భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ముఠాగా ఏర్ప‌డి వ్య‌వ‌హ‌రించినందుకు టైర్ ఉత్ప‌త్తిదారులు, వారి అసోసియేష‌న్‌కు జ‌రిమానా విధించిన సిసిఐ

Posted On: 02 FEB 2022 6:47PM by PIB Hyderabad

తాము అమ్మే క్రాస్ ప్లై బ‌యాస్ టైర్ ర‌కాల ధ‌ర‌ల‌ను పెంచేందుకు ముఠాగా  ఏర్ప‌డి, క‌లిసి ప‌ని చేస్తున్న అపోలో టైర్స్ లిమిటెడ్‌, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్‌, జెకె టైర్ అండ్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌, బిర్లా టైర్స్ లిమిటెడ్‌, వారి అనుబంధ ఆటోమేటివ్ టైర్ మాన్యుఫాక్చ‌రర్ అసోసియేష‌న్ (ఎటిఎంఎ)కి వ్య‌తిరేకంగా 31.08.2018న కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తుది ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. వీరి ముఠాగా ఏర్ప‌డ‌డం ద్వారా వీరిలో ప్ర‌తి సంస్థ రీప్లేస్ మెంట్ మార్కెట్‌లో క్రాస్  ప్లై బ‌యాస్ టైర్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం, మార్కెట్‌లో ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా చేయ‌డం, నియంత్రించ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ కాంపిటీష‌న్ చ‌ట్టం, 2002 (ది యాక్ట్‌) లోని సెక్ష‌న్ 3(3)(ఎ), రెడ్ విత్ సెక్ష‌న్ 3 (1) నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించాయి. 
ఎంఆర్ ఎఫ్ లిమిటెడ్ కోరిన‌ట్టుగా మ‌ద్రాసు హైకోర్టు డ‌బ్ల్యు.ఎ. నెం. 529 ఆఫ్ 2018న జారీ చేసిన ఉత్త‌ర్వుల మేర‌కు సిసిఐ పైన పేర్కొన్న ఉత్త‌ర్వుల‌ను సీల్డ్ క‌వ‌ర్‌లో ఉంచింది. అనంత‌రం, మ‌ద్రాస్ హైకోర్టు డివిజ‌న్ బెంచి 06.01.2022న ముందు పేర్కొన్న రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. దీనితో వ్య‌ధ చెందిన టైర్ కంపెనీలు సుప్రీం కోర్టు ఎదుట ఎస్ఎల్‌పీల‌ను దాఖ‌లు చేయ‌గా, 28.01.2022న కోర్టు వాటిని జారీ చేసింది. 
ఈ కేసును కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) చ‌ట్టంలోని సెక్ష‌న్ 19(1)(బి) కింద చేసిన ప్ర‌స్తావ‌న మేర‌కు ప్రారంభించింది. ఈ ప్ర‌స్తావ‌న‌ను ఆలిండ‌యా టైర్ డీల‌ర్స్ ఫెడ‌రేష‌న్ (ఎఐటిడిఎఫ్‌) ఎంసిఎకు అందించిన విజ్ఞ‌ప్తి మేర‌కు చేశారు.  
త‌మ అసోసియేష‌న్ అయిన ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్ (ఎటిఎంఎ) వేదిక ద్వారా టైర్ ఉత్ప‌త్తిదారులు ధ‌ర‌ల‌కు సంబంధించిన సున్నిత‌మైన డాటాను ఇచ్చిపుచ్చుకునేవార‌ని, అంద‌రూ క‌లిసి టైర్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించేవార‌ని క‌మిష‌న్ పేర్కొంది. ఎటిఎంఎ ఉత్ప‌త్తి, దేశీయ అమ్మ‌కాలు, వాస్త‌వ‌కాలంలో టైర్ల ఎగుమ‌తికి సంబంధించి కంపెనీల వారీగా, సెగ్మెంట్ల వారీగా డాటా (అటు నెల‌వారీ, ఇటు సంచిత‌) స‌మాచారాన్ని ఎటిఎంఎ సేక‌రించి, సంక‌ల‌నం చేసింద‌ని క‌మిష‌న్ క‌నుగొంది. త‌ద్వారా సున్నిత‌మైన స‌మాచారాన్ని పంచుకోవ‌డం వ‌ల్ల టైర్ ఉత్ప‌త్తిదారుల మ‌ధ్య స‌మ‌న్వ‌య స‌హ‌కారాలు సుల‌వ‌య్యాయ‌ని కమిష‌న్ పేర్కొంది. 
త‌ద‌నుగుణంగా, ఐదుగురు టైర్ ఉత్ప‌త్తిదారులు, ఎటిఎంఎను చ‌ట్టంలోని సెక్ష‌న్ 3లోని అంశాల‌ను 2011-12లో ఉల్లంఘించిన దోషులుగా సిసిఐ నిర్ధారించింది. ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3 ముఠాలుగా ఏర్ప‌డ‌డం స‌హా పోటీ వ్య‌తిరేక ఒప్పందాల‌ను నిషేధిస్తుంది. 
అపోలో టైర్ల‌పై రూ. 425.53 కోట్లు, ఎంఆర్ెఫ్ లిమిటెడ్‌పై రూ. 622.09 కోట్లు, సియ‌ట్ లిమిటెడ్‌పై రూ.252.16 కోట్లు, జెకె టైర్ల‌పై రూ. 309.95 కోట్లు, బిర్లా టైర్ల‌పై రూ. 178.83 కోట్ల‌ను జ‌రిమానా విధించ‌డ‌మే కాక‌, సీజ్ అండ్ డెసిస్ట్ ఉత్త‌ర్వుల‌ను కూడా సిసిఐ జారీ చేసింది. ఇందుకు అద‌నంగా, ఎటిఎంఎపై రూ.0.084 కోట్ల జ‌రిమానాను విధించింది. స‌భ్య టైర్ కంపెనీలు లేదా ఇత‌ర‌త్రా ద్వారా హోల్‌సేల్‌, రిటైల్ ధ‌ర‌ల వివ‌రాల‌ను సేక‌రించ‌డం నుంచి ఎటిఎంఎ మానుకొని, దూరంగా ఉండాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. 
అంతేకాకుండా. చ‌ట్టంలోని సెక్ష‌న్ 48లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందు పేర్కొన్న టైర్ కంపెనీలు, ఎటిఎంఎకు చెందిన కొంద‌రు వ్య‌క్తుల‌ను, వారి సంబంధిత కంపెనీలు/ సంస్థ  పోటీ వ్య‌తిరేక ప్ర‌వ‌ర్త‌న‌కు బాధ్యులుగా ప‌రిగ‌ణించింది. 
ఉత్త‌ర్వుల‌కు సంబంధించిన ఉత్తర్వులు రిఫ‌రెన్స్‌, కేస్‌. నెం. 08 ఆఫ్ 2013 సిసిఐ వెబ్‌సైట్ పై దిగువ‌న పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా చూడ‌వ‌చ్చు -
https://www.cci.gov.in/sites/default/files/08-of-2013.pdf

***


(Release ID: 1794920) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi