గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0 కింద ప్రాథమిక పౌర సౌకర్యాల కల్పన 500 నగరాల్లో అమృత్ పథకం అమలు

Posted On: 03 FEB 2022 5:41PM by PIB Hyderabad

దేశంలోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలలో  అన్ని గృహాలకు కుళాయిల ద్వారా ప్రతి ఒక్కరికి మంచి  నీటి సరఫరా చేయాలన్న  లక్ష్యంతో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్)  2.0 అమలు జరుగుతోంది. అమృత్ పథకం  మొదటి దశ అమలు చేసిన  500 నగరాల్లో మురుగునీరు/వ్యర్ధ  నిర్వహణ కార్యక్రమాలను ఈ పథకంలో   అమలు చేయడం జరుగుతుంది. అయిదు సంవత్సరాల 2021-22  22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అమలు జరుగుతుంది. 

 ప్రతి నగరానికి సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్  అభివృద్ధి చేయడం ద్వారా   వృత్తాకార నీటి ఆర్థిక వ్యవస్థను అమృత్ 2.0 అమల్లోకి తెస్తుంది. మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించడం, నీటి వనరుల పునర్జీవనం, జల సంరక్షణ అంశాలకు అమృత్ 2.0 ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కుళాయిల ద్వారా మంచి నీరు సరఫరా చేయడం, జల వనరుల సంరక్షణ, జల వనరులు, బావులను తిరిగి వినియోగం లోకి తీసుకు రావడం, మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం లాంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు అవసరమైన ప్రాజెక్టులను గుర్తించి అమలు చేసేందుకు అమృత్ 2.0 అవకాశం కల్పిస్తుంది.  సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్ ద్వారా వృత్తాకార నీటి ఆర్థిక వ్యవస్థను అమలు చేసి పట్టణాల్లో ' నీటి భద్రత' కల్పించేందుకు అమృత్-2.0 కృషి చేస్తుంది. 

ఆదాయం రాని నీటి వినియోగాన్ని తగ్గించడం, మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకుని రావడం,నీటి వనరుల పునర్జీవనం,డబల్ ఎంట్రీ అకౌంటింగ్ విధానాన్ని అమలు చేయడం, పట్టణ ప్రణాళిక రూపకల్పన, పట్టణ ఆర్ధిక అంశాలను బలోపేతం చేయడం లాంటి సంస్కరణలు అమృత్ 2.0 లో అమలు చేయబడతాయి. 

అమృత్   2.0 ఇతర భాగాలు:

(i) నీటి సమాన పంపిణీమురుగు నీటి పునర్వినియోగంనీటి వనరుల మ్యాపింగ్ మరియు నగరాలు/పట్టణాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి పే జల్ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని అమలు చేయడం

(ii)జల వనరుల రంగంలో  అందుబాటులోకి వచ్చిన  ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి వీలు కల్పించే  సాంకేతిక ఉప-మిషన్ అమలు

(iii) నీటి సంరక్షణ ప్రాధాన్యతపై  ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇన్ఫర్మేషన్ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసీప్రచారం.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్, కింద గ్యాప్ అసెస్‌మెంట్ మరియు సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు నగరాలు సన్నాహాలు చేస్తున్నాయి. సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్   కోసం 24 నవంబర్ 2021 నుంచి   13 జనవరి 2021 వరకు మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల తో సెమినార్లుసదస్సులు  నిర్వహించబడ్డాయి. ఇప్పటివరకు, 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని  3,693 నగరాలు  సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్ రూపొందించే పనిలో వున్నాయి.  వీటిలో  16 రాష్ట్రాల్లోని 1,751 నగరాలు తమ సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్  సమర్పించాయి.

అమృత్  2.0  ఐదు సంవత్సరాల కాలంలో  కేంద్ర వాటా 76,760 కోట్ల రూపాయలతో  సహా మొత్తం 2,99,000 కోట్ల రూపాయల వ్యయంతో అమలు జరుగుతుంది. అమలు జరుగుతున్న అమృత్ పనుల కోసం  మార్చి 2023 వరకు 22,000 కోట్ల రూపాయల నిధులు  (కేంద్ర సహాయంగా 10,000 కోట్లు) విడుదల అయ్యాయి. . 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 124 చట్టబద్ధమైన పట్టణాలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని 143 చట్టబద్ధమైన పట్టణాలు అమృత్ 2.0 పరిధిలోకి వచ్చాయి. ఇప్పటివరకునగరాలుసిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్  లను సిద్ధం చేశాయి మరియు నగర స్థాయిలో ప్రాజెక్టుల రూపకల్పన ప్రారంభమైంది.

కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి  శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు . 

***



(Release ID: 1795290) Visitor Counter : 156


Read this release in: English , Urdu