రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉమ్మ‌డి స‌ముద్ర విన్యాసం ప‌శ్చిమ్ లెహ‌ర్ (ఎక్స్‌పిఎల్‌-2022)ను నిర్వ‌హించిన వెస్ట‌ర్న్ నావ‌ల్ క‌మాండ్

Posted On: 26 JAN 2022 6:29PM by PIB Hyderabad

ప‌శ్చిమ తీరంలో భార‌త నావికాద‌ళం నిర్వ‌హించిన ఉమ్మ‌డి స‌ముద్ర విన్యాసాలు ప‌శ్చిమ్ లెహ‌ర్ (ఎక్స్‌పిఎల్‌- 2022) 25 జ‌న‌వ‌రి 2022న ముగిసాయి. 
వెస్ట‌ర్న్ నేష‌న‌ల్ క‌మాండ్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ధృవీక‌రించ‌డం, భార‌త నావికాద‌ళం, వైమానిక ద‌ళం (ఐఎఎఫ్‌), భార‌తీయ సైన్యం, కోస్ట్ గార్డ్‌ల మ‌ధ్య అంత‌ర్ సేవ‌ల స‌మ‌న్విత చ‌ర్య‌ల‌ను పెంపొందించే ల‌క్ష్యంతో 20 రోజుల‌పాటు ఈ విన్యాసాలు నిర్వ‌హించారు.
ఎఫ్ఒసి-ఐఎన్‌-సి, వెస్టర్న్ నేష‌న‌ల్ క‌మాండ్ ఆధ్వర్యంలో ఈ విన్యాసం జ‌రిగింది.  
ఈ అంతః వేదిక విన్యాసంలో, భార‌త నావికాద‌ళానికి చెందిన 40కిపైగా నౌక‌లు, జ‌లంత‌ర్జాముల స‌మీక‌ర‌ణ‌, భాగ‌స్వామ్యం ఉన్నాయి. 
ఇందుకు అద‌నంగా, ఐఎఎఫ్ ఎస్‌యు 30 ఎంకెఐ& జాగ్వార్ మారిటైమ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌, ఫ్లైట్ రీఫ్యూయెలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎడ‌బ్ల్యుఎసిలను భార‌తీయ నావికాద‌ళ స‌ముద్ర గ‌స్తీ విమానం పి8ఐ, డోర్నియ‌ర్స్‌ను, ఐఎల్ 38 ఎస్‌డి, మాన‌వ ర‌హిత సీరియ‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌ను, ఎంఐజి 39కె స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్ ల‌ను మోహ‌రించింది. ఈ విన్యాసాల కోసం భార‌తీయ సైన్యానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ బ్యాట‌రీలు స‌హా  వివిధ ప‌రిక‌రాల‌ను మోహ‌రించింది. దీర్ఘ‌కాలిక విరామం త‌ర్వాత, కోస్ట్ గార్డ్‌కు చెందిన అనేక ఒపివిలు, ఎప్‌పివిలు, ఎయిర్ కుష‌న్ వెస్సల్స్ కూడా ప‌శ్చిమ లెహ‌ర్ విన్యాసంలో పాలుపంచుకున్నాయి. 
వాస్త‌విక వ్యూహాత్మ‌క దృష్టాంతంలో వివిధ ర‌కాల ఆయుధాల కాల్పులు, వివిధ ప‌రిస్థితుల కింద కార్యాచ‌ర‌ణ మిష‌న్లు, విధుల ధ్రువీక‌ర‌ణ‌తో పాటు, విన్యాసాల సంద‌ర్భంగా నిర్వ‌హించారు. 
స‌మ‌కాలీన స‌ముద్రతీర స‌వాళ్ళ‌కు స్పందించ‌డంలో, క‌మాండ్ బాధ్యత వ‌హించే ప్రాంతాల‌లో వాస్త‌విక ప‌రిస్థితుల‌లో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఈ వ్యాయామం అన్ని భాగ‌స్వామ్య ద‌ళాల‌కు అవ‌కాశాన్ని ఈ విన్యాసం క‌ల్పించింది.

***(Release ID: 1793009) Visitor Counter : 175


Read this release in: Tamil , English , Urdu , Hindi