నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పున‌రుత్పాద‌క ఇంధ‌నానికి ప్రోత్సాహ‌కాలు

Posted On: 03 FEB 2022 8:45PM by PIB Hyderabad

దేశంలో పున‌రుత్పాద‌క ఇంధ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. వాటిలో కింది చ‌ర్య‌లు ఉన్నాయి.
-విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను (ఎఫ్‌.డిఐ)  ఆటోమేటిక్ రూట్‌లో వంద శాతం అనుమ‌తి.
- 2025 జూన్ 30 నాటికి ప్రారంభించ‌నున్న సౌర , ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టుల‌కు అంత‌ర్  రాష్ట్ర ట్రాన్స్ మిష‌న్ సిస్ట‌మ్స్ (ఐఎస్‌టిఎస్‌) చార్జీల ర‌ద్దు
-2022 సంవత్సరం వరకు రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (RPO) కోసం పథం  ప్రకటన,
- పున‌రుత్పాద‌క ఇంధ‌న డ‌వ‌ల‌ప‌ర్ల‌కు ప్ల‌గ్ , ప్లే విధానంలో భూమి, ట్రాన్స్ మిష‌న్ స‌దుపాయం క‌ల్పించేందుకు అల్ట్రా మెగా పున‌రుత్పాద‌క ఇంధ‌న పార్కుల ఏర్పాటు.

-ప్రధాన్ మంత్రికిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పిఎం-కుసుమ్‌), సోలార్ రూఫ్‌టాప్ ఫేజ్ II, 12000 మెగావాట్  సిపిఎస్ యు ప‌థ‌కం ఫేజ్ II, మొదలైన పథకాలు,
-  గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం కింద పునరుత్పాదక విద్యుత్ తరలింపు కోసం, కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్‌లను వేయడం , కొత్త సబ్-స్టేషన్ కెపాసిటీని సృష్టించడం,
-పెట్టుబడులను ఆకర్షించడం , సులభతర అందుబాటు  కోసం ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయడం,
-గ్రిడ్ అనుసంధానిత సోలార్ పివి, ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టుల‌నుంచి విద్యుత్ కొనుగోలుకు పోటీ తో కూడిన టారిఫ్ ఆధారిత‌ బిడ్డింగ్ ప్ర‌క్రియ‌కు ప్రామాణిక బిడ్డింగ్ మార్గ‌ద‌ర్శ‌కాల జారీ.
-పున‌రుత్పాద‌క ఇంధ‌న జనరేటర్‌లకు పంపిణీ లైసెన్సుల ద్వారా సకాలంలో చెల్లింపులు జ‌రిగేలా చూడ‌డానికి, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ సి) లేదా ముందస్తు చెల్లింపుల‌పై  విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ .

“పునరుత్పాదక ఇంధన పరిశోధన ,సాంకేతిక అభివృద్ధి కార్యక్రమం”  పథకానికి మంత్రిత్వ శాఖ వివిధ పరిశోధనా సంస్థలు , పరిశ్రమల ద్వారా  మద్దతు ఇస్తోంది,  దేశవ్యాప్తంగా సమర్థవంతమైన ,తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిలో  నూత‌న‌, పునరుత్పాదక ఇంధనాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి స్వదేశీ సాంకేతికత, అభివృద్ధి , తయారీని ప్రారంభించడానికి  దీనిని అమ‌లు చేస్తున్నారు.
పరిశ్రమ సహకారంతో పరిశోధన , సాంకేతిక అభివృద్ధి ప్రతిపాదనలను ఈ పథకం ప్రోత్సహిస్తుంది .   ప్ర‌భుత్వ‌, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలకు 100 శాతం వరకు , పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థ‌లు, వ్యవస్థాపకులు , తయారీ యూనిట్లకు 50-70 శాతం వరకు  ఆర్థిక సహాయాన్ని ఈ ప‌థ‌కం అందిస్తుంది
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్ , నూతన , పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్‌ 
లోక్‌స‌భ‌లో ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 1796090) Visitor Counter : 142


Read this release in: Urdu , English