జల శక్తి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన
Posted On:
07 FEB 2022 5:11PM by PIB Hyderabad
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అందించిన సమాచారం ప్రకారం 2018-19లో సాగులో ఉన్న మొత్తం భూమిలో దాదాపు 48. 65% భూమికి నికర నీటిపారుదల సౌకర్యం లేదు.
2015-16లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ప్రారంభమయింది. వ్యవసాయ కార్యక్రమాలకు నీరు అందించి, ఎక్కువ భూ విస్తీర్ణంలో వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం, నీటి వనరులను సమర్ధంగా ఉపయోగించడం, జల వనరుల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేయడం లాంటి కార్యక్రమాలను అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అమలు జరుగుతుంది.
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని రెండు భాగాలుగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. నీటిపారుదల సౌకర్యాలను వేగవంతం చేసేందుకు యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ మరియు హర్ ఖేత్ కో పానీ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. నాలుగు ఉప భాగాలుగా హర్ ఖేత్ కో పానీ కార్యక్రమం అమలు జరుగుతున్నది. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ , వాటర్ మేనేజ్‌మెంట్ , ఉపరితల చిన్న నీటి వనరులు, జల వనరులకు మరమత్తులు, పునరుద్ధరణ, తిరిగి వినియోగం లోకి తీసుకుని రావడం, భూగర్భ జల వనరుల అభివృద్ధి లక్ష్యాలుగా ఈ నాలుగు ఉప భాగాలు అమలు జరుగుతున్నాయి.
జల్ శక్తి మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఒక చుక్క నీరుతో ఎక్కువ పంట కార్యక్రమాన్ని వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జల వనరుల అభివృద్ధి కార్యక్రమాన్ని భూ వనరుల శాఖ అమలు చేస్తున్నాయి.
2018 నుంచి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద మంజూరు చేసిన, పూర్తి చేసిన, అమలు జరుగుతున్న కార్యక్రమాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పరి పాసు అమలుతో పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ, సిఎడిడబ్ల్యుఎం కార్యక్రమాలు:
2016-17 ఆర్థిక సహకారం కోసం 2016-17 లో పరి పాసు అమలుతో పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ, సిఎడిడబ్ల్యుఎం కింద 99 ప్రాజెక్టులను చేర్చడం జరిగింది. 2017-18 నాటికి వీటిలో 31 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. 2018 జూన్ నుంచి ఇంతవరకు 15 ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఈ 15 ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది. 2018 నుంచి పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ లో భాగంగా ఎటువంటి ప్రాజెక్టులను అమలు చేయడం లేదు.
పీఎంకేఎస్‌వై - హెచ్ కేకే పి- ఎస్ ఎం ఐ
పీఎంకేఎస్‌వై - హెచ్ కేకే పి లో భాగంగా అమలు ఉపరితల చిన్న నీటి వనరుల (ఎస్ ఎం ఐ) కార్యక్రమం అమలు జరుగుతోంది. 2018-19 నుంచి ఈ కార్యక్రమంలో 1,321 పథకాలను చేపట్టడం [అరుణాచల్ ప్రదేశ్-604, హిమాచల్ ప్రదేశ్-4, మణిపూర్-375, మేఘాలయ-68, నాగాలాండ్-270] జరిగింది. ఈ పథకాలలో 77 పథకాలు 2018-19 నాటికి పూర్తి అయ్యాయి. ఈ 77 పథకాల వివరాలు, కొనసాగుతున్న పథకాల వివరాలు అనుబంధంలో ఉంచబడ్డాయి.
పీఎంకేఎస్‌వై - హెచ్ కేకే పి- ఆర్ఆర్ఆర్
పీఎంకేఎస్‌వై - హెచ్ కేకే పి లో భాగంగా అమలు చేస్తున్న మరమత్తులు, పునరుద్ధరణ, తిరిగి వినియోగంలోకి తేవడం (ఆర్ఆర్ఆర్) కార్యక్రమం కింది 395 జలవనరులను[ఆంధ్రప్రదేశ్-100, బీహార్-93, గుజరాత్-61, తమిళనాడు-141] చేపట్టడం జరిగింది. . ఈ నీటి వనరులలో, 100 నీటి వనరుల ఆర్‌ఆర్‌ఆర్ 2018-19నాటికి పూర్తయ్యింది. పూర్తయినట్లు నివేదించబడింది. ఈ 100 నీటి వనరుల వివరాలు, కొనసాగుతున్న నీటి వనరుల వివరాలు అనుబంధం లో ఉంచబడ్డాయి.
పీఎంకేఎస్‌వై - హెచ్ కేకే పి-జిడబ్ల్యు
పీఎంకేఎస్‌వై - హెచ్ కేకే పి భాగంగా అమలు జరుగుతున్న భూగర్భ జలాలు (జిడబ్ల్యు) కింద 2019 నుంచి 15 ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇవి అమలు జరుగుతున్నాయి. ఆమోదించిన ప్రాజెక్టులలో 13 ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటి వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది.
పీఎంకేఎస్‌వై-పిడిఎంసి
పీఎంకేఎస్‌వై కింద చుక్క నీటితో ఎక్కువ పంట (పిడిఎంసి) కార్యక్రమం 32.697 లక్షల హెక్టార్ల భూమిలో అమలు జరుగుతోంది. 2018- 19 నుంచి 2020-21 వరకు కార్యక్రమం చేపట్టిన భూముల వివరాలు అనుబంధంలో ఉంచబడ్డాయి.
పీఎంకేఎస్‌వై- డబ్ల్యుడిసి
పీఎంకేఎస్‌వై లో భాగంగా అమలు చేస్తున్న డబ్ల్యుడిసి కార్యక్రమం కింద- భూ వనరుల శాఖ చేపట్టిన 5,243 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ల వివరాలు, కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల వివరాలతో పాటు అనుబంధంలో ఉంచబడ్డాయి.
నీటి వనరుల ప్రాజెక్టులు తమ సొంత వనరులు మరియు ప్రాధాన్యత ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వీటి ప్రణాళిక, నిధులు, అమలు మరియు నిర్వహణ ఆయా రాష్ట్రాలు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాత్ర సాంకేతిక సహకారం అందించడానికి పరిమితం చేయబడింది. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకాల కింద పాక్షిక ఆర్థిక సహాయం అందించబడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ మరియు నాణ్యతా నియంత్రణను నిర్ధారించడానికి పర్యవేక్షణ మరియు పరిష్కార యంత్రాంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ మంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర సహాయాన్ని పొందుతున్న ప్రాజెక్టులు అమలు జరుగుతున్న తీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి సెంట్రల్ వాటర్ కమీషన్ అలాగే ఈ మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ కూడా ఏర్పాటు అయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ల భౌతిక మరియు ఆర్థిక పురోగతిని ప్రత్యేక డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. దీనికి జల్ శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో సహకారం అందించబడుతుంది.
ప్రాజెక్టుల అమలు మరియు పురోగతిని ఈ మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తుంది. జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి , గంగా పునరుజ్జీవన శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రాజెక్టుల భౌతిక మరియు ఆర్థిక పురోగతిపై ప్రాజెక్టుల వారీగా కాలానుగుణ సమీక్షలను తీసుకుంటారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలను ఖరారు చేస్తారు. జలశక్తి మంత్రి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు కూడా జరుగుతాయి.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1796412)
Visitor Counter : 175