వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశంలో అమలు జరుగుతున్న జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల (జెఐటి) నిర్మాణ ప్రగతిని సంయుక్తంగా సమీక్షించిన భారతదేశం పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ (డీపీఐఐటీ) మరియు జపాన్ (ఆర్థిక, వాణిజ్య మరియు పరిశ్రమల) మంత్రిత్వ శాఖ (ఎంఈటిఐ)
జెఐటిల నిర్మాణంలో పాల్గొంటున్న114 జపాన్ కంపెనీలు
జపాన్ భారతదేశ అతిపెద్ద పెట్టుబడిదారులలో అయిదవ స్ధానంలో జపాన్
14 రంగాలకు ప్రకటించిన ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహకాల కోసం జపాన్ సంస్థల నుంచి అందిన అనేక దరఖాస్తులు
Posted On:
14 FEB 2022 11:21AM by PIB Hyderabad
భారతదేశంలో అమలు జరుగుతున్న జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల (జెఐటి) నిర్మాణ ప్రగతిని భారతదేశం పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ (డీపీఐఐటీ) మరియు జపాన్ (ఆర్థిక, వాణిజ్య మరియు పరిశ్రమల) మంత్రిత్వ శాఖ (ఎంఈటిఐ) సంయుక్తంగా సమీక్షించాయి. ఈ టౌన్ షిప్పుల్లో నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి అభివృద్ధి చేసిన భూములు, మౌలిక సౌకర్యాలను జపాన్ సంస్థలకు డీపీఐఐటీ, రాష్ట్రాలు అందించాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని జపాన్ సంస్థలను కోరడం జరిగింది.
కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ ప్రగతిని ఎంఈటిఐ అధికారులతో డీపీఐఐటీ అధికారులు వర్చువల్ విధానంలో సమీక్షించారు. సమీక్షా సమావేశంలో జపాన్ తరఫున భారతదేశంలో జపాన్ రాయబార కార్యాలయ అధికారులు, జపాన్ విదేశీ వ్యాపార సంస్థ ( జెట్రో) ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం తరఫున కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టోక్యో లో భారత రాయబార కార్యాలయం అధికారులు, రాష్ట్రాలు,ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
భాతదేశంలో జపాన్ మాత్రమే పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. జపాన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌లలో అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అనువాదం మరియు సులభతర సహకారం కోసం ప్రత్యేక జపాన్ డెస్క్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సౌకర్యాలు, ప్లగ్ మరియు ప్లే సౌకర్యాలు, రెసిడెన్షియల్ క్లస్టర్‌లు మరియు జపనీస్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు వంటి సౌకర్యాలను వీటిలో అందిస్తారు. పూర్తిగా అభివృద్ధి చెందిన భూమి ఈ టౌన్‌షిప్‌లలో కేటాయింపు కోసం అన్ని సౌకర్యాలతో కల్పించారు. వీటిని వెంటనే స్వాధీనం చేసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేయడం జరిగింది.
దేశంలో ప్రస్తుతం జపాన్ చెందిన 114 సంస్థలు వివిధ జెఐటిలలో పనిచేస్తున్నాయి. నీమ్రానా మరియు శ్రీ సిటీ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు ఎక్కువ జపాన్ సంస్థలు ఉన్నాయి. డైకిన్, ఇసుజు,కొబల్క యమహా మ్యూజిక్, హిటాచి ఆటోమోటివ్ మొదలైన సంస్థలు ఈ టౌన్‌షిప్‌లలో ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. జపాన్ పెట్టుబడిదారులు వీటిలో పెట్టుబడులు పెట్టారు.
భారతదేశంలో 5వ అతిపెద్ద పెట్టుబడిదారుగా గుర్తింపు పొందిన జపాన్ 2000 నుంచి ఇంతవరకు భారతదేశంలో 36.2 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే పెట్టుబడులను పెట్టింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ , మ్యానుఫ్యాక్చరింగ్ (ESDM), వైద్య పరికరాలు,వినియోగ వస్తువులు, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు కెమికల్స్ వంటి కీలక రంగాల్లో జపాన్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.
భారతదేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికారులు సమావేశంలో వివరించారు. 14 రంగాల కోసం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అనేక దరఖాస్తులు అందాయని భారత అధికారులు తెలిపారు. ఈ పథకం కింద అనేక జపాన్ సంస్థలు దరఖాస్తు చేశాయని, వీటికి ఆమోదం లభించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానం వివరాలు, పథకం ప్రయోజనాలను జపాన్ బృందానికి భారతదేశ అధికారులు వివరించారు. ఏక గవాక్ష విధానంలో డిజిటల్ పద్దతిలో 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు జరుగుతోంది. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కార్యక్రమం కింద ఇంధనం, రైల్వేలు, రహదారులు, నీటిపారుదల లాంటి ముఖ్యమైన రంగాలలో మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019-2025 మధ్య ఈ కార్యక్రమాన్ని 1.4 ట్రిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే పనులను ఈ కార్యక్రమం కింద అమలు చేయడం జరుగుతుంది.
జెఐటి వంటి ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను భారత అధికారులు వివరించారు. జెఐటి తో సహా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, విద్యుత్ వాహనాల తయారీ , డ్రోన్స్, రోబోటిక్స్ మరియు జౌళి రంగాలలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
భారతదేశం తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ బృందం తెలిపింది. భారతదేశం తో సహకారం- జపాన్ పారిశ్రామిక పోటీ భాగస్వామ్యం' ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలు మరింత మెరుగు పడతాయని జపాన్ బృందం పేర్కొంది.
***
(Release ID: 1798327)
Visitor Counter : 145