పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్‌సిఎస్‌ ఉడాన్‌ పథకం కింద ఢిల్లీ-ఖజురహో మధ్య మొదటి డైరెక్ట్ విమాన సర్సీసు ప్రారంభం


ఖజురహో లో 2 కొత్త విమాన శిక్షణ సంస్థలు ఏర్పాటవుతాయి.. శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

Posted On: 18 FEB 2022 5:18PM by PIB Hyderabad

దేశ రాజధాని ఢిల్లీ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన ఖజురహో మధ్య ఈరోజు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీనితోఉడాన్-ఆర్‌సిఎస్ పథకం కింద విమాన సర్వీసులు నడుస్తున్నమార్గాల సంఖ్య 405కి చేరింది.  పనిచేస్తాయి. ఆర్‌సిఎస్‌ - ఉడాన్‌ 3.0 కింద ఢిల్లీ-ఖజురహో-ఢిల్లీ మార్గాన్ని స్పైస్‌జెట్ పొందింది.

ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియాపౌర విమానయాన మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉషా పాధీస్పైస్‌జెట్ ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ సింగ్ఖజురహో పార్లమెంట్ సభ్యులు శ్రీ విష్ణు దత్ శర్మ, , మధ్యప్రదేశ్‌ శాస్ర్త సాంకేతిక ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి  శ్రీ ఓం ప్రకాష్ సఖలేచామల్హరా శాసనసభ సభ్యులు శ్రీ కున్వర్ ప్రద్యుమ్న సింగ్ లోధి మరియు అనేక ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

స్పైస్‌జెట్ సంస్థ వారంలో 2 రోజులు ఈ మార్గంలో విమానాలు నడుపుతుంది. విమాన సర్వీసు శుక్రవారం మరియు ఆదివారం అందుబాటులో ఉంటాయి.  తక్కువ దూర ప్రాంతాల కోసం అనువుగా ఉండే  Q400 తరహా 78-సీట్ల టర్బో ప్రాప్ విమానాలను ఈ మార్గంలో నడుపుతారు.  భారతదేశపు అతిపెద్ద ప్రాంతీయ రవాణా సంస్థగా స్పైస్‌జెట్ గుర్తింపు పొందింది. ఉడాన్‌ పథకం అమలులో స్పైస్‌జెట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉడాన్‌ పథకం కింద 14 ఉడాన్ గమ్యస్థానాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలుపుతూ స్పైస్‌జెట్ సంస్థ ప్రతిరోజు 65 విమానాలను నడుపుతోంది. ప్రస్తుతం స్పైస్‌జెట్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ మరియు జబల్‌పూర్ విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. స్పైస్‌జెట్ 15వ ఉడాన్‌ గమ్యస్థానంగా ఖజురహో ఉంటుంది.

ఈ సందర్భంగా శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ "ఖజురహో ప్రపంచానికి గర్వకారణం. ఇది మధ్యప్రదేశ్ సాంస్కృతిక మరియు కళా నైపుణ్యం మరియు మతపరమైన వైవిధ్యానికి ప్రతీక. మధ్యప్రదేశ్ చరిత్రవర్తమానం మరియు భవిష్యత్తులో ఖజురహో గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది." అని అన్నారు.

 “ఖజురహోతో పాటు మధ్యప్రదేశ్‌లో ఇండోర్భోపాల్గ్వాలియర్ మరియు జబల్‌పూర్‌లతో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. గత 7 నెలల్లో మధ్యప్రదేశ్‌లో విమాన సర్వీసుల సంఖ్య వారానికి 40% మేరకు పెరిగాయి. 2022 18 ఫిబ్రవరి నాటికి వారానికి 759 విమానాలు నడుస్తున్నాయి. అంతే కాకుండాఖజురహోలో రెండు కొత్త ఎఫ్‌టిఓలు (ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు) ఏర్పాటవుతాయి. వీటిలో వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 2024-25 నాటికి 100 విమానాశ్రయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. 1,000 కొత్త విమాన మార్గాలను ఆందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా  ఇప్పటి వరకు, 65 విమానాశ్రయాల నిర్మాణం పూర్తయింది.  403 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. 2012-13లో ఆరు కోట్ల వరకు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2021-22 నాటికి 14.5 కోట్లకు చేరింది “ అని మంత్రి వివరించారు.  ప్రధాన మంత్రి ఉడాన్ విజన్ - ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్‌  నినాదానికి తమ మంత్రిత్వశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా అన్నారు.

 

ఖజురహో విమానాశ్రయం 1978లో స్థాపించబడింది. ఇక్కడ నుంచి ఢిల్లీఆగ్రావారణాసికి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఖజురహో విమానాశ్రయంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. విమానాశ్రయంలో  ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, 1,20,000 చదరపు అడుగుల కొత్త టెర్మినల్ బిల్డింగ్నైట్ ల్యాండింగ్ సదుపాయంరన్‌వే రీకార్పెటింగ్ మరియు కొత్త ఎటిసి టవర్‌ల లాంటి ఆథునిక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ విమానం ప్రారంభమవుతుంది.

నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో ఢిల్లీ నుంచి ప్రయాణికులు ఖజురహో ను సందర్శించి నగరం యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించవచ్చు. ఖజురహో నుంచి ప్రయాణికులు ఇతర నగరాలను సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా MICE (మీటింగ్‌లుప్రోత్సాహకాలుకాన్ఫరెన్స్/ కన్వెన్షన్‌లు మరియు ఎగ్జిబిషన్‌లు/ ఈవెంట్‌లు) కోసం గుర్తించిన  ఐకానిక్ గమ్యస్థానాలలో ఖజుర హోకూడ ఉంది .

విమాన షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:

అమలులో ఉన్న తేదీ

కార్యకలాపాల తేదీ

విమాన నం.

రంగం

బయలుదేరు సమయం

ఆగమన సమయం

విమానం రకం

18-ఫిబ్రవరి-22

శుక్రవారంఆదివారం

SG 2956

ఢిల్లీ-ఖజురహో

11:50 am

1:10 pm

Q400

18-ఫిబ్రవరి-22

శుక్రవారంఆదివారం

SG 2957

ఖజురహో-ఢిల్లీ

మధ్యాహ్నం 1:30

2:50 pm

Q400

*****


(Release ID: 1799373) Visitor Counter : 197