విద్యుత్తు మంత్రిత్వ శాఖ
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు అందజేసిన ఎన్‌హెచ్ పిసి
Posted On:
24 JAN 2022 5:25PM by PIB Hyderabad

ఎన్.హెచ్.పి.సి సిఎండి శ్రీ ఎ.కె.సింగ్, హిమాచల్ ప్రదేశ్‌ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాకూర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల చెల్లింపు సూచన పత్రాన్ని ఎన్.హెచ్.పి.సి తరఫున సిమ్లాలో 23.01.2022 న అందజేశారు. ప్రకృతి వైపరీత్యాలు, లేదా రాష్ట్రంలో ఏదైనా విపత్తు సంభవించినపుడు ఈ మొత్తాన్ని బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ,ప్రజలకు నష్టాన్ని తగ్గించేందుకు వినియోగిస్తారు. ప్రతికూల పరిస్థితులలో మానవతా సహాయంగా కూడా దీనిని వినియోగిస్తారు.
.
500 మెగా వాట్ల దుగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి, ఎన్.హెచ్.పి.సి సిఎండిని కోరారు. ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయడానికి అవసరమైన క్లియరెన్సులకు ఎన్.హెచ్‌పిసికి మద్దతు నివ్వనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పంప్‌డ్ స్టోరేజి ప్రాజెక్టులను చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి, ఎన్.హెచ్.పి.సిని కోరారు. ఈ సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1792263)