భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ నిల్వ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద ~ 130 గిగావాట్ అవర్స్ సామర్థ్యంతో మొత్తం 10 బిడ్‌లు స్వీకరణ

Posted On: 15 JAN 2022 4:22PM by PIB Hyderabad

 స్థానిక ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను అందుకున్న పథకం, ఎందుకంటే బిడ్‌లు అందజేసిన తయారీ సామర్థ్యం 50 గిగావాట్ అవర్స్ కంటే 2.6 రెట్లు

దేశీయంగా  బ్యాటరీ తయారీ కోసం  తాజా పెట్టుబడులను   పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాల ఏర్పాటు 

పర్యావరణపరంగా పరిశుభ్ర, స్థిర, అధునాతన   మరింత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఆధారిత వ్యవస్థగా  భారతదేశం దూసుకుపోవడానికి ఆటోమోటివ్ సెక్టార్  కోసం   అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అమలు

గౌరవ  ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ అకాక్న్క్షలకు అనుగుణంగా  మేక్ ఇన్ ఇండియా  ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రధాన ప్రోత్సాహం

పోస్ట్ చేయడమైనది: 15 జనవరి 2022 4:22PM PIB ఢిల్లీ ద్వారా

భారతదేశంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్ ప్రోగ్రామ్ కింద మొత్తం 10 కంపెనీలు తమ బిడ్‌లను సమర్పించాయి, దీని కోసం 22 అక్టోబర్ 2021న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) ప్రతిపాదన కోసం అభ్యర్థన (RFP) విడుదల చేసింది. ఈ పథకం స్వీకరించడానికి దరఖాస్తులకోసం 14 జనవరి 2022న 11:00:00 గంటల IST వరకు సమయం కేటాయించారు,  టెక్నికల్ బిడ్‌లు 15 జనవరి 2022న తెరిచారు. రెండు సంవత్సరాల వ్యవధిలో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారతదేశంలో తయారు చేసిన బ్యాటరీల అమ్మకాలపై ఐదు సంవత్సరాల వ్యవధిలో ప్రోత్సాహకం పంపిణీ అవుతుంది.

భారతదేశపు బడ్జెట్ ఉత్పాదకతలను పెంపొందించడం కోసం ACC యొక్క యాభై (50) గిగా వాట్ అవర్ (GWh) ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించడం కోసం ₹ 18,100 కోట్ల పెట్టుబడితో 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్'   ఉత్పత్తి ఆధార ప్రోత్సాహక  (PLI) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది.. ఈ పధకం  కింద ప్రభుత్వం  దేశీయతయారీని సాధించడం, అదే సమయంలో భారతదేశంలో బ్యాటరీ తయారీ ధర ప్రపంచవ్యాప్తంగా పోటీగా ఉండేలా చూసుకోవడం.

వాస్తవానుసారమైన సాంకేతికత పద్ధతిలో కార్యక్రమం రూపొందించారు. ఏదైనా అప్లికేషన్‌ను అందించడానికి సెల్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి తగిన అధునాతన సాంకేతికత సంబంధిత ప్లాంట్, యంత్రాలు, ముడి పదార్థాలు  ఇతర మధ్యంతర వస్తువులను ఎంచుకోవడానికి లబ్ధిదారులకు స్వేచ్ఛ  ఉంటుంది.

ACC PLI పథకం కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీల జాబితా క్రింది విధంగా ఉంది:

వరుస సంఖ్య

దరకాస్తుదారుని పేరు

1

రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్

2

హ్యుందాయ్ గ్లోబల్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్

3

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్

4

లూకాస్-TVS లిమిటెడ్

5

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్

6

అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్

7

ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

8

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్

9

లార్సెన్ & టూబ్రో లిమిటెడ్

10

ఇండియా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్

 మొత్తం

~130 గిగా వాట్ అవర్ 

 ఈ కార్యక్రమం దేశీయ తయారీని పెంపొందించే పెట్టుబడిని  దేశంలో పూర్తి దేశీయ సరఫరా గొలుసు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అభివృద్ధి చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు స్థిర నిల్వ రెండింటికీ బ్యాటరీ నిల్వ డిమాండ్ సృష్టిని సులభతరం చేస్తుంది. ఎసిసి పిఎల్‌ఐ స్కీమ్ ముడిచమురు దిగుమతులను గణనీయంగా తగ్గించడం  జాతీయ గ్రిడ్ స్థాయిలో పునరుత్పాదక శక్తి వాటాను పెంచడం వల్ల దేశానికి ఆదా అవుతుందని భావిస్తున్నారు.

అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) (₹18,100 కోట్ల నిధితో ) కోసం ఈ PLI పథకం, ఆటోమోటివ్ రంగానికి ఇప్పటికే ప్రారంభించబడిన PLI పథకం (₹25,938 కోట్ల నిధి) ఏర్పాటు ద్వారా  ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి వేగవంతమైన అనుసరణ పధకం (FAME) (₹10,000 కోట్ల)పెట్టుబడితో  భారతదేశం సాంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత ఆటోమొబైల్ రవాణా వ్యవస్థ నుండి పర్యావరణపరంగా పరిశుభ్రమైన, స్థిరమైన, అధునాతనమైన మరియు మరింత సమర్థవంతంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఆధారిత వ్యవస్థ పురోగమనం చెందుతుంది.

 ప్రధాన మంత్రి  ఆలోచన-  స్వావలంబన  భారతదేశం - ఆత్మ నిర్భర్ భారత్  లకు అనుగుణంగా  ప్రతిధ్వనించే ప్రపంచ స్థాయి ఉత్పాదక గమ్యస్థానంగా పరిశ్రమ శీఘ్ర పురోగతిపై భారతదేశం తన విశ్వాసాన్ని కలిగి ఉంది.(Release ID: 1790274) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi