంగా నివారించిన వైద్యులను మంత్రి అభినందించారు.తమ పనితీరు, ప్రతిభతో  భారతీయ వైద్యులు ప్రపంచవ్యాప్త గుర్తింపు గౌరవం పొందారని  కేంద్ర మంత్రి ప్రశంసించారు.  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత   అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు అమలు జరగాలని అన్నారు.   ఆరోగ్య సంరక్షణఫార్మా మరియు పరిశోధన అభివృద్ధి  అంశాలలో భారతదేశం తన సామర్థ్యాన్ని ప్రదర్శించాలని ఆయన అన్నారు.    3 కోట్ల రూపాయల విలువ చేసే  1వ కాయకల్ప అవార్డు సాధించిన   ఆసుపత్రిని అభినందించారు.

 

 ఈ సమావేశంలో ఆరోగ్య సేవ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (డాక్టర్ .) సునీల్ కుమార్సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్వీ ఆర్యవివిధ విభాగాల అధిపతులుపారిశుధ్యం కాయకల్ప కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

***


(Release ID: 1800665) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi