ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయ సెమీకండక్టర్ చిప్ డిజైన్ సంస్థల నుంచి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్ ఐ) స్కీం కింద దరఖాస్తులకు ఆహ్వానం

Posted On: 16 JAN 2022 6:31PM by PIB Hyderabad

దేశంలో సెమీకండక్టర్ చిప్ డిజైన్ కోసం ఒక ఉత్తేజకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే మొత్తం దృష్టితో, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ (మీటీవై) తన డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్ఐ) పథకం కింద 100 దేశీయ కంపెనీలు, స్టార్ట్-అప్ లు , ఎంఎస్ ఎంఈ ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. 

డిసెంబర్ లో మీటీ ప్రకటించిన డిఎల్ ఐ పథకం కింద, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ఐసిలు), చిప్ సెట్ లు, సిస్టమ్ ఆన్ చిప్స్ (ఎస్ వోసిలు), సిస్టమ్స్ అండ్ ఐపి కోర్స్ , సెమీకండక్టర్ లింక్డ్ డిజైన్ కోసం అభివృద్ధి , సెమీకండక్టర్ డిజైన్ వివిధ దశల్లో దేశీయ కంపెనీలు, స్టార్టప్ లు ,ఎమ్ ఎస్ ఎమ్ ఈ లకు ఆర్థిక ప్రోత్సాహకాలు, డిజైన్ మౌలిక సదుపాయాల మద్దతు ను ఐదు సంవత్సరాల కాలానికి విస్తరించనున్నారు.

డిసెంబర్ లో ప్రభుత్వం ప్రకటించిన ₹76,000 కోట్ల (10 బిలియన్ డాలర్లు) ప్యాకేజీలో భాగంగా ఉన్న ఈ పథకం, సెమీకండక్టర్ రూపకల్పనలో నిమగ్నమైన కనీసం 20 దేశీయ కంపెనీలకు  సహాయం అందించడం, రాబోయే ఐదు సంవత్సరాలలో ₹1500 కోట్లకు పైగా టర్నోవర్ సాధించడానికి వారికి అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మీటీవై కింద పనిచేస్తున్న శాస్త్రీయ సమాజం సి-డిఎసి (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్) డిఎల్ ఐ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.

ఈ పథకంలో మూడు భాగాలు ఉన్నాయి - చిప్ డిజైన్ మౌలిక సదుపాయాల మద్దతు, ఉత్పత్తి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ , డిప్లాయ్ మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్.

చిప్ డిజైన్ మౌలిక సదుపాయాల మద్దతు కింద, అత్యాధునిక డిజైన్ మౌలిక సదుపాయాలకు (ఇడిఎ టూల్స్, ఐపి కోర్స్ ,ఎమ్ పిడబ్ల్యు (మల్టీ ప్రాజెక్ట్ వేఫర్ ఫ్యాబ్రికేషన్) ,సిలికాన్ అనంతర ధ్రువీకరణకు మద్దతు ఇవ్వడానికి , మద్దతు ఇచ్చే కంపెనీలకు దాని ప్రాప్యతను సులభతరం చేయడానికి సి-డిఎసి ఇండియా చిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది.

ప్రొడక్ట్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ కాంపోనెంట్ కింద, సెమీకండక్టర్ డిజైన్ లో నిమగ్నమై  ఆమోదం  పొందిన  దరఖాస్తుదారులకు ప్రతి దరఖాస్తుకు ₹15 కోట్ల పరిమితికి లోబడి అర్హత కలిగిన వ్యయంలో 50% వరకు రీఎంబర్స్ మెంట్ అందిస్తారు. 

డిప్లాయ్ మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కాంపోనెంట్ కింద, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లు (ఐసిలు), చిప్ సెట్ లు, సిస్టమ్ ఆన్ చిప్స్ (ఎస్ వోసిలు), సిస్టమ్స్ , ఐపి కోర్స్ , సెమీకండక్టర్ లింక్డ్ డిజైన్ కోసం  ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులలో సెమీకండక్టర్ డిజైన్ ని ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు ప్రతి అప్లికేషన్ కు ₹30 కోట్ల సీలింగ్ కు లోబడి ఐదు సంవత్సరాలకాలంలో నికర అమ్మకాల టర్నోవర్ లో 6% నుంచి 4% ఇన్సెంటివ్ అందిస్తారు. 

ఈ పథకం కింద ప్రోత్సాహకాలను క్లెయిం చేసుకునే ఆమోదిత దరఖాస్తుదారులు తమ దేశీయ హోదాను నిలుపుకోవడానికి (అంటే, పెట్టుబడి లో 50% కంటే ఎక్కువ నివాసిత భారతీయ పౌరులు/లేదా భారతీయ కంపెనీల ద్వారా ప్రయోజనకరంగా స్వంతం చేసుకోబడుతుంది, ఇవి చివరికి నివాస భారతీయ పౌరుల ఆధీనంలో ఉంటాయి మరియు నియంత్రించబడతాయి) పథకం కింద మూడేళ్ల పాటు ప్రోత్సహించబడతారు. 

పథకం కింద ప్రోత్సాహకాల పంపిణీకి అర్హత పొందడానికి దరఖాస్తుదారుడు త్రెష్ హోల్డ్ ,సీలింగ్ లిమిట్ లను విధిగా చేరుకోవాలి.

జనవరి 1, 2022 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఆన్ లైన్ అప్లికేషన్ లను ఆహ్వానించడం కోసం ప్రత్యేక portal- www.chips-dli.gov.in- అందుబాటు లో ఉంటుంది. రఖాస్తుదారులు పోర్టల్ లో డిఎల్ ఐ పథకం మార్గదర్శకాలను పొందవచ్చు. ఇంకా, పథకం కింద మద్దతు ను పొందడానికి తమను తాము నమోదు చేసుకోవచ్చు.

జాతీయ ప్రాధాన్యత గల  ఉత్పత్తులను గుర్తించడానికి డిఎల్ఐ పథకం గ్రేడెడ్ , ముందస్తు విధానాన్ని తీసుకుంటుంది ఇంకా వాటి సంపూర్ణ లేదా సమీప సంపూర్ణ దేశీకరణ , విస్తరణ కోసం వ్యూహాలను అమలు చేస్తుంది. తద్వారా వ్యూహాత్మక, సామాజిక రంగాలలో దిగుమతి ప్రత్యామ్నాయం , విలువ జోడింపు దిశగా చర్యలు తీసుకుంటుంది.

***
 


(Release ID: 1790390) Visitor Counter : 278


Read this release in: English , Urdu , Hindi , Tamil