మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నైపుణ్యాభివృద్ధి శిక్షణ
Posted On:
10 FEB 2022 6:13PM by PIB Hyderabad
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆరు నోటిఫైడ్ మైనారిటీలు అయిన ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పారసీల అభివృద్ధి, సంక్షేమం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలను చేపడుతోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి పథకాలకు సంబంధించిన సమాచారం సంక్షిప్తంగా కింద ఇవ్వడం జరిగింది.
1. సీఖో ఔర్ కమావో పథకం:
సీఖో ఔర్ కమావో పథకం ( నేర్చుకో,సంపాదించు) అనే పథకం మైనారిటీలకు, ప్లేస్ మెంట్ తో కూడిన నైపుణ్యాభివృద్ధి పథకం. మైనారిటీ యువత నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఉద్దేశించినది. 14 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల యువతకు వివిధ ఆధునిక, సంప్రదాయ నైపుణ్యాలను వారి వారి విద్యార్హతలు, ప్రస్తుత ఆర్ధిక స్థితిగతులు, మార్కెట్ తీరు, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా వారికి ఉపాధి కల్పించేలా చేయడం లేదా వారు స్వయం ఉపాధిపొందేలా వారికి శిక్షణ ఇవ్వడం దీని ఉద్దేశం. ఈ పథకం కింద మొత్తం కేటాయింపులో 33 శాతం మహిళా లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఈ పథకం కింద శిక్షణ పొందిన మైనారిటీ లబ్ధిదారులను సామాజికంగా, ఆర్ధికంగా జాతీయ ప్రధాన స్రవంతిలో కలిసేలా చేస్తారు.
2) నఈ మంజిల్ పథకం:
నఈమంజిల్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో పేద మైనారియటీ యువతకోసం తీసుకువచ్చింది. వారికి లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించచేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా వారిని ప్రధాన స్రవంతి ఆర్థిక కార్యకలాపాలలో సమ్మిళితం చేస్తారు. ఇది మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ,పాఠశాల విద్యను మధ్యలోనే మానేసిన వారిని గుర్తించి వారికి ఫార్మల్ విద్యను కల్పిస్తుంది. అలాగే 8 వతరగతి వరకు వారికి సర్టిఫికేట్ వచ్చేలా చేస్తుంది. లేదా 10 వ తరగతిని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ( ఎన్ ఐ ఒ ఎస్) ద్వారా పూర్తి చేయిస్తారు. లేదా ఇతర ఓపెన్ స్కూలింగ్ వ్యవస్థల ద్వారా పదోతరగతి పూర్తి చేసేలా చేస్తారు.
ఈ కార్యక్రమం కింద, మార్కెట్ ఆధారిత నైపుణ్యాలను , సమీకృత నైపుణ్య శిక్షణను అందించనున్నారు.అలాగే ఎన్ ఎస్ క్యు ఎఫ్ కు అనుగుణమైన నైపుణ్య కోర్సులను వీరికి అందిస్తారు. ఈ ప
థకం కింద దారిద్ర రేఖకు దిగువన ఉన్న మైనారిటీ కుటుంబాలకు చెందిన , మధ్యలోనే బడి మానేసిన 17-35 సంవత్సరాల మధ్య యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పథకం కింద అవకాశాలు కల్పిస్తారు.
ఈ పథకం కింద లక్షిత సీట్లలో 30 శాతం సీట్లను బాలకలు , మహిళా అభ్యర్థులకు కేటాయిస్తారు. 5 శాతం సీట్లను మైనారిటీలలోని దివ్యాంగులకు కేటాయిస్తారు.
3) ఉస్తాద్ పథకం :
ఉస్తాద్ ( అప్ గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఫర్ డవలప్‌మెంట్) పథకాన్ని 2015లో ప్రారంభించారు. మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్, ఆర్టిసాన్‌ల సంప్రదాయ నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేయడం, సామర్ధ్యాల నిర్మాణానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం సంప్రదాయ కళలు, కళారూపాలను, హస్తకళల ఘన వారసత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంది.
అలాగే జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో కళాకారులకు మార్కెట్ లింకేజ్‌ని కల్పిస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమం 2016-17లో ప్రారంభమౌతుంది. ఈ పథకం హునార్ హాత్‌లను కూడా నిర్వహిస్తుంది. హునార్ హాత్ మైనారిటీ కళాకారులు, హస్తకళాకారులు తయారు చేసే ఉత్పత్తులకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేస్తుంది. వీరికి ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా అవకాశాలు కల్పిస్తారు. హునార్ హాట్ లు మైనారిటీ కళాకారులకు ఉపాధి , ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది.
మౌలానా అజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (ఎం ఎ ఇ ఎఫ్ ) గరీబ్ నవాజ్ ఎంప్లాయిమెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. నేషనల్ మైనారిటీస్ డవలప్‌మెంట్ , ఫైనాన్స్ కార్పొరేషన్ ( ఎన్ ఎం డిఎఫ్సి) కౌశల్ సే కుశలత పథకం, మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది.
పైన పేర్కొన్న మైనారిటీలకు నైపుణ్య శిక్షణ పథకం కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందుకున్న యువకులు,వ్యక్తుల మొత్తం సంఖ్య 657802 గా ఉంది. కోవిడ్ 19 మహమ్మారి విసిరిన సవాలు ఉన్నప్పటికీ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉపాధి నిర్దేశిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతంగా పూర్తి చేయగలిగింది.
సీఖో ఔర్ కమాఓ నైపుణ్యాభివృద్ధి పథకం కింద 2016-17 లో పథకం ప్రారంభించినప్పటి నుంచి మైనారిటీ మహిళలు, బాలికలు 85,650 మందికి మాడ్యులార్ ఎంప్లాయబుల్ స్కిల్స్ (ఎంఇఎస్)ను అందుబాటులోకి తేవడం జరిగింది. 2017-18 తర్వాత మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎన్ .ఎస్.క్యు.ఎఫ్ నిర్దేశిత కోర్సులను చేపట్టింది. అలాగే ఎం.ఎ.ఇ.ఎఫ్ కింద గరీబ్ నవాజ్ ఎంప్లాంయిమెంట్ పథకం కింద 26,400 మహిళలకు ఎంఇఎస్ కోర్సులలో శిక్షణ పొందారు.
మంత్రిత్వశాఖకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి పథకాలతో 381 ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు, సంస్థలు, సొసైటీలు, ఎన్.జి.ఒ లు కలిసిపని చేస్తున్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వి లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1798304)
Visitor Counter : 140