శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అల్యూమినియం అయాన్ బ్యాటరీలు, సోడియం అయాన్ బ్యాటరీలు, పాలిమర్ బ్యాటరీలు ,గ్రాఫేన్ ఆధారిత బ్యాటరీలలో భ‌విష్య‌త్ ఇంధన పదార్థాలలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు.


భ‌విష్య‌త్ ఇంధ‌న మెటీరియ‌ల్ ప్ర‌త్యేకించి బ్యాట‌రీల విస‌యంలో విజ్ఞన‌పురోభివృద్ధికి సంబంధించి డిఎస్ టి 42ప్రాజెక్టుల‌కు మద్ద‌తునిస్తున్న‌ట్టు తెలిపిన డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌.

Posted On: 02 FEB 2022 7:21PM by PIB Hyderabad

భ‌విష్య‌త్ ఇంధ‌న‌ మెటీరియ‌ల్స్ లో ప్ర‌త్యేకించి అల్యూమినియం అయాన్ బ్యాట‌రీలు, సోడియం అయాన్ బ్యాట‌రీలు, పాలిమ‌ర్ బ్యాట‌రీలు, గ్రాఫేన్ ఆధారిత బ్యాట‌రీల‌రంగంలో ప‌రిశోధ‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కేంద్ర  శాస్త్ర సాంకేతిక శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర‌), భూ విజ్ఞానం, ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్‌, అణు ఇంధ‌న శాఖ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

లోక్‌స‌భ‌లో ఈరోజు ఒక లిఖిత‌పూర్వ‌క ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ డాక్ట‌ర్ జితేంద్ర సింగ‌ద్‌, డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ(డిఎస్‌టి) దేశీయంగా బ్యాట‌రీల‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేయ‌డానికిమ‌ద్ద‌తు నిస్తున్న‌ద‌ని, ప్ర‌త్యేకింది, గ్రాఫెన్ అధారిత బ్యాట‌రీల సాంక‌తిక ప‌రిజ్ఞానం అభివృద్ధికి కృషి చేస్తున్న‌ద‌ని అన్నారు. అత్యంత‌సాంద్ర‌త క‌లిగిన‌ లి-అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేయడం కోసం గ్రాఫేన్ ర‌క్షిత‌ సి నానో-స్పియర్స్ (ఇంటర్‌కనెక్ట్) ప్రాజెక్ట్‌కి కూడా డిఎస్‌టి మద్దతు ఇచ్చింది.
డిఎస్‌టికింద చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థ అయిన సైన్స్ఇంజ‌నీరింగ్ రిసెర్చ్ బోర్డు (ఎస్ ఇ ఆర్ బి) 42 ప్రాజెక్టుల‌కు మ‌ద్ద‌తు నిచ్చింది.ఇందులో  ప‌లు జాతీయ , అంత‌ర్జాతీయ స‌ద‌స్సులు, వ‌ర్క్ షాపుల కార్య‌క్ర‌మాలు కూడా ఉన్నాయి.భ‌విష్య‌త్ ఇంధ‌న రంగంలో ప్ర‌త్యేకించి అల్యూమినియం అయాన్ బ్యాట‌రీలు, సోడియం అయాన్ బ్యాట‌రీలు, పాలిమ‌ర్ బ్యాట‌రీలు , ప్ర‌త్యేకించి గ్రాఫేన్ ఆధారిత‌బ్యాట‌రీల రంగంలో  విజ్ఞానాన్ని పంచేందుకు చ‌ర్య‌లుతీసుకున్న‌ట్టు తెలిపారు.

భవిష్యత్ శ్రామికశక్తిని సృష్టించేందుకు, భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎకోసిస్టమ్‌ను వేగవంతం చేయడానికి ప్రపంచ స్థాయి , ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు , ప‌రిశోధ‌న అభివృద్ధి మౌలిక సదుపాయాలు , ఆవిష్కరణ కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ సంస్థలను ప్రోత్సహించిందని మంత్రి చెప్పారు.ఇప్ప‌టివ‌ర‌కు 9 ఐఐటిలు మాస్ట‌ర్స్‌, డాక్టొర‌ల్ విద్యా స్థాయిలో విద్యా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయ‌గా మ‌రి కొన్ని ఈ రంగానికి అంకిత‌మైన కేంద్రాల‌ను నెల‌కొల్పాయి.

ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ పౌడ‌ర్ మెట‌ల‌ర్జీ, న్యూమెటీరియ‌ల్స్ (ఎ ఆర్ సిఐ), డిఎస్‌టి కి చెందిన స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సంస్థ‌. ఇది సూప‌ర్ కెపాసిట‌ర్‌, నా -అయాన్‌(సోడియం అయాన్‌0 బ్యాట‌రీకి సంబంధించి భ‌విష్య‌త్ టెక్నాల‌జీ విష‌యంలో మెటీరియ‌ల్స్‌పై ప‌నిచేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల కు లి- అయాన్‌బ్యాటరీల కోసం ఎలక్ట్రోడ్ పదార్థాలను (కాథోడ్ , యానోడ్) పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి  స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఎ ఆర్‌సి ఐ నిమగ్నమై ఉంది.  లిథినియం - అయాన్‌- ఫాస్పేట్ (ఎల్ ఎఫ్‌పి) , లిథునియం టైట‌నేట్ ( ఎల్ టిఒ) కోసం సాంకేతికతలను ఎఆర్ సిఐ  విజయవంతంగా ప్రదర్శించింది, ఇవి లి -అయాన్‌ బ్యాటరీలో కీలక పదార్థాలు.

అధిక శక్తి సాంద్రత , సుదీర్ఘ కాలం మ‌న్నిక‌ను దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష ప్ర‌యోగాల కోసం గ్రాఫైట్ ఆధారిత పదార్థాలు , లిథియం-అయాన్ కణాలను దేశీయంగా త‌యారుచేయ‌డంపై అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌ (ఇస్రో) పని చేస్తోంది. శక్తి సాంద్రత, సైకిల్ లైఫ్ ,భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో స్థూపాకార కణాల ఆధారంగా అధునాతన పదార్థాలపై ప‌రిశోధ‌న‌, అభివృద్ధి ప్రయత్నాలు పురోగతిలో ఉన్నాయి.

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన డిపార్ట‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డిఎఇ), సోడియం అయాన్ కాయిన్‌సెల్‌ను,  200 డ‌బ్ల్యుహెచ్ ప‌ర్ కిలోగ్రామ్ ఇంధ‌న సాంద్ర‌త‌తో దేశీయంగా ఎల‌క్ట్రోడ్ మెటీరియ‌ల్ తో ఫాబ్రికేట్ చేయ‌డం జ‌రిగింది.

ఇక లిథియ‌మ్ అయాన్ బాట‌రీల రంగంలో,చ‌వ‌క గా, ఎల‌క్ట్రోడ్ మెటీరియ‌ల్‌కు లాబ్ స్కేల్ సింథ‌సిస‌స్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప‌లు కంపెనీల‌కు బ‌ద‌లీచేయ‌డం జ‌రిగింది. త‌దుప‌రి త‌రం లి-ఎస్‌బ్యాట‌రీల‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌ర్ద కాథోడ్ మెటీరియ‌ల్ కూడా అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. 

తదుపరి తరం లి - ఎస్‌ బ్యాటరీ కోసం అనేక సమర్థవంతమైన కాథోడ్ మెటీరియ‌ల్ ను అభివృద్ధి చేశారు. పాలిమర్-ఆధారిత ప్రోటాన్ బ్యాటరీ కూడా రూపొందించారు. ఆర్గానిక్ - అకర్బన హైబ్రిడ్ పెరోవ్‌స్కైట్ మెటీరియల్  అనేది 28% కంటే ఎక్కువ ఫోటోవోల్టాయిక్ సామర్థ్యంతో కొత్తగా కనుగొన్న‌ సౌర ఘటం పదార్థం.
ఎజిసియుఎస్‌, ఒక కొత్త రకమైన అధునాతన శక్తి పదార్థం. ఇది మంచి థర్మో-ఎలక్ట్రిక్ లక్షణాలను క‌లిగిన‌ది. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో డిఎఇ, ఎజిసియుఎస్‌, వేస్ట్ ఎనర్జీ హార్వెస్టింగ్ అప్లికేషన్‌ల ఉపయోగం కోసం పని చేస్తోంది.

సెంట్ర‌ల్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఇసిఆర్ ఐ) సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్‌, ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్ (సిఎస్ ఐఆర్‌) భాగంగా ఉన్న సంస్థ‌.ఇది ఇంధ‌న నిల్వ అప్లికేష‌న్ల‌కు సంబంధించి చ‌వ‌క అయిన ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర‌మైన‌ ఐర‌న్ ఆధారిత రెడాక్స్ ఫ్లో బ్యాట‌రీల రంగంలో,  గ్రాఫేన్ ఆధారిత పాలిమ‌న్ నానో కాంపోజిట్‌ల‌ను సూప‌ర్ కెపాసిట‌ర్ అప్లికేష‌న్ల‌లో వాడేందుకు, నా- అయాన్ బాట‌రీల అభివృద్ధికి, అత్యున్న‌త శ‌క్తిగ‌ల లి - అయాన్ బాట‌రీ మెటీరియ‌ల్ కు సంబంధించి దేశీయ సాంకేతిక ప‌రిజ్ఞానం అభివృద్ధికి, ఎల‌క్ట్రో స్ప‌న్ నానొ ఫైబ‌ర్స్‌ను లిథుయ‌మ్ -స‌ల్ఫ‌ర్ బ్యాట‌రీల కోసం ఫంక్ష‌న‌ల్ మెటీరియ‌ల్‌గా ఉప‌యోగించేందుకు, అలాగే కొత్త ఎం.జి.ఎస్ బ్యాట‌రీ కెమిస్ట్రీ, ఎల‌క్ట్రోడ్‌ల‌ను సింథ‌సిస్ కార‌క్ట‌రైజేష‌న్ , సిములేష‌న్స్ ద్వారా అభివృద్ధి చేయ‌డంలో ప‌నిచేస్తోంది.

 

***


(Release ID: 1795304) Visitor Counter : 155


Read this release in: English , Urdu