సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి
Posted On:
03 FEB 2022 5:23PM by PIB Hyderabad
అంతర్జాతీయ కొబ్బరి మార్కెట్‌లో తుది ఉత్పత్తుల (ఫినిష్డ్ ప్రొడక్టుల) అమ్మకాల్లో భారతదేశం వాటా 80 నుండి 85శాతం వరకు ఉంటుందని అంచనా.
2019-–20తో పోలిస్తే 2020–-21 సంవత్సరంలో కాయిర్ కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు విలువ పరంగా 37శాతం, పరిమాణం పరంగా 17.6శాతం పెరిగాయి.
కాయిర్ కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి కోసం భారత ప్రభుత్వం క్రింది ప్రోత్సాహకాలను అందించింది:
(i) ఫ్రీ ఆన్ బోర్డ్ (ఎఫ్ఓబీ) ఎగుమతి విలువపై 0.15శాతం నుండి 1.5శాతం వరకు డ్యూటీని తగ్గించింది.
(ii) ఎగుమతి ఉత్పత్తులపై డ్యూటీలు పన్నుల మినహాయింపు (ఆర్ఓడీటీఈపీ) ఎగుమతి ఎఫ్ఓబీ విలువపై 0.5శాతం నుండి 2.1శాతం వరకు.
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ స్కీమ్ కింద, ఆర్సీఎంసీ ఛార్జీలను రీయింబర్స్ చేయడం, ఇన్సూరెన్స్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్, టెస్టింగ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్ వంటి ప్రయోజనాలను అందిస్తున్నది. మొదటిసారి ఎంఎస్ఈ ఎగుమతిదారుల 'సామర్థ్య పెంపు' లక్ష్యంతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఎంఎస్ఎంఈ యూనిట్లకు అంతర్జాతీయ మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యాప్తిని లక్ష్యంగా చేసుకుని నేషనల్ రిసోర్స్ డేటాబేస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. కోయిర్ బోర్డ్ కూడా అడిగిన ఎంఎస్ఎంఈలకు నాణ్యత తనిఖీ సాయాన్ని అందిస్తోంది.
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 1795302)
Visitor Counter : 138