మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

"రిజర్వాయర్‌ లో కేజ్ ఆక్వాకల్చర్: స్లీపింగ్ జెయింట్స్‌" అనే అంశంపై ప్రభుత్వం వెబినార్‌ నిర్వహించింది


మత్స్య రంగానికి సంబంధించిన దాదాపు 100 మంది భాగస్వాములు హాజరయ్యారు

రిజర్వాయర్లలో పటిష్టమైన కేజ్ కల్చర్ వ్యవస్థ అవసరం: శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్

లాభాన్ని పెంచుకోవడానికి వినూత్న మార్గాలను అన్వేషించాలని శాస్త్రవేత్తలు, మత్స్య శాఖలను కోరిన - కార్యదర్శి

Posted On: 28 JAN 2022 7:58PM by PIB Hyderabad

"ఆజాదీ-కా-అమృత్-మహత్సవ్" లో భాగంగా, భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం  ఈ రోజు "కేజ్ ఆక్వాకల్చర్ ఇన్ రిజర్వాయర్: స్లీపింగ్ జెయింట్స్" అనే అంశంపై వెబినార్‌ను నిర్వహించింది.  ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం (జి.ఓ.ఐ) మత్స్య శాఖ (డి.ఓ.ఎఫ్) కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షత వహించారు. జి.ఓ.ఐ. మత్స్య శాఖతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల మత్స్య శాఖల అధికారులు, వివిధ వ్యవసాయ, పశువైద్య, మత్స్య సంబంధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, రైతులు, చేపల చెరువుల యజమానులు, విద్యార్థులు, మత్స్య పరిశ్రమకు చెందిన భాగాస్వాములతో సహా సుమారు వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

డి.ఓ.ఎఫ్., ఫిషరీస్ డెవలప్‌మెంట్ కమీషనర్ శ్రీ ఐ.ఏ. సిద్ధిఖీ స్వాగతోపన్యాసంతో వెబినార్ ప్రారంభమైంది. ముందుగా వెబినార్ ఇతివృత్తం గురించి వివరించడంతో పాటు, ప్రముఖ ప్యానెలిస్టులైన, కార్యదర్శి, శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్; సంయుక్త కార్యదర్శి (ఇన్లాండ్ ఫిషరీస్); శ్రీ సాగర్ మెహ్రా;  ఐ.సి.ఏ.ఆర్.- సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సి.ఐ.ఎఫ్.ఆర్.ఐ), డైరెక్టర్, డాక్టర్. బి. కె. దాస్ మరియు ఇతర భాగస్వాములను వెబినార్ లో పాల్గొన్న వారికి పరిచయం చేయడం జరిగింది. 

కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ స్వైన్ తన ప్రారంభోపన్యాసం లో మత్స్య రంగం అభివృద్ధికి రిజర్వాయర్లు, కేజ్ ఆక్వాకల్చర్  ప్రాముఖ్యత గురించి వివరించారు.  అదేవిధంగా, రైతులకు మంచి రాబడిని నిర్ధారించడానికి, అందుబాటులో ఉన్న మార్కెట్లతో సహా రిజర్వాయర్లలో పటిష్టమైన కేజ్ కల్చర్ వ్యవస్థను కలిగి ఉండాలని శ్రీ స్వైన్ సలహా ఇచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా మరియు దేశీయంగా, విజయగాథల ఉదాహరణల గురించి కూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.  చేపల పెంపకందారులను ప్రోత్సహించడం ద్వారా,  లాభాలను పెంచడం, పెట్టుబడి ఖర్చు తగ్గించడం, జాతుల వైవిధ్యం; రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ వ్యవస్థ ల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం మొదలైన అంశాలలో వినూత్న మార్గాలు, విధానాలను అభివృద్ధి చేయాలని కూడా శ్రీ స్వైన్, శాస్త్రవేత్తలను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల మత్స్య శాఖలను కోరారు. 

జె.ఎస్. (ఇన్‌ల్యాండ్ ఫిషరీస్), శ్రీ సాగర్ మెహ్రా, ముందుగా ప్రసంగిస్తూ, బోనుల వంటి ఎన్‌ క్లోజర్‌ లను ఉపయోగించి చేపల ఉత్పత్తి ని పెంపొందించడంలో రిజర్వాయర్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ ప్రత్యేకతలను క్లుప్తంగా వివరించారు.   నీటి వనరులను వాటి సహజ ఉత్పాదకతను ఉపయోగించడం ద్వారా కేజ్ విధానం సమర్ధవంతంగా ఉపయోగపడుతుందనీ, ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా లాభదాయకంగా ఉంటుందనీ, శ్రీ మెహ్రా తెలియజేశారు.  ఫ్లాగ్‌ షిప్ పధకం - ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై) కింద కేజ్ ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ మత్స్య శాఖ, పెట్టుబడి లక్ష్యాలను నిర్ణయించింది. 

సాంకేతిక విభాగంలో ఐ.సి.ఏ.ఆర్.-సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సి.ఐ.ఎఫ్.ఆర్.ఐ) డైరెక్టర్, డా.బి.కె. దాస్, “కేజ్ ఆక్వాకల్చర్ ఇన్ రిజర్వాయర్: స్లీపింగ్ జెయింట్స్” అనే అంశంపై సమగ్రంగా తెలియజేశారు.  రైతులు, ఇతర భాగస్వాముల కోసం నిర్వహించిన వివిధ నైపుణ్య, సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేజ్ ఆక్వాకల్చర్ వైవిధ్యీకరణ కోసం ఐ.సి.ఏ.ఆర్.-సి.ఐ.ఎఫ్.ఆర్.ఐ. అభివృద్ధి చేసిన వివిధ సాంకేతికతలు, అవకాశాలు, కార్యకలాపాల గురించి కూడా ఆయన వివరించారు. మంచి నిర్వహణ పద్ధతులను అనుసరించి, సహాయక సేవలను అందించడం ద్వారా దేశంలోని రిజర్వాయర్లలో కేజ్ ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని డాక్టర్ దాస్ నొక్కి చెప్పారు. మత్స్య పరిశ్రమకు చెందిన వివిధ దృక్కోణాల కోసం సాంకేతిక నేపథ్యంపై విషయ పరిజ్ఞాన మద్దతు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి సహకరించడానికి సి.ఐ.ఎఫ్.ఆర్.ఐ. సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

ప్రదర్శన అనంతరం మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు,  హేచరీ యజమానులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది తో బహిరంగ చర్చా కార్యక్రమం జరిగింది.  చర్చా కార్యక్రమం అనంతరం,  డి.ఓ.ఎఫ్. అసిస్టెంట్ కమీషనర్ డాక్టర్ ఎస్.కె. ద్వివేది వందన సమర్పణతో, వెబినార్ దిగ్విజయంగా ముగిసింది.

*****



(Release ID: 1793473) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi